Suzuki Ertiga Sport FF: ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్.. అప్డేటెడ్ ఫీచర్స్ కూడా..

ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ సుజుకి (Suzuki) 2021 GAIKINDO ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షో (GIIAS) లో సుజుకి ఎర్టిగా స్పోర్ట్ ఎఫ్‌ఎఫ్‌ (Suzuki Ertiga Sport FF) ని వెల్లడించింది. ఇది సాధారణ MPV యొక్క స్పోర్టియర్-లుకింగ్ వెర్షన్, కానీ ఇది చాలా వరకు కాస్మెటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఈ కొత్త మోడల్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Suzuki Ertiga Sport FF: ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్.. అప్డేటెడ్ ఫీచర్స్ కూడా..

కొత్త Suzuki Ertiga Sport FF ఇప్పుడు మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అవి స్టాండర్డ్, స్పోర్ట్ మరియు స్పోర్ట్ ఎఫ్ఎఫ్ వేరియంట్స్. సుజుకి ఎర్టిగా స్పోర్ట్ ఎఫ్‌ఎఫ్‌ చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉండటమే కాకుండా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది. ఇది స్టాండర్డ్ వైట్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ థీమ్‌లో పూర్తి చేయబడింది.

Suzuki Ertiga Sport FF: ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్.. అప్డేటెడ్ ఫీచర్స్ కూడా..

Suzuki Ertiga Sport FF డిజైన్ విషయానికి వస్తే, ఈ వెర్షన్ యొక్క ముందు భాగంలో కొత్త మెష్ గ్రిల్ మరియు ఎయిర్ డ్యామ్, ఫాగ్ ల్యాంప్‌ల చుట్టూ ఇన్వర్టెడ్ ఎల్ షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో రెడ్ కలర్ తో కూడిన స్కర్ట్-టైప్ బంపర్ కూడా ఉంటుంది.

Suzuki Ertiga Sport FF: ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్.. అప్డేటెడ్ ఫీచర్స్ కూడా..

ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, సైడ్ ప్రొఫైల్‌లో స్కర్ట్‌లు, బ్లాక్ డెకాల్స్ మరియు రెడ్ కలర్ యాక్సెంట్‌లతో బ్లాక్-అవుట్ ORVMలు ఉన్నాయి. Ertiga Sport FF వెనుక భాగంలో, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, బూట్‌పై రెడ్ కలర్ మరియు బంపర్ వంటి వాటిని పొందుతుంది. కావున చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇందులో డ్యూయల్-టోన్ థీమ్, బ్లాక్-అవుట్ ఇన్సర్ట్‌లు మరియు డీకాల్స్ వంటివి కూడా ఉన్నాయి. ఈ ఫీచర్స్ అన్నీ కూడా స్టాండర్డ్ సుజుకి ఎర్టిగాలో కనిపించవు.

Suzuki Ertiga Sport FF: ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్.. అప్డేటెడ్ ఫీచర్స్ కూడా..

Ertiga Sport FF స్పోర్టీ అనుభూతిని మరింత పెంచడానికి, దాని లోపలి భాగంలో రెడ్ కలర్ యాక్సెంట్‌లతో కూడిన కొత్త సీట్ అపోల్స్ట్రే ఫీచర్ మరియు IRVM (ఇంటర్నల్ రియర్ వ్యూ మిర్రర్) లో ఇంటిగ్రేటెడ్ రియర్ పార్కింగ్ వ్యూ అందించబడింది. ఎర్టిగా స్పోర్ట్ FF క్యాబిన్ పూర్తిగా బ్లాక్ థీమ్‌లో పూర్తి చేయబడి ఉంటుంది. కావున మంచి స్పోర్ట్ అనుభూతిని అందిస్తుంది.

Suzuki Ertiga Sport FF: ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్.. అప్డేటెడ్ ఫీచర్స్ కూడా..

సుజుకి ఎర్టిగా స్పోర్ట్ ఎఫ్‌ఎఫ్‌ యొక్క లోపలి భాగంలో డ్యాష్‌బోర్డ్‌తో పాటు మందపాటి వుడ్ బార్ ఉపయోగించబడింది. ఇందులోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ MPV లో చాలా అరకు దాని స్టాండర్డ్ ఎర్టిగాలోని ఫీచర్స్ అందించబడతాయి. ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, పుష్-బటన్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్, 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆటోమేటిక్ ఏసీ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Suzuki Ertiga Sport FF: ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్.. అప్డేటెడ్ ఫీచర్స్ కూడా..

ఎర్టిగా స్పోర్ట్ ఎఫ్‌ఎఫ్‌ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-హోల్డ్ కంట్రోల్ మరియు రియర్ పార్కింగ్ కెమెరా ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.

Suzuki Ertiga Sport FF: ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్.. అప్డేటెడ్ ఫీచర్స్ కూడా..

ఇక కొత్త సుజుకి ఎర్టిగా స్పోర్ట్ ఎఫ్ఎఫ్ ఇంజిన్‌ విషయానికి వస్తే, ఇందులో ఎటువంటి మార్పులు లేదని మీరు గ్రహించవచ్చు. కావున ఇందులో 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజిన్ 104 బిహెచ్‌పి పవర్‌ మరియు 138 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

Suzuki Ertiga Sport FF: ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్.. అప్డేటెడ్ ఫీచర్స్ కూడా..

సుజుకి ఎర్టిగా స్పోర్ట్ ఎఫ్‌ఎఫ్‌ ధర RP 258,350,000 నుండి RP 268,150,000 వరకు ఉంటుంది. అంటే భారత కరెన్సీ ప్రకారం దీని ధర రూ. 13.51 లక్షల నుండి రూ. 14.02 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. సుజుకి ఎర్టిగా స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 1.27 లక్షలు మరియు ఎర్టిగా స్పోర్ట్ కంటే రూ. 67,000 వరకు ఎక్కువగా ఉంటుంది.

Suzuki Ertiga Sport FF: ఇప్పుడు మరింత స్పోర్టీ లుక్.. అప్డేటెడ్ ఫీచర్స్ కూడా..

సుజుకి ఎర్టిగా స్పోర్ట్ ఎఫ్‌ఎఫ్‌ మొత్తానికి చాలా స్పోర్టీగా ఉంటుంది. అయితే ఈ కొత్త మోడల్ భారతీయ మార్కెట్లో విడుదలవుతుందా.. లేదా అనే దానిపై కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం అందించలేదు. కావున దీనికి సంబంధించిన మరింత సమాచారం త్వరలో తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, November 13, 2021, 12:17 [IST]
English summary
Suzuki launched new ertiga sport ff in indonesian market details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+