ఈ కారు పేరు Suzuki WagonR Smile.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

మనదేశంలో Maruti Suzuki అందిస్తున్న టాల్ బాయ్ హ్యాచ్‌బ్యాక్ కారు WagonR కి ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కార్లలో ఇది కూడా ఒకటి. దాదాపు రెండు దశాబ్దాలకు ఇది భారత రోడ్లపై పరుగులు తీస్తోంది.

ఈ కారు పేరు Suzuki WagonR Smile.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

మనదేశంలో అత్యంత పాపులర్ అయిన ఈ ఫ్యామిలీ కార్, జపాన్ మార్కెట్లో కూడా అమ్ముడవుతుందని మీకు తెలుసా? జపాన్ లో ఈ కారును Suzuki WagonR Smile అనే పేరుతో విక్రయిస్తున్నారు. అయితే, మనదేశంలో లభిస్తున్న WagonR హ్యాచ్‌బ్యాక్ కి మరియు ఈ WagonR Smile కారుకి డిజైన్ పరంగా భారీ వ్యత్యాసం ఉంది.

ఈ కారు పేరు Suzuki WagonR Smile.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

జపాన్ మార్కెట్లో విడుదలైన Suzuki WagonR Smile కారు అమ్మకాలు సెప్టెంబర్ 10వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. చిన్న ఇంజన్ తో వచ్చిన ఈ చిన్న కారు అక్కడి మార్కెట్లోనే అత్యంత సరసమైన కారుగా మారనుంది. జపనీస్ మార్కెట్లో దీని ధర 1.29 మిలియన్ యెన్ ల నుండి 1.71 మిలియన్ యెన్ ల మధ్యలో ఉంటుంది.

ఈ కారు పేరు Suzuki WagonR Smile.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

అంటే, ప్రస్తుత మారకపు విలువ ప్రకారం మనదేశ కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 8.60 లక్షల నుంచి రూ. 11.39 లక్షల మధ్యలో ఉంటుంది. ఈ ధర రేంజ్ లో ఇది మొత్తం మూడు వేరియంట్‌ లలో లభిస్తుంది. ఈ కొత్త మోడల్ కోసం కంపెనీ WagonR అనే పేరును ఉపయోగించినప్పటికీ, దీని డిజైన్ వాస్తవానికి Suzuki Spacia పై ఆధారపడి ఉంటుంది.

ఈ కారు పేరు Suzuki WagonR Smile.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

జపాన్‌లో 2013 లో ప్రారంభించిన Suzuki Spacia ప్రస్తుతం రెండో తరం వెర్షన్‌లో ఉంది. ఆసక్తికరంగా, WagonR Smile యొక్క బాక్స్ డిజైన్ మరియు స్పేసియా మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. కొత్త Suzuki WagonR Smile కంపెనీ యొక్క స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది.

ఈ కారు పేరు Suzuki WagonR Smile.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

ప్రయాణీకులు కారు లోకి సులువుగా ప్రవేశించేందుకు మరియు నిష్క్రమించేందుకు ఇందులో స్లైడింగ్ డోర్‌ లను ఉపయోగించారు. అంతే కాదు, స్టాండర్డ్ WagonR మోడల్‌తో పోలిస్తే ఈ కారు 45 మి.మీ పొడవుగా ఉంటుంది. ముందు వైపు గుండ్రటి హెడ్‌ల్యాంప్స్ మరియు క్రోమ్ గార్నిష్ గ్రిల్ తో ఇది స్మైలీ ఫేస్ మాదిరిగా కనిపిస్తుంది.

ఈ కారు పేరు Suzuki WagonR Smile.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

ఈ కారు బయటి నుండి చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది మరియు మొదటి చూపులో ప్రజలు దీనిని ఓ మినీవాన్ గా భావించే అవకాశం ఉంది. అయితే, ఈ కొత్త Suzuki WagonR Smile ఓ మినీవ్యాన్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది చుట్టూ బాక్సీ డిజైన్ ను కలిగి ఉంటుంది.

ఈ కారు పేరు Suzuki WagonR Smile.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

దీని డిజైన్ ను గమనిస్తే, కారు ముందు భాగంలో, నాలుగు వృత్తాకార హెడ్‌ల్యాంప్‌లు (రెండు పెద్దవి మరియు రెండు చిన్నవి), ఫ్రంట్ బంపర్ దిగువన గుండ్రటి ఫాగ్ ల్యాంప్స్ మరియు దాని మధ్యలో ఒక క్రోమ్ గ్రిల్ మరియు సుజుకి లోగో ఉన్నాయి. కారుకు ఇరువైపులా సింపుల్ డిజైన్ ఉంటుంది.

ఈ కారు పేరు Suzuki WagonR Smile.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

ఇక వెనుకవైపు డిజైన్ ను గమనిస్తే, నిలువుగా పేర్చబడిన టెయిల్‌లైట్లు కనిపిస్తాయి మరియు కారు రూఫ్‌లైన్ ఫ్లాట్‌గా ఉంటుంది. కస్టమర్ ల ఎంపిక మేరకు ఇందులో అనేక డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లు కూడా ఉంటాయి. డ్యూయల్ టోన్ కలర్ వేరియంట్లలో సైడ్ మిర్రర్లను కూడా రూఫ్ కలర్ లోనే పెయింట్ చేయబడి ఉంటాయి.

ఈ కారు పేరు Suzuki WagonR Smile.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

కొత్త Suzuki WagonR Smile ఒక ఫోర్ సీటర్ కారు. ఈ కారులో నలుగులు ప్రయాణీకులు (డ్రైవర్ తో కలిపి) సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కారులో సెంటర్ కన్సోల్ ఉండదు. గేర్‌బాక్స్ మరియ పార్కింగ్ బ్రేక్ వంటి వాటిని కూడా డ్యాష్‌బోర్డ్ లోనే అమర్చారు.

ఈ కారు పేరు Suzuki WagonR Smile.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

క్యాబిన్ లోపల గమనిస్తే, డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ డ్యూయెల్ టోన్ థీమ్ తో కనిపిస్తుంది. ఏసి వెంట్స్, డోర్ ట్రిమ్స్ మరియు డ్యాష్‌బోర్డ్ పై రోజ్ గోల్డ్ యాక్సెంట్స్ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఈ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ చాలా అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. ఇందులో ఒకే ప్యానెల్ లో అమర్చిన ఏసి వెంట్స్ మరియు 9 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమెంట్ సిస్టమ్ ఉంటుంది.

ఈ కారు పేరు Suzuki WagonR Smile.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

ఈ కారు చిన్నదే మరియు చౌకదే అయినప్పటికీ, కంపెనీ ఇందులో అనేక ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. వీటిలో పుష్ బటన్ స్టార్ట్ మరియు స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో మరియు క్రూయిజ్ కంట్రోల్, అన్ని పవర్ విండోస్ మరియు సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అంశాలను ఇందులో గమనించవచ్చు.

ఈ కారు పేరు Suzuki WagonR Smile.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

ఇంజన్ విషయానికి వస్తే, WagonR Smile కారులో 660 సిసి ఇన్‌లైన్ 3 సిలిండర్ డిఓహెచ్‌సి 12 వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ ను ఉపయోగించారు. ఇది ఐఎస్‌జి ఎలక్ట్రిక్ మోటార్ మరియు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ తో కూడిన మైల్డ్ హైబ్రిడ్ ఆప్షన్‌ తో లభిస్తుంది. ఈ 660 సిసి ఇంజన్ గరిష్టంగా 6,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 49 బిహెచ్‌పి శక్తిని మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 58 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని అన్ని వేరియంట్లు కూడా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి.

Most Read Articles

English summary
Suzuki wagonr smile launched in japan details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X