అతి తక్కువ ధరకే రానున్న సుజుకి జిమ్మీ లైట్; పూర్తి వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ సుజుకి తన జిమ్నీ యొక్క బేస్ వేరియంట్‌ను ఆస్ట్రేలియా మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ ఎంట్రీ లెవల్ మోడల్ అయిన 'జిమ్మీ లైట్' ఆస్ట్రేలియా మార్కెట్లో సరసమైన ధరలకు విడుదల కానుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.

అతి తక్కువ ధరకే సుజుకి జిమ్మీ లైట్; పూర్తి వివరాలు

మార్కెట్లో విడుదల కానున్న ఈ జిమ్మీ లైట్ బేస్ వేరియంట్ ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ లైట్ వెయిట్ బేస్ వేరియంట్ పేరుకి తగినట్లుగా లైట్ వెయిట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ వేరియంట్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

అతి తక్కువ ధరకే సుజుకి జిమ్మీ లైట్; పూర్తి వివరాలు

ఈ జిమ్మీ యొక్క వెలుపలి భాగం గమనించినట్లయితే, ఇందులో హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ లాంప్ మరియు ప్లాస్టిక్ డిజైన్డ్ ఓఆర్విఎమ్ కవర్లు ఉన్నాయి. మొత్తానికి ఈ జిమ్నీ లైట్ చాలా అద్భుతంగా ఉంటుంది.

అతి తక్కువ ధరకే సుజుకి జిమ్మీ లైట్; పూర్తి వివరాలు

ఈ కొత్త సుజుకి జిమ్మీ లైట్ బేస్ వేరియంట్‌లో అల్లాయ్ వీల్స్ కొత్త 15 ఇంచెస్ స్టీల్ రిమ్‌లతో భర్తీ చేయబడ్డాయి. ఇందులో ప్రస్తుతం జిమ్నీలో అందుబాటులో ఉన్న 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కలిగిగి ఉంటుంది. కానీ క్యాబిన్ డిజైన్ లో ఎటువంటి మార్పు లేదు.

అతి తక్కువ ధరకే సుజుకి జిమ్మీ లైట్; పూర్తి వివరాలు

ఈ కొత్త సుజుకి జిమ్మీ లైట్ బేస్ వేరియంట్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఈ ఇంజిన్ లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇందులో 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ కె-సిరీస్ ఇన్-లైన్ డిఓహెచ్సి పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 101 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌కు ప్రామాణికంగా జతచేయబడింది మరియు ఇది 4-స్పీడ్ టార్క్ కెర్న్‌వాటర్ యూనిట్ ఆప్సన్ తో అందించబడుతుంది.

అతి తక్కువ ధరకే సుజుకి జిమ్మీ లైట్; పూర్తి వివరాలు

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ కంపెనీ తన జిమ్నీ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. మారుతి సుజుకి జిమ్ని భారతీయ మార్కెట్లో విడుదల చేయబోయే ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ. ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ కోసం చాలా రోజులనుంచి ఎదురుచూస్తున్నారు.

అతి తక్కువ ధరకే సుజుకి జిమ్మీ లైట్; పూర్తి వివరాలు

కంపెనీ త్వరలో విడుదల చేయనున్న ఈ ఎస్‌యూవీ కోసం ఫీడ్‌బ్యాక్ సేకరిస్తోంది. ఇది జింనీ ఎస్‌యూవీ భారతీయ మార్కెట్‌ కోసం మరింత ప్రత్యేకంగా తయారుచేస్తుంది. ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ కొన్ని కాస్మొటిక్స్ అప్డేట్స్ మరియు కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ పొందే అవకాశం ఉంటుంది.

అతి తక్కువ ధరకే సుజుకి జిమ్మీ లైట్; పూర్తి వివరాలు

ఈ ఎస్‌యూవీని కంపెనీ వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. నివేదికల ప్రకారం కంపెనీ భారతీయ మార్కెట్లో కోసం జిమ్నీ యొక్క 5-డోర్స్ వెర్షన్‌ను తీసుకురానుంది. టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. జిమ్నీ కొత్త వెర్షన్ దాని కొత్త మోడల్ అయిన జిమ్మీ సియెర్రా వెర్షన్ ఆధారంగా ఉంటుంది.

అతి తక్కువ ధరకే సుజుకి జిమ్మీ లైట్; పూర్తి వివరాలు

ఆస్ట్రేలియా మార్కెట్లో జిమ్నీ ఎస్‌యూవీకి భారీ డిమాండ్ ఉన్నందున, వేరియంట్ లైట్‌ను ప్రవేశపెట్టడానికి కంపెనీ సిద్ధమవుతోంది. అయితే కంపెనీ ఈ సుజుకి జిమ్ని లైట్ ధర 2021 ఆగస్టు 1 న ప్రకటించనుంది. ఈ కొత్త వేరియంట్ జపాన్‌లో తయారు చేయబడుతుంది.

Most Read Articles

English summary
Suzuki Jimny Lite Affordable Variant Announced For Australia. Read in Telugu.
Story first published: Saturday, June 19, 2021, 14:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X