రైతులకు గుడ్ న్యూస్.. ట్రాక్టర్ కావాలంటే ఫ్రీగా వాడుకోవచ్చు.. ఎక్కడంటే?

భారతదేశంలో కరోనా రోజురోజుకి చాపకింద నీరులా ప్రవహిస్తూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రజల జీవనం కూడా చాలా కష్టతరమవుతోంది. ఇదిలా ఉంటే దేశానికీ అన్నం పెట్టే రైతు పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఈ సమయంలో రైతులకు సహాయం చేయడానికి ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ (టాఫే) ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది.

రైతులకు గుడ్ న్యూస్.. ట్రాక్టర్ కావాలంటే ఫ్రీగా వాడుకోవచ్చు.. ఎక్కడంటే?

ఈ ప్రాజెక్టు కింద కంపెనీ తమిళనాడులోని చిన్న రైతులకు ట్రాక్టర్‌ను ఉచితంగా రెంట్ కి ఇవ్వడానికి నిర్చయించుకుంది. నివేదికల ప్రకారం, ఈ ప్రాజెక్ట్ వల్ల తమిళనాడులో 50 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అంతే కాకుండా ఈ ప్రయోజనం వల్ల దాదాపు 1.2 లక్షల ఎకరాలలో పంటను పండించడానికి అనుకూలంగా ఉంటుంది.

రైతులకు గుడ్ న్యూస్.. ట్రాక్టర్ కావాలంటే ఫ్రీగా వాడుకోవచ్చు.. ఎక్కడంటే?

ఈ సంవత్సరం మే నుండి ఈ సంవత్సరం జూలై వరకు ఈ ప్రాజెక్ట్ అందుబాటులో ఉంటుంది. భారతదేశంలోని ప్రముఖ ట్రాక్టర్ తయారీదారులలో ఒకరైన టాఫే 16,500 మాస్సీ ఫెర్గూసన్ మరియు 26,800 ఐషర్ ట్రాక్టర్లను రెండు ఎకరాలు లేదా అంతకంటే తక్కువ ఉన్న చిన్న రైతులకు అద్దెకు ఇవ్వనుంది.

MOST READ:భారత్‌లో విడుదలైన 2021 జిఎల్‌ఎ & ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35; ధర & వివరాలు

రైతులకు గుడ్ న్యూస్.. ట్రాక్టర్ కావాలంటే ఫ్రీగా వాడుకోవచ్చు.. ఎక్కడంటే?

తమిళనాడు ప్రభుత్వ ఉజవన్ యాప్ లో రైతులు డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా ట్రాక్టర్లు లేదా వ్యవసాయ పరికరాలను అద్దెకు తీసుకోవచ్చు. తమిళనాడు రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా అధికారుల సహకారంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు.

రైతులకు గుడ్ న్యూస్.. ట్రాక్టర్ కావాలంటే ఫ్రీగా వాడుకోవచ్చు.. ఎక్కడంటే?

ఈ సందర్భంగా టాఫే ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మల్లికా శ్రీనివాసన్ మాట్లాడుతూ "తమిళనాడు ప్రభుత్వం ప్రోత్సాహంతో మరియు సహకారంతో, రాష్ట్రంలోని చిన్న రైతులకు ఈ సర్వీస్ అందించడానికి సంస్థ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు కింద ఎంతోమంది రైతులు లబ్ది పొందుతారు.

MOST READ:ప్రమాదంలో రెండు ముక్కలైన 5 స్టార్ రేటింగ్ పొందిన కారు; పూర్తి వివరాలు

రైతులకు గుడ్ న్యూస్.. ట్రాక్టర్ కావాలంటే ఫ్రీగా వాడుకోవచ్చు.. ఎక్కడంటే?

చిన్న మరియు సన్నకారు రైతులు ఋతుపవనాల కాలంలో మరియు ప్రస్తుతం వర్షాలు ఎక్కువ పడుతున్న సమయంలో మాస్సీ ఫెర్గూసన్ మరియు ఐషర్ ట్రాక్టర్లను ఉచితంగా అద్దెకు తీసుకొని వ్యవసాయానికి తగిన విధంగా ఉపయోగించుకోగలరని ఆయన అన్నారు.

రైతులకు గుడ్ న్యూస్.. ట్రాక్టర్ కావాలంటే ఫ్రీగా వాడుకోవచ్చు.. ఎక్కడంటే?

ఉచిత ట్రాక్టర్ ఫ్రీ రెంటెడ్ ప్రాజెక్టుకు సహకరించినందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరియు తమిళనాడు వ్యవసాయ మంత్రికి సంస్థ కృతజ్ఞతలు తెలిపింది. ఇటీవల, టాఫే తమిళనాడు ప్రభుత్వానికి 500 ఆక్సిజన్ సిలిండర్లను అందించింది. కోవిడ్ 19 తో పోరాదుతున్న స్థానిక ప్రభుత్వానికి తమ వంతు సహాయంగా టాఫే ప్రభుత్వంతో చేతులు కలిపింది.

MOST READ:లాక్‌డౌన్ ఉన్నా.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి.. అయితే భూమ్మీద కాదు.. మరెక్కడనుకుంటున్నారా?

రైతులకు గుడ్ న్యూస్.. ట్రాక్టర్ కావాలంటే ఫ్రీగా వాడుకోవచ్చు.. ఎక్కడంటే?

ప్రస్తుతం కరోనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు చిన్న ఆసుపత్రులకు వైద్య సదుపాయాలు కల్పించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలు కోసం టాఫే కంపెనీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కోటి రూపాయల చెక్కుని అందజేశారు.

Most Read Articles

English summary
TAFE Offers Free Tractor Rental Scheme For Tamilnadu Farmers. Read in Telugu.
Story first published: Tuesday, May 25, 2021, 19:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X