ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న టాటా ఆల్ట్రోజ్; ఎందుకంటే..

టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఆల్ట్రోజ్ కారుతో ఒక్క రోజులో అధిక దూరాన్ని చుట్టినందుకు గానూ ఈ రికార్డ్ దక్కింది. పూణేకి చెందిన దేవ్‌జిత్ సాహో తన టాటా అల్ట్రోజ్ కారుతో ఈ రికార్డు సృష్టించారు.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న టాటా ఆల్ట్రోజ్; ఎందుకంటే..

సాహో తన ఆల్ట్రోజ్ కారుతో 24 గంటల్లో 1,603 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, తన పేరును ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కారుతో పాటుగా నమోదు చేసుకున్నాడు. ఆయన తన కారుతో డిసెంబర్ 15, 2020వ తేదీన సతారా నుండి ప్రయాణం ప్రారంభించి డిసెంబర్ 16, 2020వ తేదీన బెంగళూరుకు చేరుకున్నాడు.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న టాటా ఆల్ట్రోజ్; ఎందుకంటే..

ఈ సమయంలో దేవ్‌జిత్ మొత్తం 1,603 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ ఘనతను సాధించిన తరువాత, ఆల్ట్రోజ్ కారుతో తన అనుభం గురించి సాహో మాట్లాడుతూ.. టాటా ఆల్ట్రోజో కారుతో ఒక్క రోజులో అంత దూరం ప్రయాణించినప్పటికీ, తాను ఎక్కడా కూడా అలసట చెందలేదని తెలిపారు.

MOST READ:ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్న సూపర్ ఉమెన్ వీడియో

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న టాటా ఆల్ట్రోజ్; ఎందుకంటే..

టాటా ఆల్ట్రోజ్ కారు మంచి పనితీరును కలిగి ఉందని, ఈ కారు హైవేలపై మంచి పవర్‌ను చూపించడమే కాకుండా సౌకర్యవంతమైన డ్రైవ్‌ను కూడా అందించిందని ఆయన అన్నారు. ఈ కారు నడపటం చాలా సులువుగా ఉంటుందని, ఇది డ్రైవర్ యొక్క స్వారీ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని సాహో అన్నారు.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న టాటా ఆల్ట్రోజ్; ఎందుకంటే..

టాటా అల్ట్రాజ్ జనవరి 2020లో భారత మార్కెట్లో విడుదలైంది. ఈ మోడల్ రాకతో, దేశీయ విపణిలో టాటా మోటార్స్ ఫేట్ మారిపోయింది. ఈ కారు దేశంలోనే అత్యంత సురక్షితమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో ఒకటిగా నిలిచింది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇటీవలే ఇందులో ఓ టర్బో పెట్రోల్ ఇంజన్ వేరియంట్ కూడా వచ్చి చేరింది.

MOST READ:మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కూల్ రియాక్షన్

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న టాటా ఆల్ట్రోజ్; ఎందుకంటే..

భారత మార్కెట్లో పెట్రోల్ మోడల్ టాటా ఆల్ట్రోజ్ కారు ధరలు రూ.5.69 లక్షల నుండి ప్రారంభమై రూ.8.85 లక్షల వరకూ ఉన్నాయి. అలాగే, డీజిల్ మోడల్ ధరలు రూ.6.99 లక్షల నుండి ప్రారంభమై రూ.9.45 లక్షల వరకూ ఉన్నాయి. ఆల్ట్రోజ్ ఐ-టర్బో ధరలు రూ.7.73 లక్షల నుండి రూ.8.85 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న టాటా ఆల్ట్రోజ్; ఎందుకంటే..

టాటా మోటార్స్ తాజాగా ప్రవేశపెట్టిన ఆల్ట్రోజ్ ఐ-టర్బో వేరియంట్ 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్‌ను మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 11.9 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

MOST READ:భగ్గు మంటున్న పెట్రోల్; వరుసగా 8వ రోజు పెరిగిన ధరలు

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న టాటా ఆల్ట్రోజ్; ఎందుకంటే..

భారత కార్ మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కేవలం 12 నెలల వ్యవధిలోనే 50,000 మందికి పైగా కస్టమర్లను సొంతం చేసుకుంది. ఈ మోడల్ మొత్తం అమ్మకాలలో 90 శాతం సాధారణ పెట్రోల్ ఇంజన్ వేరియంట్ల నుండే వచ్చినట్లు కంపెనీ గతంలో పేర్కొంది. కంపెనీ తాజాగా విడుదల చేసిన టర్బో పెట్రోల్ వేరియంట్లకు కూడా గిరాకీ జోరందుకుంది.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న టాటా ఆల్ట్రోజ్; ఎందుకంటే..

టాటా ఆల్ట్రోజ్ ప్రస్తుతం భారత మార్కెట్లోని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో, మారుతి సుజుకి బాలెనో, కొత్త తరం హ్యుందాయ్ ఐ20, టొయోటా గ్లాంజా వంటి మోడళ్లతో పోటీపడుతుంది. ఈ విభాగంలో టాటా అల్ట్రోజ్ మోడల్‌కి 17 శాతం మార్కెట్ వాటా ఉంది.

MOST READ:రూ. 30 కోట్లతో హెలికాఫ్టర్ కొన్న రైతు.. ఎందుకో తెలుసా ?

Most Read Articles

English summary
Tata Altroz Enters Into India Book Of Records For Covering Maximum Distance In 24 Hours. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X