పెరిగిన టాటా ఆల్ట్రోజ్ కార్ ధరలు; కొత్త ధరల జాబితా

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ ధరలను కంపెనీ సవరించింది. ఆగస్టు 2021 నెలలో టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.20,000 మేర పెరగగా, డీజిల్ వేరియంట్ల ధరలు రూ.23,000 మేర పెరిగాయి.

పెరిగిన టాటా ఆల్ట్రోజ్ కార్ ధరలు; కొత్త ధరల జాబితా

టాటా ఆల్ట్రోజ్ ధరలతో పాటుగా కంపెనీ ఇటీవల తమ నెక్సాన్, టియాగో మరియు టిగోర్ మోడళ్ల ధరలను కూడా పెంచిన సంగతి తెలిసినదే. తాజా ధరల పెంపు అనంతరం టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.5.99 లక్షల నుండి రూ.8.70 లక్షలకు పెరిగాయి. టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ వేరియంట్ల ధరలు XE రూ.20,000, XM మరియు XM+ రూ.4000, XT రూ.9500, XZ రూ.6500, XZ (O) మరియు XZ+ రూ.3500 మేర పెరిగాయి.

పెరిగిన టాటా ఆల్ట్రోజ్ కార్ ధరలు; కొత్త ధరల జాబితా

కాగా, టాటా ఆల్ట్రోజ్ టర్బో పెట్రోల్ వేరియంట్ ధరల విషయానికి వస్తే, ఆల్ట్రోజ్ XT వేరియంట్ ధర రూ.8500, XZ వేరియంట్ ధర రూ.6500 మరియు XZ+ వేరియంట్ ధర రూ.3500 మేర పెరిగాయి. ధరల పెంపు అనంతరం వీటి ధరలు వరుసగా రూ.8.02 లక్షలు, రూ.8.72 లక్షలు మరియు రూ.9.09 లక్షలకు చేరుకున్నాయి.

పెరిగిన టాటా ఆల్ట్రోజ్ కార్ ధరలు; కొత్త ధరల జాబితా

ఇక టాటా ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ల ధరస విషయానికి వస్తే, వీటి ధరలు రూ.7.04 లక్షల నుండి రూ.9.59 లక్షలకు పెరిగాయయి. ఇందులో XE వేరియంట్ ధర రూ.23,000 మేర పెరగగా, XM వేరియంట్ ధర రూ.4000, XT వేరియంట్ ధర రూ.9500, XZ వేరియంట్ ధర రూ.6500, XZ (O) మరియు XZ+ వేరియంట్ల ధరలు రూ.3500 మేర తగ్గించబడ్డాయి.

పెరిగిన టాటా ఆల్ట్రోజ్ కార్ ధరలు; కొత్త ధరల జాబితా

ఇంతకు ముందు ఈ ఏడాది జనవరి మరియు మే నెలల్లో కంపెనీ ఈ కారు ధరలను పెంచిన సంగతి తెలిసినదే. ముడిసరుకుల ధరల పెరుగుదలే ధరల పెరుగుదలకు కారణమని టాటా మోటార్స్ తెలిపింది. కాగా, ఇప్పుడు ఈ ఏడాది ఆగస్టు నెలలో టాటా మోటార్స్ తమ కార్ల ధరలను పెంచడం ఇది మూడవసారి.

పెరిగిన టాటా ఆల్ట్రోజ్ కార్ ధరలు; కొత్త ధరల జాబితా

టాటా మోటార్స్ ఇటీవలే తమ ఆల్ట్రోజ్ మోడల్‌లో డార్క్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ డార్క్ ఎడిషన్ మోడళ్లలో వెలుపలి వైపు నిగనిగలాడే బ్లాక్ పెయింట్ స్కీమ్, ముందు భాగంలో పియానో బ్లాక్ ఫినిష్‌లో డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, బ్లాక్ క్రోమ్ లైనింగ్ మరియు బ్లాక్ ఎయిర్ వెంట్స్ ఉంటాయి. సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే, అల్లాయ్ వీల్స్‌ను మ్యాట్ బ్లాక్ కలర్‌లో పెయింట్‌లో చేయబడి ఉంటాయి.

పెరిగిన టాటా ఆల్ట్రోజ్ కార్ ధరలు; కొత్త ధరల జాబితా

స్టాండర్డ్ మోడళ్లతో పోల్చుకుంటే, ఈ డార్క్ ఎడిషన్ మోడళ్లు కాస్తంత అధిక ధరను కలిగి ఉంటాయి. అయినప్పటికీ, ఇవి ధరకు తగిన ప్రీమియం ఫీచర్లను ఆఫర్ చేస్తాయి. ఈ డార్క్ ఎడిషన్ మోడళ్లలో ఎక్స్టీరియర్‌పై ప్రత్యేకమైన బ్లాక్ కలర్ పెయింటింగ్ ఉంటుంది. లోపలి భాగం కూడా ఎక్స్టీరియర్ థీమ్‌కు మ్యాచ్ అయ్యేలా ఆల్-బ్లాక్ ఇంటీరియర్స్‌ని కలిగి ఉంటుంది.

పెరిగిన టాటా ఆల్ట్రోజ్ కార్ ధరలు; కొత్త ధరల జాబితా

ఈ స్పెషల్ ఎడిషన్ డార్క్ మోడళ్లలో ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో కాస్మెటిక్ మార్పులు మినహా యాంత్రికంగా మరియు ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు లేవు. స్టాండర్డ్ మోడళ్లలో లభించే అన్ని ఫీచర్లు మరియు అవే ఇంజన్, గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇందులో కూడా ఉంటాయి.

పెరిగిన టాటా ఆల్ట్రోజ్ కార్ ధరలు; కొత్త ధరల జాబితా

టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ విషయానికి వస్తే, ఇది 1.2-లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ టర్బో-ఛార్జ్డ్ డీజల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 84 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పెరిగిన టాటా ఆల్ట్రోజ్ కార్ ధరలు; కొత్త ధరల జాబితా

కాగా, ఇందులోని 1.5-లీటర్ టర్బో-ఛార్జ్డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్ డార్క్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.8.71 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

టాటా మోటార్స్ యొక్క టాటా ఆల్ట్రోజ్ కార్లు చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకూండా మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. కావున అహనదారులకు చాలా అనుకూలంగా ఉండటం వల్ల టాటా ఆల్ట్రోజ్ కార్లు దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందాయి. అయితే ప్రస్తుతం పెరిగిన ధరలు అమ్మకాలపై ఎటువంటి ప్రభావం ఉంటుందో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Tata altroz hatchback price increased upto rs 20000 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X