ఆల్ట్రోజ్ ఐటర్బో వేరియంట్ ఆవిష్కరించిన టాటా మోటార్స్ ; వివరాలు
టాటా మోటార్స్ తన ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐటర్బో వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో మోడల్ కనెక్టెడ్ టెక్నాలజీని ప్రవేశపెట్టడంతో పాటు అనేక కొత్త ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉంది.

టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో బుకింగ్స్ జనవరి 14 నుండి దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుంది. అంతే కాకుండా దీనితో పాటు రేపటి నుండి డీలర్‌షిప్‌లకు చేరుకోవడం ప్రారంభమవుతుంది మరియు వినియోగదారులు టెస్ట్ రైడ్ కూడా తీసుకోవచ్చు. కొత్త టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో అమ్మకాలు జనవరి 22 నుండి ప్రారంభమవుతుంది. దేని ధర కూడా అదే రోజున తెలుస్తుంది.

అల్ట్రోస్ ఐటర్బో ఎక్స్‌టి, ఎక్స్‌జెడ్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ అనే మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది. ఇది మాత్రమే కాకుండా కంపెనీ ఆరు వేరియంట్ల ఎంపికలో అల్ట్రోస్‌ను అందిస్తోంది. ఐటర్బో బ్యాడ్జ్ ఇచ్చినప్పటికీ, దాని డిజైన్ మరియు స్టైల్‌లో పెద్ద మార్పులు చేయలేదు.

టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 108 బిహెచ్‌పి శక్తిని మరియు 140 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇంజిన్ మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్‌లను కూడా కలిగి ఉంది. ఇందులో స్పోర్ట్ మరియు సిటీ మోడ్లు అత్యుత్తమ పనితీరుని అందిస్తాయి.

ఇది సాధారణ పెట్రోల్ ఇంజన్ కంటే 28 శాతం ఎక్కువ శక్తిని మరియు 24 శాతం ఎక్కువ టార్క్ అందిస్తుంది. అల్ట్రోస్ ఐటర్బో కేవలం 11.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కొత్త ఇంజిన్, దాని సస్పెన్షన్ మొదలైన వాటిలో సాధారణ మార్పులు చేయబడ్డాయి.

టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో టాటా యొక్క ఐఆర్ఎ టెక్నాలజీని కలిగి ఉంది, ఈ కనెక్టివిటీ టెక్నాలజీ ద్వారా, మల్టిపుల్ ఫంక్షన్స్ సద్వినియోగం చేసుకోవచ్చు, అంతే కాకుండా హింగ్లిష్ కమాండ్స్, ఎక్స్‌ప్రెస్ కూల్, పుష్ స్టార్ట్ మరియు స్టాప్ ఫంక్షన్ మొదలైనవి ఇందులో ఉంటాయి.

టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో స్టాండర్డ్ బ్లాక్ రూఫ్, లెదర్ అప్హోల్స్టరీ, రివర్స్ కెమెరా, 2 అదర్ ట్వీటర్లు, క్రూయిజ్ కంట్రోల్, పెరిమెట్రిక్ అలారం సిస్టమ్, ఫాగ్ లాంప్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, 7-ఇంచ్ టచ్ స్క్రీన్, మల్టీ స్పోక్ స్టీరింగ్ వీల్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి.

ఇక సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఇబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సెంట్రల్ లాకింగ్, ఐసోఫిక్స్, మల్టీ డ్రైవ్ మోడ్, ఫ్రంట్ పవర్ విండోస్, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్ మరియు టిల్ట్ స్టీరింగ్ మొదలైనవి ఇవ్వబడ్డాయి. ఈ కొత్త కలర్ ఆప్షన్‌తో పాటు హార్పర్ బ్లూ కూడా దీనికి జోడించబడింది.

టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో భారత మార్కెట్లో కొత్త హ్యుందాయ్ ఐ 20 టర్బో, పోలో టిఎస్ఐ (ఎటి) మరియు బాలెనో సివిటి, హోండా జాజ్ సివిటి మరియు టయోటా గ్లాంజా సివిటిలకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ యొక్క టర్బో వెర్షన్‌కు భారత మార్కెట్లో వినియోగదారుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications