టాటా నుండి మరో ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. ఈసారి రాబోయేది Tata Altroz EV

భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో గణనీయమైన వాటాను దక్కించుకునేందుకు దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) శరవేగంగా పావులు కదుపుతోంది. ఈ విభాగంలో ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీ (Nexon EV), టాటా టిగోర్ ఈవీ (Tigor EV) మరియు వాణిజ్య వినియోగం కోసం టాటా ఎక్స్‌ప్రెస్-టి (Xpres-T EV) వంటి ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న టాటా మోటార్స్ త్వరలోనే మరో కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

టాటా నుండి మరో ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. ఈసారి రాబోయేది Tata Altroz EV

టాటా మోటార్స్ యొక్క పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) లో కూడా కంపెనీ ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. టాటా మోటార్స్ వచ్చే ఐదేళ్లలో 10 కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలని యోచిస్తోంది. కంపెనీ నుండి రాబోయే కొత్త మోడళ్లలో టాటా ఆల్ట్రోజ్ ఈవీ (Tata Altroz EV) కూడా ఒకటి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టాటా మోటార్స్ నుండి తదుపరిగా రాబోయే ఎలక్ట్రిక్ కారు కూడా ఇదే కావడం విశేషం.

టాటా నుండి మరో ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. ఈసారి రాబోయేది Tata Altroz EV

భారతదేశంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ తమ ఇతర ఎలక్ట్రిక్ కార్లతో పాటుగా టాటా ఆల్ట్రోజ్ ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) ని కూడా ఆవిష్కరించింది. వాస్తవానికి, ఇది 2020 ద్వితీయార్ధంలో ప్రారంభించబడుతుందని అందరూ భావించారు, కానీ కోవిడ్-19 సంక్షోభం కారణంగా, ఈ కారు విడుదల మరింత ఆలస్యమైంది. అయితే, తాజా వార్త ఏంటంటే, ఇకపై ఈ నిరీక్షణ ఎక్కువ కాలం ఉండదని కంపెనీ వర్గాలు తెలిపాయి.

టాటా నుండి మరో ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. ఈసారి రాబోయేది Tata Altroz EV

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, కొత్త టాటా ఆల్ట్రోజ్ ఈవీ ఎలక్ట్రిక్ కారు వచ్చే ఏడాది ప్రథమార్థంలో భారత మార్కెట్లో విక్రయించబడుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని మాత్రం టాటా మోటార్స్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. గత ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ ప్రదర్శించిన ప్రీ-ప్రొడక్షన్ మోడల్ చూడటానికి, స్టాండర్డ్ పెట్రోల్ వెర్షన్ అల్ట్రోజ్ కారు మాదిరిగానే ఉంటుంది. అయితే, ఇది ఎలక్ట్రిక్ వెర్షన్ అని హైలైట్ చేయడానికి కంపెనీ ఇందులో క్రోమ్‌ యాక్సెంట్స్ కి బదులుగా బ్లూ హైలైట్‌లను జోడించింది.

టాటా నుండి మరో ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. ఈసారి రాబోయేది Tata Altroz EV

ఈ కారులో ఇంజన్ లేకపోవడం వలన, పెట్రోల్ కారు కన్నా ఇందులో ఎక్కువ లగేజ్ రూమ్ మరియు క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. కారు దిగువ భాగంలో బ్యాటరీ ప్యాక్ ను జోడించినప్పటికీ, దాని గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో మాత్రం కంపెనీ ఎక్కడా రాజీ పడలేదు. అదనంగా, ఈ భారీ బ్యాటరీ ప్యాక్ కారు యొక్క గురుత్వాకర్షణ కేంద్రాన్ని తగ్గించడంలో కూడా సహకరిస్తుంది. కాబట్టి, ఈ హ్యాచ్‌బ్యాక్ హ్యాండ్లింగ్ మరింత ఉత్తమంగా, సున్నితంగా ఉంటుంది.

టాటా నుండి మరో ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. ఈసారి రాబోయేది Tata Altroz EV

టాటా ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ కారులో పవర్‌ట్రైన్ మరియు కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా, మిగిలిన అన్ని పరికరాలు మరియు ఫీచర్లు సాంప్రదాయ IC (ఇంటర్నల్ కంబషన్) ఇంజన్‌తో నడిచే పెట్రోల్/డీజిల్ ఆల్ట్రోజ్ కార్ల మాదిరిగానే ఉంటాయి. టాటా మోటార్స్ విక్రయిస్తున్న నెక్సాన్ ఈవీ మరియు టిగోర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగానే ఆల్ట్రోజ్ ఈవీ కూడా ఈ బ్రాండ్ యొక్క లేటెస్ట్ జిప్‌ట్రాన్ (Ziptron) టెక్నాలజీని కలిగి ఉంటుంది.

టాటా నుండి మరో ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. ఈసారి రాబోయేది Tata Altroz EV

టాటా జిప్‌ట్రాన్ టెక్నాలజీ ఆధారంగా తయారయ్యే ఎలక్ట్రిక్ కార్లు మెరుగైన రేంజ్ మరియు డ్రైవింగ్ డైనమిక్స్‌ని కలిగి ఉంటాయి. ప్రస్తుతానికి, టాటా ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ కారు యొక్క పవర్‌ట్రైన్ గణాంకాలు తెలియనప్పటికీ, ఇది టాటా టిగోర్ ఈవీ మాదిరిగానే ఒకేరకమైన ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్ లను కలిగి ఉంటుందని అంచనా. ఆల్ట్రోజ్ ఈవీ పూర్తి చార్జ్ పై సుమారు 250 కిమీ నుండి 300 కిమీ లకు పైగా డ్రైవింగ్ రేంజ్ ను కలిగి ఉండే అవకాశం ఉంది.

టాటా నుండి మరో ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. ఈసారి రాబోయేది Tata Altroz EV

ఈ ఎలక్ట్రిక్ కారులో ఉపయోగించబోయే బ్యాటరీ ప్యాక్ స్టాండర్డ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్‌ నెట్‌వర్క్ లను సపోర్ట్ చేస్తుంది. సమాచారం ప్రకారం, ఈ కారులోని బ్యాటరీలను కేవలం 60 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే, తాజా నివేదికల ప్రకారం, టాటా అల్ట్రోజ్ ఎలక్ట్రిక్ కారులో, టిగోర్ ఈవీ కన్నా పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంటుందని సమాచారం. ఫలితంగా, ఇది సింగిల్ చార్జ్‌పై 500 కి.మీ వరకు డ్రైవింగ్ రేంజ్ ని అందించవచ్చని భావిస్తున్నారు.

టాటా నుండి మరో ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. ఈసారి రాబోయేది Tata Altroz EV

ఇటీవలి కాలంలో, ఎలక్ట్రిక్ వాహనాలను కోరుకునే కస్టమర్లు అధిక రేంజ్ కలిగిన వాహనాల పట్ల ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, కంపెనీ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే, అల్ట్రోజ్ ఈవీలో ఆఫర్ చేయబోయే పెద్ద బ్యాటరీ ప్యాక్ ను కంపెనీ తమ పాపులర్ నెక్సాన్ ఈవీలో కూడా కొనసాగించవచ్చని అంచనా. ప్రస్తుతం, టాటా నెక్సాన్ ఈవీ యొక్క సర్టిఫైడ్ రేంజ్ పూర్తి చార్జ్‌పై 312 కిలోమీటర్లు కాగా, టిగోర్ ఈవీ యొక్క సర్టిఫైడ్ రేంజ్ పూర్తి చార్జ్‌పై 306 కిలోమీటర్లుగా ఉంది.

టాటా నుండి మరో ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. ఈసారి రాబోయేది Tata Altroz EV

టాటా ఆల్ట్రోజ్ ఈవీకి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న నెలల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. మార్కెట్లో ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు ధర సుమారు రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. కొత్త టాటా నెక్సాన్ ఈవీలో ఇప్పటికే చేర్చబడిన కొత్త జీకనెక్ట్ (ZConnect) అప్లికేషన్‌ ను టాటా ఆల్ట్రోజ్ ఈవీలో కూడా ఆఫర్ చేయవచ్చని సమాచారం. ఇది యూజర్లకు వివిధ రకాల స్మార్ట్ కనెక్టింగ్ ఫీచర్లను అందించనుంది.

టాటా నుండి మరో ఎలక్ట్రిక్ కారు వస్తోంది.. ఈసారి రాబోయేది Tata Altroz EV

టాటా మోటార్స్ సంస్థ యొక్క ఇటీవలి ట్రెండ్ ను గమనిస్తే, ఇప్పుడు ఈ బ్రాండ్ నుండి ఏ కారు మార్కెట్లోకి వచ్చినా అది కొద్ది రోజుల్లోనే గొప్ప విజయాన్ని సాధిస్తోంది. తాజాగా వచ్చిన టాటా పంచ్ (Tata Punch) మైక్రో ఎస్‌యూవీనే ఇందుకు అతిపెద్ద నిదర్శనం. టాటా కార్లు బిల్డ్ క్వాలిటీ మరియు సేఫ్టీ విషయంలో శభాష్ అనిపించుకుంటున్నాయి. అంతేకాకుండా, ఈ కంపెనీ రూపొందించిన కార్లు గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులలో కూడా మంచి సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, రాబోయో ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ కారు కూడా మంచి విజయం సాధించవచ్చని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Tata altroz to get ev powertrain india launch expected next year details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X