Just In
- 8 min ago
డీలర్ల వద్దకు ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్!
- 1 hr ago
ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!
- 1 hr ago
టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?
- 2 hrs ago
చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!
Don't Miss
- Movies
కరోనా విలయతాండవం: షూట్ కి రాలేనన్న సీనియర్ నటుడు..అర్ధాంతరంగా ఆగిన షూట్?
- Finance
కరోనా-లాక్‌డౌన్‌పై మరోసారి తేల్చి చెప్పిన నిర్మలా సీతారామన్
- Sports
'తొలి టెస్టు అనంతరం జట్టులో చోటు దక్కక పోవడం బాధించింది.. నా టెక్నిక్ గురించి కలత చెందా'
- News
కరోనా ఎఫెక్ట్ ... బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ పర్యటన వాయిదా
- Lifestyle
ఇలా చేస్తే బలహీనమైన జుట్టు సహజంగా బలపడుతుంది..కొత్త జుట్టు వస్తుంది..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్ - ఫొటోలు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారులో కంపెనీ ఓ టర్బో వేరియంట్‌ను ఈనెల 13వ తేదీన ప్రవేశపెట్టనుంది. టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌కు సంబంధించి కంపెనీ ఇప్పటికే కొన్ని టీజర్లను కూడా విడుదల చేసింది.

కాగా, తాజాగా టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్ టెలివిజన్ కమర్షియల్ చిత్రీకరిస్తుండగా, ఇందుకు సంబంధించిన స్పై చిత్రాలు వెల్లడయ్యాయి. దీంతో విడుదలకు ముందే టాటా ఆల్ట్రోజ్ డిజైన్, కలర్ స్కీమ్ మొదలైన వివరాలు లీక్ అయ్యాయి. గోవాలో ఈ మోడల్ కోసం టివిసి షూట్ చేస్తుండగా ఆదిత్యా టెండుల్కర్ అనే నెటిజెన్ తన కెమెరాలో ఈ ఫొటోలను బంధించాడు.

జనవరి 13, 2021వ తేదీ మార్కెట్లో విడుదల కానున్న కొత్త టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్ ఇప్పుడు స్టైలిష్ మరీనా బ్లూ కలర్ ఆప్షన్‌లో లభ్యం కానుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కారులో ఆ కలర్ ఆప్షన్ అందుబాటులో లేదు. అంతేకాకుండా, ఈ కొత్త వేరియంట్ వెనుక డోరుపై చివర్లో టర్బో అనే బ్యాడ్జ్ కూడా ఉంటుంది.
MOST READ:ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రావడానికి సిద్దమవుతున్న టాటా నానో : వివరాలు

ఈ స్పై చిత్రాలను గమనిస్తే, స్టాండర్డ్ ఆల్ట్రోజ్‌కి టర్బో వేరియంట్ డిజైన్ పరంగా ఎలాంటి వ్యత్యాసాలు లేనుట్లు తెలుస్తోంది. ఇందులోని అల్లాయ్ వీల్స్ కూడా మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్నాయి. ఇందులో కొత్తగా మరీనా బ్లూ కలర్ పెయింట్ స్కీమ్ మాత్రమే కనిపిస్తోంది.

టాటా మోటార్స్ తమ ఆల్ట్రోజ్ కారును మొట్టమొదటిసారిగా జనవరి 2020లో ప్రారంభించింది. ఇది బ్రాండ్ యొక్క ‘ఆల్ఫా' ఆర్కిటెక్చర్ నుండి వచ్చిన మొదటి ఉత్పత్తి. సరిగ్గా ఏడాది తర్వాత కంపెనీ ఇందులో ఇప్పుడు కొత్తగా ఓ టర్బో-పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది.
MOST READ:కొత్త హ్యుందాయ్ ఐ 20 బుకింగ్స్ హవా.. ఇప్పటికీ తగ్గని జోరు

కొత్త టాటా ఆల్ట్రోజ్ ‘టర్బో' వేరియంట్‌లో ఉపయోగించబోయే విషయానికి వస్తే, టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఉపయోగిస్తున్న అదే 1.2-లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌నే ఇందులోనూ ఉపయోగిస్తున్నాయి. అయితే, ఆల్ట్రోజ్ టర్బో కోసం ఈ ఇంజన్‌ను రీట్యూన్ చేశారు.

టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌లోని ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పిల శక్తిని మరియు 150 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కాగా, టాటా నెక్సాన్‌లో ఉపయోగించే అదే ఇంజన్ గరిష్టంగా 118 బిహెచ్‌పిల శక్తిని మరియు 170 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:కొత్త మహీంద్రా థార్ కొనుగోలు చేసిన మలయాళీ సెలబ్రెటీ, ఎవరో చూసారా ?

ప్రస్తుతానికి టాటా ఆల్ట్రోజ్ టర్బో-పెట్రోల్ వేరియంట్ స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే లభ్యం కానుంది. అయితే, ఇందులో ఓ 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా అభివృద్ధి దశలో ఉంది. రానున్న రోజుల్లో ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా ఆల్ట్రోజ్ కారులో లభించే అవకాశం ఉంది.

టాటా ఆల్ట్రోజ్ కారులో టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను మిడ్ మరియు టాప్ ఎండ్ వేరియంట్‌లలో మాత్రమే ఆఫర్ చేయవచ్చని సమాచారం. స్టాండర్డ్ ఆల్ట్రోజ్ మోడళ్లతో పోలిస్తే ఆల్ట్రోజ్ టర్బో ధరలు కూడా అధికంగా ఉండనున్నాయి. మార్కెట్ అంచనా ప్రకారం, కొత్త టాటా ఆల్ట్రోజ్ టర్బో ప్రారంభ ధర రూ.8 లక్షలు, ఎక్స్-షోరూమ్‌గా ఉండొచ్చని తెలుస్తోంది.
MOST READ:న్యూ ఇయర్‌లో భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

ఇకపోతే, స్టాండర్డ్ టాటా ఆల్ట్రోజ్ రెండు రకాల ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇందులో మొదటిది 1.2-లీటర్, త్రీ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ ఇది. గరిష్టంగా 85 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇకపోతే రెండవది 1.5-లీటర్, ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్, ఇది గరిష్టంగా 89 బిహెచ్‌పి పవర్‌ను మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తాయి. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.