Just In
- 1 hr ago
3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
- 1 hr ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
- 2 hrs ago
టీవీఎస్ ఎక్స్ఎల్ 100 విన్నర్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు
- 16 hrs ago
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
Don't Miss
- News
నాన్సీ ల్యాప్‌టాప్ చోరీ? రష్యా ఇంటలిజెన్స్‌కు చేరవేసే ప్లాన్.. ఎఫ్‌బీఐ అఫిడవిట్లో సంచలనాలు..
- Sports
వికెట్ కీపర్‌గా పంత్ అరుదైన రికార్డు.. ధోనీ కన్నా వేగంగా!!
- Finance
Gold prices today : స్థిరంగా బంగారం ధరలు, వెండి ధరలు జంప్
- Lifestyle
మీరు ఎప్పుడూ ఎందుకు అలసిపోతున్నారు?అందుకు సాధారణ కారణాలు ఇక్కడ ఉన్నాయి..
- Movies
Master box office: 6వ రోజు కూడా పవర్ఫుల్ కలెక్షన్స్.. విజయ్ మరో బిగ్గెస్ట్ రికార్డ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విడుదలకు ముందే టాటా ఆల్ట్రోజ్ టర్బో పెట్రోల్ వేరియంట్ వివరాలు లీక్!
టాటా మోటార్స్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆల్ట్రోజ్ టర్బో పెట్రోల్ వేరియంట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ ఈనెల 13వ తేదీన అధికారికంగా విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. అయితే, ఈ మోడల్ విడుదలకు ముందే దీనికి సంబంధించిన వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

తాజాగా రష్‌లేన్ లీక్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం, ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో కొత్త టర్బో పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేయటంతో పాటుగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేరియంట్ మరియు కలర్ ఆప్షన్లలో కూడా కంపెనీ మార్పులు చేయనుంది.

టాటా ఆల్ట్రోజ్ వేరియంట్ లైనప్‌లో మార్పులు చేసిన తర్వాత, ఇందులోని స్టాండర్డ్ వెర్షన్ మొత్తం ఆరు వేరియంట్లలో లభ్యం కానుంది. అవి: ఎక్స్ఈ, ఎక్స్ఎమ్, ఎక్స్ఎమ్ ప్లస్, ఎక్స్‌టి, ఎక్స్‌జెడ్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్. కాగా, ఇందులో టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను ఎక్స్‌టి, ఎక్స్‌జెడ్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది.
MOST READ:ఇంద్రభవనం లాంటి విమానం.. ఇది చూస్తే ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది.. ఓ లుక్కేసెయ్యండి

ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ యొక్క పెర్ఫార్మెన్స్ (టర్బో) వేరియంట్‌ను "ఐటర్బో" అని పిలువనున్నారు. టాటా మోటార్స్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త ఆల్ట్రోజ్ టర్బో-పెట్రోల్ ఇంజన్ టీజర్‌ను విడుదల చేసినప్పుడు ఈ విషయం వెల్లడైంది.

టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో వేరియంట్లలో స్పోర్ట్ మరియు సిటీ అనే రెండు డ్రైవింగ్ మోడ్ ఆప్షన్లు కూడా ఉంటాయి. హైవే డ్రైవింగ్ కోసం స్పోర్ట్ మోడ్ మరియు స్టార్ట్/స్టాప్ ట్రాఫిక్‌తో కూడుకున్న నగర ప్రయాణం కోసం సిటీ మోడ్‌లు ఉపయోగపడుతాయి. స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కార్లలో కూడా ఇంధన సామర్థ్యాన్ని (మైలేజ్‌ని) లక్ష్యంగా చేసుకుని ఎకో మరియు సిటీ అనే మోడ్‌లను ఆఫర్ చేస్తున్న విషయం తెలిసినదే.
MOST READ:రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి

కాగా, ఆల్ట్రోజ్ టర్బో-పెట్రోల్ వేరియంట్‌లోని ‘స్పోర్ట్' మోడ్, ఈ ఇంజన్ నుండి గరిష్ట పనితీరును అందించనుంది. వేగవంతమైన యాక్సిలరేషన్ కోసం ఇది షార్ప్ థ్రోటల్ రెస్పాన్స్‌ను కలిగి ఉంటుంది.

ఇతర మార్పుల విషయానికి వస్తే, ఆల్ట్రోజ్ ఐటర్బో బేస్ వేరియంట్‌లో బ్లాక్ కాంట్రాస్టింగ్ రూఫ్, సగం హబ్ క్యాప్‌లతో కూడిన 14-ఇంచ్ స్టీల్ వీల్స్ ఉన్నాయి. ఇకపోతే, ఐటర్బో ఎక్స్‌జెడ్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ వేరియంట్లలో 2 అదనపు ట్వీటర్లతో కూడిన మెరుగైన సౌండ్ సిస్టమ్ లభ్యం కానుంది.
MOST READ:భయంకర ప్రమాదం నుంచి చిటికెలో తపించుకున్న యువకులు [వీడియో]

అన్ని టర్బో వేరియంట్లలోని ఇంటీరియర్ కలర్ స్కీమ్‌ను ఆల్-బ్లాక్ నుండి లైట్ గ్రే కలర్‌కు మార్చారు. స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కోసం కంపెనీ ఇదివరకు అందించిన సిల్వర్ కలర్ ఆప్షన్‌ను కంపెనీ నిలిపివేసింది. దాని స్థానంలో కొత్త మెరీనా బ్లూ కలర్ ఆప్షన్‌ను జోడించారు. ఇది ఎక్స్ఎమ్ ప్లస్ మరియు ఆపై వేరియంట్లలో మాత్రమే లభ్యం కానుంది.

ఇక ఇంజన్ విషయాని వస్తే, టాటా ఆల్ట్రోజ్ టర్బో కారులో 1.2-లీటర్, త్రీ సిలిండర్, టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్‌ను మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ:బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌నే తుక్కు తుక్కు చేసిన టయోటా ఫార్చ్యూనర్ [వీడియో]

ప్రారంభంలో టాటా ఆల్ట్రోజ్ టర్బో కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యం కానుంది. తర్వాతి దశలో ఇందులో డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. ఇది డ్రై-క్లచ్ డిసిటి రూపంలో రావచ్చని సమాచారం. భారత ఇప్పటికే బాగా పాపులర్ అయిన ఆల్ట్రోజ్, ఇప్పుడు కొత్త టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మరింత అధిక పాపులరాటీని దక్కించుకుంటుందని కంపెనీ ధీమాగా ఉంది.