సేఫ్టీలో బెస్ట్ టాటా కార్స్.. ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయత!

భారతదేశంలో కార్లు చాలా సురక్షితంగా మారుతున్నాయి. గతంతో పోలిస్తే, ప్రస్తుతం మార్కెట్లో లభించే కార్లు చాలా ధృడమైనవిగా మరియు అధిక సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. ఒకప్పుడు అధిక ధరకు మరియు ఆప్షనల్‌గా మాత్రమే లభించే ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ వంటి ఫీచర్లు ఇప్పుడు ప్రతి కారులో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌గా వస్తున్నాయి.

సేఫ్టీలో బెస్ట్ టాటా కార్స్.. ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయత!

కస్టమర్లు కూడా కార్ల సేఫ్టీ విషయంలో ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఫలితంగా, తయారీదారులు కూడా అధిక నాణ్యమైన మరియు సురక్షితమైన కార్లను అందిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనదేశంలో లభిస్తున్న కార్లలో కెల్లా టాటా కార్లు అత్యంత సురక్షితమైనవిగా ఉన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా టాటా కార్లు, ఇప్పుడు అధిక ధృడత్వాన్ని మరియు నాణ్యతను కలిగి ఉంటున్నాయి.

సేఫ్టీలో బెస్ట్ టాటా కార్స్.. ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయత!

భారతదేశంలో అమ్మకానికి ఉన్న 8 సురక్షితమైన కార్ల జాబితాలో 6 కార్ మోడళ్లు టాటా మోటార్స్ కి చెందినవే. గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో టాటా కార్లు అత్యుత్తమ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకున్నాయి. అసలు ఈ గ్లోబల్ ఎన్‌క్యాప్ ఏంటి, అదెలా పనిచేస్తుందో తెలుసుకోవటం కోసం - ఈ లింకుపై క్లిక్ చేయండి.

సేఫ్టీలో బెస్ట్ టాటా కార్స్.. ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయత!

గ్లోబల్ NCAP సిస్టమ్ మరింత భద్రతా ఫీచర్లు మరియు నాణ్యమైన కార్ల కోసం చూస్తున్న వారికి సహాయం చేస్తుంది. యూకేకి చెందిన ఈ సంస్థ కొత్త వాహనాలను క్రాష్ టెస్ట్ చేసి, వాటి నాణ్యతను మరియు అందులోని లోపాలను గుర్తిస్తుంది. అనంతరం, ఆ నిర్దిష్ట వాహనం యొక్క భద్రత మరియు నాణ్యతపై కీలక సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది.

సేఫ్టీలో బెస్ట్ టాటా కార్స్.. ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయత!

మనదేశంలో, కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఖరీదైన మరియు లగ్జరీ కార్లలో మాత్రమే అత్యుత్తమైన భద్రతా ఫీచర్లు లభించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది, తక్కువ ఖరీదైన బడ్జెట్ కార్లలో కూడా కార్ల తయారీలు నాణ్యమైన సేఫ్టీ ఫీచర్లను అందించడం ప్రారంభించారు.

సేఫ్టీలో బెస్ట్ టాటా కార్స్.. ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయత!

భారత ప్యాసింజర్ కార్ విభాగంలోని టాటా మోటార్స్ దీనికి ఉత్తమ ఉదాహరణగా చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో టాటా కార్లు మంచి క్వాలిటీని మరియు సేఫ్టీ కలిగి ఉంటున్నాయి. టాటా కార్లు చాలా వరకు అత్యంత సురక్షితమైనవిగా ఉన్నాయి. గ్లోబల్ ఎన్‌సిఎపి ఇటీవల విడుదల చేసిన సమాచారమే దీనికి నిదర్శనం.

సేఫ్టీలో బెస్ట్ టాటా కార్స్.. ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయత!

గ్లోబల్ ఎన్‌క్యాప్ సంస్థ ఇప్పటివరకు అనేక కంపెనీలకు చెందిన వాహనాలను క్రాష్ టెస్ట్ చేసి, తమ విశ్లేషనలు తెలియజేసింది. అయితే, ఒకే కంపెనీకి చెందిన అనేక ఉత్పత్తులు స్థిరంగా అధిక భద్రతా రేటింగ్‌లను పొందవు. అదే సమయంలో, గ్లోబల్ NCAP సిస్టమ్ ద్వారా సర్వే చేయబడిన చాలా టాటా ఉత్పత్తులు అత్యంత సురక్షితమైనవిగా ధృవీకరించబడ్డాయి.

సేఫ్టీలో బెస్ట్ టాటా కార్స్.. ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయత!

దీనికి ఉత్తమ ఉదాహరణ, టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్. టాటా పంచ్ ఈ క్రాష్ టెస్ట్ లో ఐదు స్టార్లకు నాలుగు స్టార్ల (4-స్టార్) సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ స్టార్ రేటింగ్ అనేది ఓ భద్రతా ప్రమాణం. కారు యొక్క భద్రతను అది పొందే స్టార్ రేటింగ్‌ల ఆధారంగా నిర్ధారిస్తారు. ఇందులో మొత్తం 5 స్టార్లు ఉంటాయి. ఈ క్రాష్ టెస్టులో ఐదుకి ఐదు స్టార్లు పొందిన కార్లను సేఫెస్ట్ కార్లుగా పరిగణిస్తారు.

సేఫ్టీలో బెస్ట్ టాటా కార్స్.. ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయత!

టాటా పంచ్ మాత్రమే కాకుండా, కంపెనీ విక్రయిస్తున్న ఇతర ఉత్పత్తులైన టియాగో, టిగోర్, టిగోర్ ఈవీ (ఎలక్ట్రిక్), ఆల్ట్రోజ్ మరియు నెక్సాన్ కార్లు కూడా మరింత సురక్షితమైనవిగా రేట్ చేయబడ్డాయి. ప్రత్యేకించి, టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ మరియు టాటా నెక్సాన్ ఎస్‌‌యూవీలు పంచ్ మైక్రో ఎస్‌యూవీ మాదిరిగానే వయోజన భద్రతా రేటింగ్‌లో ఫైవ్ స్టార్ రేటింగ్‌ని పొందాయి.

సేఫ్టీలో బెస్ట్ టాటా కార్స్.. ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయత!

టియాగో, టిగోర్ మరియు టిగోర్ ఈవీ కార్లు ఫైవ్ స్టార్ రేటింగ్స్‌కు గానూ 4-స్టార్ రేటింగ్ ను దక్కించుకున్నాయి. ప్రస్తుతం టాటా మోటార్స్ నుండి భారత మార్కెట్లో టియాగో, టియాగో ఎన్ఆర్‌జి, టిగోర్, టిగోర్ ఈవీ, ఆల్ట్రోజ్, నెక్సాన్, నెక్సాన్ ఈవీ, హారియర్, సఫారీ మరియు పంచ్ కార్లు అందుబాటులో ఉన్నాయి.

సేఫ్టీలో బెస్ట్ టాటా కార్స్.. ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయత!

వీటిలో, టాటా హారియర్ మరియు టాటా సఫారీ ఎస్‌యూవీలను ఇంకా గ్లోబల్ NCAP సంస్థ క్రాష్ టెస్ట్ నిర్వహించకపోవడం గమనార్హం. వీటిని కూడా అధ్యయనం చేస్తే ఈ కార్లకు 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్టులలో అన్ని లేటెస్ట్ టాటా కార్లు కూడా నాలుగు లేదా అంత కంటే ఎక్కువ స్టార్ రేటింగ్ ను కలిగి ఉన్నాయి.

సేఫ్టీలో బెస్ట్ టాటా కార్స్.. ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయత!

గ్లోబల్ ఎన్‌సిఎపి ఇటీవల విడుదల చేసిన హై క్వాలిటీ కార్ల జాబితాలో టాటా పంచ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో మహీంద్రా ఎక్స్‌యూవీ300 మరియు టాటా ఆల్ట్రోజ్ మోడళ్లు ఉన్నాయి. దాని తర్వాత నాలుగో స్థానంలో టాటా నెక్సాన్ మరియు ఐదవ స్థానంలో మహీంద్రా థార్ మోడళ్లు నిలిచాయి.

సేఫ్టీలో బెస్ట్ టాటా కార్స్.. ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయత!

అదే సమయంలో, టాటా ఉత్పత్తులు మాత్రమే ఈ జాబితాలో మొదటి ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఫలితంగా, టాటా మోటార్స్ భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్ విక్రేతగా అవతరించింది. ఈ రిపోర్ట్ వలన టాటా కార్లు మరియు అవి అందించే భద్రతపై ప్రజల్లో అవగాహన మరియు విశ్వసనీయత మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Tata cars managed to achieve impressive safety ratings in global ncap crash tests
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X