టాటా టియాగో మరియు టాటా టిగోర్ సిఎన్‌జి కార్ల కోసం బుకింగ్స్ ఓపెన్ చేసేశారా..!?

దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ఇంధన ధరలతో ప్రజలే కాదు వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్యాసింజర్ వాహనాల నిర్వహణ ధరను తగ్గించుకునేందుకు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకు సిద్ధమయ్యాయి. దేశంలో ఇప్పటికే మారుతి సుజుకి మరియు హ్యుందాయ్ వంటి కంపెనీలు డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా అధిక మైలేజీనిచ్చే సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్)తో నడిచే కార్లను తయారు చేస్తున్నాయి.

టాటా టియాగో మరియు టాటా టిగోర్ సిఎన్‌జి కార్ల కోసం బుకింగ్స్ ఓపెన్ చేసేశారా..!?

కాగా, ఇప్పుడు టాటా మోటార్స్ కూడా సిఎన్‌జి కార్లపై దృష్టి సారించింది. టాటా మోటార్స్ నుండి సిఎన్‌జి వాహనాలు రాబోతున్నాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది, అయితే ఇప్పటివరకు కంపెనీ నుండి ఎటువంటి నిర్ధారణ లేదు. తాజా సమాచారం ప్రకారం, టాటా మోటార్స్ తమ పాపులర్ మోడళ్లయిన టియాగో హ్యాచ్‌బ్యాక్ మరియు టిగోర్ సెడాన్లలో సిఎన్‌జి వేరియంట్లను త్వరలోనే మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సిఎన్‌జి వేరియంట్ల కోసం డీలర్ స్థాయిలో బుకింగ్ లు కూడా ప్రారంభమైనట్లు సమాచారం.

టాటా టియాగో మరియు టాటా టిగోర్ సిఎన్‌జి కార్ల కోసం బుకింగ్స్ ఓపెన్ చేసేశారా..!?

టియాగో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ మరియు టిగోర్ కాంపాక్ట్ సెడాన్ యొక్క సిఎన్‌జి వెర్షన్‌లు త్వరలో భారతదేశంలో అమ్మకానికి రానున్నందున టాటా మోటార్స్ అధికారికంగా బుకింగ్‌లను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. భారతదేశంలో టాటా మోటార్స్ విక్రయించే ఏకైక సెడాన్ టిగోర్. సరసమైన ధరలు మరియు మెరుగైన ఇంధన సామర్థ్యం కారణంగా మొదటిసారిగా కారు కొనుగోలు చేసేవారు టిగోర్ పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.

టాటా టియాగో మరియు టాటా టిగోర్ సిఎన్‌జి కార్ల కోసం బుకింగ్స్ ఓపెన్ చేసేశారా..!?

టాటా టిగోర్ మంచి మైలేజీని అందించడంతో పాటుగా గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లలో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సంపాదించింది. ఈ కాంపాక్ట్ సెడాన్ తొలిసారిగా మార్చి 2017లో విక్రయానికి వచ్చింది. అప్పటి నుండి ఈ మోడల్ కు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. దాని ముందు 2016లో టాటా మోటార్స్ తమ టియాగో హ్యాచ్‌బ్యాక్ ను ప్రవేశపెట్టింది. ఈ రెండు మోడళ్ల రాకతో భారత మార్కెట్లో టాటా బ్రాండ్ కార్లపై ప్రజల్లో ఉన్న అభిప్రాయమే మారిపోయింది మరియు విశ్వసనీయత పెరిగింది.

టాటా టియాగో మరియు టాటా టిగోర్ సిఎన్‌జి కార్ల కోసం బుకింగ్స్ ఓపెన్ చేసేశారా..!?

భారతదేశంలో బిఎస్6 కాలుష్య నిబంధనలు అమల్లోకి రాక మునుపు ఈ రెండు మోడళ్లు కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమయ్యేవి. అయితే, కొత్త ఉద్గార నిబంధనల తర్వాత కంపెనీ వీటిలో డీజిల్ ఇంజన్లను నిలిపివేసి, కేవలం పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే విక్రయిస్తోంది. గతంలో అందించిన 1.5 లీటర్ త్రీ-సిలిండర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 70 బిహెచ్‌పి శక్తిని మరియు140 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసేది. ఈ నేపథ్యంలో, టాటా కార్లలో సిఎన్‌జి వేరియంట్లకు డీజిల్ మోడళ్లకు చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంటాయి.

టాటా టియాగో మరియు టాటా టిగోర్ సిఎన్‌జి కార్ల కోసం బుకింగ్స్ ఓపెన్ చేసేశారా..!?

ప్రస్తుతం ఈ రెండు కార్లు బిఎస్6 వెర్షన్ 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తున్నాయి. కొత్తగా రాబోయే సిఎన్‌జి మోడళ్లు కూడా ఇదే 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉండనున్నాయి. ఈ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 6,000 rpm వద్ద 86 బిహెచ్‌పి శక్తిని మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాకపోతే, సిఎన్‌జి వేరియంట్ లో ఈ పవర్ టార్క్ గణాంకాలు తగ్గే అవకాశం ఉంది. సిఎన్‌జి వేరియంట్లు స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యం కానున్నాయి.

టాటా టియాగో మరియు టాటా టిగోర్ సిఎన్‌జి కార్ల కోసం బుకింగ్స్ ఓపెన్ చేసేశారా..!?

సిఎన్‌జి వేరియంట్లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ కొత్త సిఎన్‌జి వేరియంట్లను ఈ మోడల్ లైనప్ లోని మిడ్-రేంజ్ XT మరియు XZ వేరియంట్‌లలో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. పెట్రోల్ వేరియంట్ కంటే సిఎన్‌జి వెర్షన్ ధర రూ. 50,000 నుండి రూ. 60,000 వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త సిఎన్‌జి వేరియంట్లలో పవర్‌ట్రైన్ మార్పు మినహా డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

టాటా టియాగో మరియు టాటా టిగోర్ సిఎన్‌జి కార్ల కోసం బుకింగ్స్ ఓపెన్ చేసేశారా..!?

రూ. 4.86 లక్షలకే Tata Punch ఎస్‌యూవీ

ఇదిలా ఉంటే టాటా మోటార్స్ ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ (Tata Punch) ఇప్పుడు CSD (క్యాంటీన్ స్టోర్ డిపార్ట్‌మెంట్) లో కూడా అందుబాటులోకి తెచ్చింది. భారత సైన్యంలో పనిచేసే సైనికులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం టాటా మోటార్స్ ఈ చిన్న కారును క్యాంటీన్ స్టోర్ డిపార్ట్‌మెంట్ లలో విక్రయించనుంది. సిఎస్‌డి క్యాంటీన్ లో టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 4.86 లక్షలు కాగా టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.8.05 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

టాటా టియాగో మరియు టాటా టిగోర్ సిఎన్‌జి కార్ల కోసం బుకింగ్స్ ఓపెన్ చేసేశారా..!?

సాధారణ వినియోగదారులకు కంపెనీ ఇదే కారును రూ. 5.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. టాటా పంచ్ ఎస్‌యూవీ ఈ సెగ్మెంట్లో సరసమైన ధర కలిగి ఉన్నప్పటికీ, ఫీచర్ల విషయంలో ఎక్కడా రాజీ పడదు. కంపెనీ ఈ చిన్న కారులో ఆటోమేటిక్ ఇంజన్ స్టార్ట్ / స్టాప్, రెండు డ్రైవ్ మోడ్‌లు (ఎకో మరియు సిటీ), క్రూయిజ్ కంట్రోల్, టైర్ పంక్చర్ రిపేర్ కిట్, బ్రేక్ స్వే కంట్రోల్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, ఐఆర్‌ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 27 కనెక్టెడ్ ఫీచర్లను అందిస్తోంది.

టాటా టియాగో మరియు టాటా టిగోర్ సిఎన్‌జి కార్ల కోసం బుకింగ్స్ ఓపెన్ చేసేశారా..!?

ఈ కారులోని 1.2 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ ను మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. టాటా పంచ్ ఆటోమేటిక్ వేరియంట్‌లలో 'ట్రాక్షన్ ప్రో' అనే డ్రైవింగ్ మోడ్ కూడా లభిస్తుంది. టాటా పంచ్ ప్యూర్ వేరియంట్ మాత్రం కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభిస్తుంది. మిగిలిన మూడు వేరియంట్లు (అడ్వెంచర్, ఆకాంప్లిష్డ్ మరియు క్రియేటివ్‌) మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.

Most Read Articles

English summary
Tata dealerships unofficially accepting bookings for tiago and tigor cng models in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X