భారత్‌లో విడుదలైన టాటా హారియర్ & సఫారీ XTA+ వేరియంట్స్; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

ప్రముఖ వాహన తయారీదారు టాటా మోటార్స్ రెండు కొత్త వేరియంట్లను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో ఒకటి టాటా హారియర్ ఎక్స్‌టీఏ ప్లస్ కాగా రెండవది టాటా సఫారీ ఎక్స్‌టీఏ ప్లస్. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా హారియర్ ఎక్స్‌టీఏ ప్లస్ ధర రూ. 19.34 లక్షలు కాగా, టాటా సఫారీ ఎక్స్‌టీఏ ప్లస్ ధర రూ. 20.08 లక్షలు(ఎక్స్-షోరూమ్).

భారత్‌లో విడుదలైన టాటా హారియర్ & సఫారీ XTA+ వేరియంట్స్; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

టాటా హారియర్ మరియు టాటా సఫారి ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయించబడుతున్న ఉత్తమ ఎస్‌యూవీలలో ఒకటిగా ఉన్నాయి. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ విభాగంలో ఈ రెండు ఎస్‌యూవీలు కలిసి 41.2 శాతం మార్కెట్ వాటాతో ముందంజలో ఉన్నట్లు టాటా మోటార్స్ అధికారికంగా తెలిపింది.

భారత్‌లో విడుదలైన టాటా హారియర్ & సఫారీ XTA+ వేరియంట్స్; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

టాటా మోటార్స్ రెండు ఎస్‌యూవీలపై ఎక్స్‌టీఏ ప్లస్ ట్రిమ్‌ని విడుదల చేసింది. కొత్త ట్రిమ్‌ని ప్రారంభించడంతో మరిన్ని ఫీచర్లు కోరుకునే కొనుగోలుదారులకు టాటా మోటార్స్ మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ రెండు కొత్త ఎస్‌యూవీలలో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు విశాలమైన సన్‌రూఫ్‌ వంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

భారత్‌లో విడుదలైన టాటా హారియర్ & సఫారీ XTA+ వేరియంట్స్; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

టాటా మోటార్స్ కంపెనీ తన కొత్త హారియార్ ని మొదటిసారిగా జనవరి 2019 లో లాంచ్ చేసింది. అయితే కాలక్రమంలో అనేక మార్పులు జరిగాయి. తరువాత హారియర్ యొక్క 7 సీటర్ వెర్షన్‌పై టాటా మోటార్స్ పని చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ టాటా మోటార్స్ సఫారీ నేమ్‌ప్లేట్‌ను దీనిని అందించడానికి నిర్ణయించుకుంది. ఈ కారణంగానే కంపెనీ కొత్త సఫారీ ఎస్‌యూవీని 2021 జనవరి నెలలో ప్రారంభించింది.

భారత్‌లో విడుదలైన టాటా హారియర్ & సఫారీ XTA+ వేరియంట్స్; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

కంపెనీ యొక్క రెండు ఎస్‌యూవీలు అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఎక్స్‌టీఏ ప్లస్ వేరియంట్‌లో అందించబడే ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఫంక్షన్ ఎల్ఈడీ డిఆర్ఎల్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్‌లను కలిగి ఉంది.

భారత్‌లో విడుదలైన టాటా హారియర్ & సఫారీ XTA+ వేరియంట్స్; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రివర్స్ పార్కింగ్ కెమెరా మొదలైనవి ఉన్నాయి. వీటితో పాటు, సఫారి యొక్క ఎక్స్‌టీఏ ప్లస్ వేరియంట్ మూడ్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఐఆర్ఏ కనెక్ట్ ఫీచర్స్ వంటివాటిని కూడా కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన టాటా హారియర్ & సఫారీ XTA+ వేరియంట్స్; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

టాటా హ్యారియర్ మరియు టాటా సఫారీ రెండూ కూడా కైరోటెక్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తాయి. ఇందులోని 2.0 లీటర్, ఇన్‌లైన్-ఫోర్-సిలిండర్ టర్బో-డీజిల్, ఇది 176.6 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంతకు ముందు పేర్కొన్న విధంగా ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన టాటా హారియర్ & సఫారీ XTA+ వేరియంట్స్; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

టాటా హారియర్ మరియు సఫారీ రెండూ ఈ విభాగంలో అత్యంత ప్రీమియం సమర్పణలుగా నిలిచాయి. అయితే ఇప్పుడు మార్కెట్లో విడుదలైన ఈ రెండు కొత్త మోడల్స్ మరింత మెరుగైన అమ్మకాలను జరిపేవిధంగా చేయనున్నాయి. ఇప్పుడు, ఎక్స్‌టీఏ ప్లస్ వేరియంట్‌ అందుబాటులో ఉండటం వల్ల కొనుగోలుదారులు ఈ వేరియంట్ ని కూడా ఎంచుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించింది.

Most Read Articles

English summary
Tata harrier and safari updated with xta plus variants new features added details
Story first published: Tuesday, August 10, 2021, 17:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X