Tata Harrier క్యామో ఎడిషన్ డిస్‌కంటిన్యూ; బహుశా కారణం అదేనా?

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ 5-సీటర్ ఫుల్-సైజ్ ఎస్‌యూవీ టాటా హారియర్ (Tata Harrier) లో కంపెనీ క్యామో ఎడిషన్ (Camo Edition) పేరిట ఓ స్పెషల్ ఎడిషన్ మోడల్ ను గతేడాది నవంబర్ నెలలో మార్కట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు కంపెనీ ఈ మోడల్ అమ్మకాలను నిలిపివేసింది.

Tata Harrier క్యామో ఎడిషన్ డిస్‌కంటిన్యూ; బహుశా కారణం అదేనా?

స్టాండర్డ్ మోడల్ తో పోల్చుకుంటే, టాటా హారియర్ క్యామో ఎడిషన్ (Tata Harrier Camo Edition) కొద్దిపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ని మరియు అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇది ఆలివ్ గ్రీన్ షేడ్ అనే ప్రత్యేకమైన బాడీ పెయింట్ స్కీమ్ తో లభించేది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ ని ప్రవేశపెట్టినప్పుడు కంపెనీ దీనిని XT, XT+, XZ, XZA, XZ+ మరియు XZA+ అనే ఆరు వేరియంట్లలో విడుదల చేసింది.

Tata Harrier క్యామో ఎడిషన్ డిస్‌కంటిన్యూ; బహుశా కారణం అదేనా?

టాటా హారియర్ స్టాండర్డ్ మోడల్ తో పోల్చుకుంటే, హారియర్ క్యామో ఎడిషన్ ధరలు సుమారు రూ. 30,000 వరకూ ఎక్కువగా ఉండేవి. క్యామో ఎడిషన్ డిస్‌కంటిన్యూ అయిన తర్వాత, ప్రస్తుతం, టాటా హారియర్ బ్లాక్ (డార్క్ ఎడిషన్), గ్రే, రెడ్ మరియు వైట్ వంటి మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో విక్రయించబడుతోంది.

Tata Harrier క్యామో ఎడిషన్ డిస్‌కంటిన్యూ; బహుశా కారణం అదేనా?

హారియర్ క్యామో ఎడిషన్ విషయానికి వస్తే, ఇది స్పెషల్ ఆలివ్ గ్రీన్ షేడ్, ఫ్రంట్ ఫెండర్‌లపై 'క్యామో' బ్యాడ్జింగ్ మరియు బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉండేది. ఇంటీరియర్స్ లో కూడా దాని డార్క్ ఎడిషన్ మాదిరిగానే ఆల్-బ్లాక్ థీమ్‌ తో కనిపించే క్యాబిన్ లేఅవుట్ ని కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో లెథరెట్ సీట్ అప్‌హోలెస్ట్రీపై గ్రీన్ కలర్ స్టిచింగ్ ఉంటుంది.

Tata Harrier క్యామో ఎడిషన్ డిస్‌కంటిన్యూ; బహుశా కారణం అదేనా?

నవంబర్ 2020లో టాటా హారియర్ క్యామో ఎడిషన్‌ ని కంపెనీ విడుదల చేసినప్పుడు దాని ప్రారంభ ధర రూ. 16.50 లక్షలు మరియు టాప్-ఎండ్ ధర రూ. 20.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉండేది. హ్యారియర్ క్యామో ఎడిషన్ కోసం టాటా మోటార్స్ అనేక ఉపకరణాలను (యాక్ససరీస్‌ను) కూడా ప్రవేశపెట్టింది. వీటిలో ప్రత్యేక క్యామో గ్రాఫిక్స్, బోనెట్‌పై హారియర్ మస్కట్, రూఫ్ రైల్స్, సైడ్ స్టెప్స్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి ఉన్నాయి.

Tata Harrier క్యామో ఎడిషన్ డిస్‌కంటిన్యూ; బహుశా కారణం అదేనా?

అలాగే, క్యాబిన్ కోసం బ్యాక్ సీట్ ఆర్గనైజర్, సన్‌షేడ్, 3డి మోల్డెడ్ మ్యాట్, 3డి ట్రంక్ మ్యాట్ మరియు యాంటీ స్కిడ్ డాష్ మ్యాట్ వంటి యాక్ససరీలను కూడా అందించింది. కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ ని మార్కెట్లోకి ప్రవేశపెట్టి ఏడాది కావస్తున్నప్పటికీ, దీని అమ్మకాలు మాత్రం ఆశించిన రీతిలో జరగలేదని తెలుస్తోంది. దీని కారణంగానే, టాటా మోటార్స్ తమ హారియర్ క్యామో ఎడిషన్ ను డిస్‌కంటిన్యూ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

Tata Harrier క్యామో ఎడిషన్ డిస్‌కంటిన్యూ; బహుశా కారణం అదేనా?

ఇదిలా ఉంటే, గత నెలలో టాటా మోటార్స్ తమ టాటా హారియర్ ఎస్‌యూవీ కోసం కొత్త డేటోనా గ్రే అనే కలర్ ఆప్షన్‌ ను కూడా ప్రవేశపెట్టింది. టాటా హారియర్ యొక్క ఇతర కలర్ ఆప్షన్లలో కాలిప్సో రెడ్ మరియు ఆర్కస్ వైట్ కూడా డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్ తో ఆప్షనల్ గా విక్రయించబడుతున్నాయి.

Tata Harrier క్యామో ఎడిషన్ డిస్‌కంటిన్యూ; బహుశా కారణం అదేనా?

అంతేకాకుండా, టాటా మోటార్స్ కొంతకాలం క్రితమే టాటా హారియర్ ఎస్‌యూవీలో కొత్తగా XTA+ అనే వేరియంట్ ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త వేరియంట్ ధర రూ. 19.34 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. అయితే, కొత్త టాటా హారియర్ XTA+ వేరియంట్ లో ఎలాంటి కాస్మెటిక్ లేదా డిజైన్ అప్‌గ్రేడ్స్ లేవు. కాకపోతే, ఇందులో ఇతర వేరియంట్ల కన్నా అదనపు ఫీచర్లు లభిస్తాయి.

Tata Harrier క్యామో ఎడిషన్ డిస్‌కంటిన్యూ; బహుశా కారణం అదేనా?

Tata Harrier XTA+ వేరియంట్ లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డ్యూయల్ ఫంక్షన్ ఎల్ఈఢి డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఆర్-17 అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. హారియర్ ఎక్స్‌టిఏ ప్లస్ ఇంటీరియర్లలో 8 స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్, 7 ఇంచ్ ఫ్లోటింగ్ ఐలాండ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తుంది.

Tata Harrier క్యామో ఎడిషన్ డిస్‌కంటిన్యూ; బహుశా కారణం అదేనా?

ఈ ఫీచర్లు కాకుండా, ఈ వేరియంట్ ఆటో హెడ్‌ల్యాంప్‌లు, పుష్ స్టార్ట్ బటన్, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు మొదలైనవి కూడా లభిస్తాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, అధునాతన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tata Harrier క్యామో ఎడిషన్ డిస్‌కంటిన్యూ; బహుశా కారణం అదేనా?

టాటా హారియర్ ఒకే ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో లభిస్తుంది. కొత్త హారియర్ XTA+ వేరియంట్ లో 2.0 లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 170 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇతర వేరియంట్లలో 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ ఆప్షన్ కూడా ఉంటుంది.

Most Read Articles

English summary
Tata harrier camo edition discontinued in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X