50,000 యూనిట్ల మైలురాయిని చేరుకున్న Tata Harrier

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీలను ఆదరించే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, కార్ల తయారీదారులు అనేక విభాగాల్లో (మైక్రో, కాంపాక్ట్, మిడ్-సైజ్, ఫుల్-సైజ్, ఆఫ్-రోడ్ మరియు లగ్జరీ విభాగాలలో) సరికొత్త ఎస్‌యూవీలను విక్రయిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ విభాగాలలో అత్యంత ప్రాచుర్యం పొందినది మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగం.

50,000 యూనిట్ల మైలురాయిని చేరుకున్న Tata Harrier

భారత ఎస్‌యూవీ మార్కెట్లోని మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో అనేక మోడళ్లు అమ్ముడవుతున్నాయి. వీటిలో, ఒకటి టాటా మోటార్స్ (Tata Motors) అందిస్తున్న హారియర్ (Harrier) మిడ్-సైజ్ ఎస్‌యూవీ. మార్కెట్లో ఈ మోడల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. తాజా, సమాచారం ప్రకారం, కంపెనీ ఇప్పటి వరకూ 50,000 యూనిట్లకు పైగా హారియర్ వాహనాలను విక్రయించింది.

50,000 యూనిట్ల మైలురాయిని చేరుకున్న Tata Harrier

టాటా మోటార్స్ తమ టాటా హారియర్ ఎస్‌యూవీని తొలిసారిగా జనవరి 2019 లో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆ ఏడాదిలో (2019 లో) కంపెనీ మొత్తం 15,227 యూనిట్ల హారియర్ వాహనాలను విక్రయించింది. కాగా, ఆ తర్వాత 2020 సంవత్సరంలో 14,071 యూనిట్లను మరియు 2021 సంవత్సరం సెప్టెంబర్ నెల వరకు 20,100 యూనిట్లను విక్రయించింది.

50,000 యూనిట్ల మైలురాయిని చేరుకున్న Tata Harrier

ఈ ట్రెండ్‌ను గమనిస్తే, 2021 లో మిగిలిన మూడు నెలల్లో టాటా మోటార్స్ మరిన్ని హారియర్ ఎస్‌యూవీలను విక్రయించే అవకాశం కనిపిస్తోంది. కాగా, టాటా హారియర్ ఆధారంగా రూపొందించిన సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ టాటా సఫారీ (Tata Safari) అమ్మకాలు కూడా సజావుగానే సాగుతున్నాయి.

50,000 యూనిట్ల మైలురాయిని చేరుకున్న Tata Harrier

టాటా హారియర్ మరియు సఫారీ ఎస్‌యూవీలు ఈ విభాగంలో నేరుగా చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ అందిస్తున్న ఎమ్‌జి హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ మోడళ్లతో పోటీగా నిలుస్తాయి. గత 2019 నుండి ఇప్పటి వరకు, ఎమ్‌జి మోటార్ ఇండియా మొత్త 69,193 యూనిట్ల హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలను విక్రయించగా, టాటా మోటార్స్ మొత్తం 63,116 యూనిట్ల హారియర్ మరియు సఫారీ ఎస్‌యూవీలను విక్రయించింది.

50,000 యూనిట్ల మైలురాయిని చేరుకున్న Tata Harrier

టాటా హారియర్ క్యామో ఎడిషన్ నిలిపివేత

ఇదిలా ఉంటే, గతేడాది నవంబర్ నెలలో టాటా హారియర్ ఎస్‌యూవీలో కంపెనీ క్యామో ఎడిషన్ (Camo Edition) పేరిట ఓ స్పెషల్ ఎడిషన్ మోడల్ ను విడుదల చేసింది. కాగా, ఇప్పుడు కంపెనీ ఈ మోడల్ అమ్మకాలను నిలిపివేసింది. అమ్మకాలు తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

50,000 యూనిట్ల మైలురాయిని చేరుకున్న Tata Harrier

స్టాండర్డ్ మోడల్ హారియర్ తో పోల్చుకుంటే, టాటా హారియర్ క్యామో ఎడిషన్ ధర రూ. 30,000 అధికంగా ఉంటుంది మరియు కొద్దిపాటి కాస్మెటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్స్ ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇది ఆలివ్ గ్రీన్ షేడ్ అనే ప్రత్యేకమైన బాడీ పెయింట్ స్కీమ్ తో కూడా లభిస్తుంది.

50,000 యూనిట్ల మైలురాయిని చేరుకున్న Tata Harrier

టాటా మోటార్స్ ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ ని ప్రవేశపెట్టినప్పుడు దీనిని XT, XT+, XZ, XZA, XZ+ మరియు XZA+ అనే ఆరు వేరియంట్లలో విడుదల చేసింది. హారియర్ క్యామో ఎడిషన్ ఫ్రంట్ ఫెండర్‌లపై 'క్యామో' బ్యాడ్జింగ్ మరియు బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్, ఆల్-బ్లాక్ ఇంటీరియర్, లెథరెట్ సీట్ అప్‌హోలెస్ట్రీపై గ్రీన్ కలర్ స్టిచింగ్ వంటి అంశాలు ఉండేవి.

50,000 యూనిట్ల మైలురాయిని చేరుకున్న Tata Harrier

కంపెనీ గతే నవంబర్ 2020 నెలలో టాటా హారియర్ క్యామో ఎడిషన్‌ ని విడుదల చేసినప్పుడు దాని ప్రారంభ ధర రూ. 16.50 లక్షలు మరియు టాప్-ఎండ్ ధర రూ. 20.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉండేది. హ్యారియర్ క్యామో ఎడిషన్ కోసం టాటా మోటార్స్ అనేక యాక్ససరీలను కూడా ప్రవేశపెట్టింది. వీటిలో ప్రత్యేక క్యామో గ్రాఫిక్స్, బోనెట్‌పై హారియర్ మస్కట్, రూఫ్ రైల్స్, సైడ్ స్టెప్స్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి ఉన్నాయి.

50,000 యూనిట్ల మైలురాయిని చేరుకున్న Tata Harrier

ఇంటీరియర్ యాక్ససరీలను గమనిస్తే, కంపెనీ ఈ ఎస్‌యూవీ కోసం బ్యాక్ సీట్ ఆర్గనైజర్, సన్‌షేడ్, 3డి మోల్డెడ్ మ్యాట్, 3డి ట్రంక్ మ్యాట్ మరియు యాంటీ స్కిడ్ డాష్ మ్యాట్ వంటి యాక్ససరీలను కూడా అందించింది. కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ ని మార్కెట్లోకి ప్రవేశపెట్టి ఏడాది కావస్తున్నప్పటికీ, దీని అమ్మకాలు మాత్రం ఆశించిన రీతిలో జరగలేదని తెలుస్తోంది. దీని కారణంగానే, టాటా మోటార్స్ తమ హారియర్ క్యామో ఎడిషన్ ను డిస్‌కంటిన్యూ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

50,000 యూనిట్ల మైలురాయిని చేరుకున్న Tata Harrier

ఇంజన్ ఆప్షన్ విషయానికి వస్తే, టాటా హారియర్ ఒకే ఒక డీజిల్ ఇంజన్ తో లభిస్తుంది. ఇందులోని అధునాతన 2.0 లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 170 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

50,000 యూనిట్ల మైలురాయిని చేరుకున్న Tata Harrier

టాటా పంచ్ (Tata Punch) కి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్..

టాటా మోటార్స్ కి సంబంధించిన తాజా వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ ఇటీవల ఆవిష్కరించిన సరికొత్త మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ కోసం గ్లోబల్ ఎన్‌సి‌ఏ‌పి (GNCAP) నిర్వహించిన క్రాష్ టెస్టులో ఈ చిన్న ఎస్‌యూవీ 5-స్టార్ రేటింగ్ దక్కించుకుంది, కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడి చేసింది. టాటా నెక్సాన్, హారియర్, సఫారీ మరియు ఆల్ట్రోజ్‌ కార్ల తర్వాత 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన ఐదవ కారు పంచ్ కావటం విశేషం. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Tata harrier sales crossed 50000 units mark sicne launched in 2019 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X