Just In
- 37 min ago
మా నాన్న పోలీస్.. నేను ఏమైనా చేస్తా.. కరోనా వేళ ఢిల్లీలో యువతి హల్చల్ [వీడియో]
- 51 min ago
డీలర్ల వద్దకు ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్!
- 1 hr ago
ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!
- 2 hrs ago
టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?
Don't Miss
- Lifestyle
ఫేషియల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే ఇలా మారిపోతామా! మీరు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి...
- News
బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేసుంటే.. తిరుపతి ఉపఎన్నిక పోలింగ్‌పై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు
- Movies
ప్రతి ఇంట్లో ఇలాంటి కొడుకులుండాలి…సల్మాన్ బ్రదర్స్ ను ఆకాశానికెత్తేసిన బాలీవుడ్ హాట్ బ్యూటీ !
- Sports
RCB vs KKR: అతడు వంగడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు.. ఇది కేకేఆర్‌కు పెద్ద తలనొప్పే: వాన్
- Finance
కరోనా-లాక్‌డౌన్‌పై మరోసారి తేల్చి చెప్పిన నిర్మలా సీతారామన్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఈ కారు ప్రయాణికుల పాలిట రక్షణ కవచం.. ఇంతకీ ఏ కారనుకుంటున్నారు
భారత మార్కెట్లో టాటా మోటార్స్ కార్లు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఎందుకంటే టాటా మోటార్స్ కార్లు ఎక్కు సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల, ఎక్కువమంది వినియోగదారులు వీటిని ఉపయోగించడానికి ఆసక్తి కనపరుస్తుకుంటారు. టాటా మోటార్స్ యొక్క కార్లు అనేక సంఘటనలనుంచి ప్రయాణికులను రక్షించిన సంఘటనలు గతంలో చాలా వెలుగులోకి వచ్చాయి.

ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటన మళ్ళీ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో ప్రమాదానికి గురైన కారు టాటా హారియార్. ఈ ఎస్‌యూవీ భయంకరమైన ప్రమాదంలో చిక్కుకుని అనేకసార్లు పల్టీలు కొట్టినప్పటికీ అందులో ఉన్న ప్రయాణికులు చాలా సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాదంలో కారు ఎంతగా దెబ్బతినిందో ఇక్కడ ఫోటోలను గమనించినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. నిజంగానే కారు ఇంత ప్రమాదానికి గురైనప్పటికీ ఇందులో ఉన్న ప్రజలు బయటపడ్డారంటే ఆశ్చర్యమనే చెప్పాలి.

టాటా హారియర్, తమ కుటుంభ సభ్యులను కాపాడగలిగిందని కార్ ఓనర్ సజీవ్ పల్కున్ను తెలిపారు. ఈ హారియర్ కారు ప్రమాదానికి సంబంధించిన అధికారిక సమాచారం వారు అందించిన సమాచారం ఆధారంగా వెల్లడైంది. కానీ ప్రమాదానికి కారణం మాత్రం తెలియదు.
MOST READ:పులి మరణానికి కారణమైన కారు.. అసలేం జరిగిందంటే?

ఈ ప్రమాదంలో టాటా యొక్క హారియార్ కారు పైకప్పు పూర్తిగా నుంజ్జు నుజ్జు అయింది. దీనిని ఫొటోలో గమనించవచ్చు. కారు అధిక వేగంతో పల్టీలు కొట్టడం వల్ల ఇంత భయంకరమైన ప్రమాదం జరిగింది. అంతే కాకుండా ఈ కారు రోడ్డు పక్కన ఉన్న 5 అడుగుల లోతులో పడిపోయింది.
MOST READ:హోండా బైక్స్ యొక్క కొత్త ధరల లిస్ట్.. వచ్చేసింది.. చూసారా

గుంటలో పడిపోయిన కారుని ప్రజలు క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ప్రమాదాలకు సంబంధించిన ఫోటోలను సజీవ్ పల్కున్ను తన పేస్ బుక్ అకౌంట్ నుంచి తీసుకోబడ్డాయి. ఈ ప్రమాదం నిజంగానే వాహనదారులను భయానక వాతావరణాన్ని కల్గిస్తుంది.

టాటా మోటార్స్ తన హారియర్ ఎస్‌యూవీలో అనేక సేఫ్టీ ఫీచర్స్ అందించారు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్, ఎబిఎస్, ఇబిడి, ట్రాక్షన్ కంట్రోల్, ఇఎస్‌పి, హిల్ హోల్డ్ అసిస్ట్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్, క్రూయిస్ కంట్రోల్, స్పీడ్ అలర్ట్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్ వంటివి ఉన్నాయి.
MOST READ:భారతదేశంలోనే అతి పిన్న వయసులో బస్ స్టీరింగ్ పట్టిన అమ్మాయి.. ఎందుకో మరి మీరే చూడండి

ఈ ఎస్‌యూవీలో ఉన్న అనేక సేఫ్టీ ఫీచర్స్ వల్ల వాహనంలోని వారు సురక్షితంగా బయటపడ్డారు. హారియర్ ఎస్‌యూవీ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఒక ఇంజన్ ఎంపికలో మాత్రమే అమ్ముడవుతోంది.

హారియర్ ఎస్‌యూవీలోని 2-లీటర్, 4-సిలిండర్ ఫియట్ మల్టీజెట్ టర్బో డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 170 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

టాటా మోటార్స్ కంపెనీ భారత మార్కేట్లో త్వరలో టాటా సఫారి ఎస్‌యూవీని విడుదల చేయనుంది. టాటా హారియర్ ఎస్‌యూవీని సఫారి ఆధారంగా అభివృద్ధి చేశారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. టాటా సఫారీకి దేశీయ మార్కెట్లో ఎక్కువమంది అభిమానులు ఉన్నారు. కావున త్వరలో లాంఛ్ అవ్వనున్న ఈ కొత్త కారు ఎక్కువ ప్రజాదరణను పొందుటని భావిస్తున్నారు.