Tata Safari XT మరియు XZ వేరియంట్లలో కొత్త ఫీచర్లు - డీటేల్స్

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో విక్రయిస్తున్న నెక్స్ట్ జనరేషన్ టాటా సఫారీ (Tata Safari) ఎస్‌యూవీ యొక్క XT మరియు XZ ట్రిమ్ లలో కొత్త ఫీచర్లను జోడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Tata Safari XT మరియు XZ వేరియంట్లలో కొత్త ఫీచర్లు - డీటేల్స్

టాటా సఫారీ వేరియంట్లలో కొత్తగా చేసిన మార్పులలో XT మరియు XTA వేరియంట్లు ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్‌ ఫీచర్ తో వస్తుండగా, XZ మరియు XZA వేరియంట్లు ఎయిర్ ప్యూరిఫయర్ తో పాటుగా వైర్‌లెస్ ఛార్జర్ మరియు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో రానున్నాయి. ఈ అదనపు ఫీచర్లు మినహా ఈ ట్రిమ్‌లలో వేరే ఏ ఇతర మార్పులు లేవు.

Tata Safari XT మరియు XZ వేరియంట్లలో కొత్త ఫీచర్లు - డీటేల్స్

ప్రస్తుతం, టాటా సఫారీ ఎక్స్‌టి (Tata Safari XT) ట్రిమ్ లో ఎనిమిది స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్, iRA కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, రియర్ వ్యూ కెమెరా, యాంబియంట్ లైటింగ్, రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఎల్ఈడి టేడైమ్ రన్నింగ్ లైట్లు మరియు 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఫీచర్లు కూడా లభిస్తాయి.

Tata Safari XT మరియు XZ వేరియంట్లలో కొత్త ఫీచర్లు - డీటేల్స్

టాటా సఫారీ ఎక్స్‌జెడ్ (Tata Safari XZ) ట్రిమ్ లో ఎక్స్‌జెడ్ఏ ఎక్స్‌టి (XZA XT) ట్రిమ్ కంటే మరికొన్ని ఫీచర్లు లభిస్తాయి. వీటిలో 8.8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, తొమ్మిది స్పీకర్లతో కూడిన జెబిఎల్ ఆడియో సిస్టమ్ మరియు 7.0 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లేతో కూడిన సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tata Safari XT మరియు XZ వేరియంట్లలో కొత్త ఫీచర్లు - డీటేల్స్

ఇంకా ఇందులో 6 వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగులు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, 18 ఇంచ్ మెషీన్ కట్ అల్లాయ్ వీల్స్ మరియు కార్నర్ ఫంక్షన్‌తో కూడిన జెనాన్ HID ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ లు మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

Tata Safari XT మరియు XZ వేరియంట్లలో కొత్త ఫీచర్లు - డీటేల్స్

ఈ రెండు ట్రిమ్ లలో ఇంజన్ పరంగా కూడా ఎలాంటి మార్పులు లేవు. ఇవి రెండూ ప్రస్తుతం ఉన్న 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ తోనే లభిస్తాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 170 బిహెచ్‌పి పవర్ ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. టాటా హారియర్ (Tata Harrier) ఎస్‌యూవీలో కూడా ఇదే ఇంజన్ ను ఉపయగిస్తున్నారు.

Tata Safari XT మరియు XZ వేరియంట్లలో కొత్త ఫీచర్లు - డీటేల్స్

టాటా సఫారీ అడ్వెంచర్ ఎడిషన్ లో కొత్త ఫీచర్లు..

కాగా, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాటా సఫారీ అడ్వెంచర్ ఎడిషన్ (Tata Safari Adventure Edition) లో కూడా కంపెనీ మరిన్ని అదనపు ఫీచర్లను జోడించనుంది. సఫారీ గోల్డ్ ఎడిషన్ లో అందించిన వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లను కూడా సఫారీ అడ్వెంచర్ ఎడిషన్ లో కూడా అందించనున్నారు.

Tata Safari XT మరియు XZ వేరియంట్లలో కొత్త ఫీచర్లు - డీటేల్స్

టాటా సఫారీ గోల్డ్ ఎడిషన్ లాంచ్..

ఇదిలా ఉంటే టాటా మోటార్స్ ఇటీవల సఫారీ గోల్డ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. టాటా సఫారీ గోల్డ్ ఎడిషన్ వైట్ అండ్ గోల్డ్ మరియు బ్లాక్ అండ్ గోల్డ్ వంటి రెండు వేరియంట్లలో విడుదల చేయబడింది. టాటా సఫారీ గోల్డ్ ఎడిషన్ (Tata Safari Gold Edition) XZ + మాన్యువల్ వేరియంట్ మరియు XZA + ఆటోమేటిక్ వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో వీటి ధరలు రూ. 21.89 లక్షలు మరియు రూ. 23.18 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి.

Tata Safari XT మరియు XZ వేరియంట్లలో కొత్త ఫీచర్లు - డీటేల్స్

ఇందులోని ఇంటీరియర్ లలో వైట్ గోల్డ్‌ లో గోల్డ్ యాక్సెంట్లతో కూడిన మోంట్ బ్లాంక్ మార్బుల్ ఫినిషింగ్ లభిస్తుంది. వెలుపలి భాగాన్ని బ్లాక్ కలర్ రూఫ్ తో ఫ్రాస్ట్ వైట్ యొక్క డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో డిజైన్ చేశారు. దీని వెలుపలి భాగంలో గోల్డెన్ కలర్ యాక్సెంట్స్ కూడా ఉన్నాయి.

Tata Safari XT మరియు XZ వేరియంట్లలో కొత్త ఫీచర్లు - డీటేల్స్

బ్లాక్ అండ్ గోల్డ్ వేరియంట్లో గోల్డ్ యాక్సెంట్స్ తో కూడిన కాఫీ బీన్ పెయింట్ స్కీమ్‌ లో ఫినిష్ చేయబడి ఉంటుంది. దీని ఇంటీరియర్ కూడా గోల్డ్ యాసెంట్స్‌తో బ్లాక్ మార్బుల్ కలర్‌లో ఫినిష్ చేయబడి ఉంటుంది. ఇక ఇందులో అప్‌హోలెస్ట్రీ మాత్రం రెండు వేరియంట్లలో ఒకే విధంగా ఉంటుంది.

Tata Safari XT మరియు XZ వేరియంట్లలో కొత్త ఫీచర్లు - డీటేల్స్

అక్టోబర్ 4, 2021 టాటా పంచ్ ఆవిష్కరణ..

ఇదిలా ఉంటే, టాటా మోటార్స్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ (Tata Punch) ను కంపెనీ అక్టోబర్ 4, 2021వ తేదీన ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. అదే రోజున కంపెనీ ఈ చిన్న ఎస్‌యూవీకి సంబంధించిన అధికారిక బుకింగ్స్ మరియు ధరల సమాచారాన్ని కూడా వెల్లడించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Tata motors adds new features to safari xt and xz variants details
Story first published: Monday, September 27, 2021, 13:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X