ఏప్రిల్ నెలలో భారీగా తగ్గిన టాటా మోటార్స్ సేల్స్; కరోనా ప్రభావమేనా?

గత నెలలో టాటా మోటార్స్ అమ్మకాలు భారీగా క్షీణించాయి. కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, టాటా మోటార్స్ ఏప్రిల్ 2021లో మొత్తం 39,530 యూనిట్ల వాహనాలను విక్రయించింది. అంతకు ముందు నెల (మార్చి 2021) అమ్మకాలతో పోల్చుకుంటే, ఇది 41 శాతం క్షీణతను నమోదు చేసినట్లు కంపెనీ పేర్కొంది.

ఏప్రిల్ నెలలో భారీగా తగ్గిన టాటా మోటార్స్ సేల్స్; కరోనా ప్రభావమేనా?

ఈ మొత్తం అమ్మకాలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 15 శాతం తగ్గి 25,095 యూనిట్లుగా నమోదు కాగా, వాణిజ్య వాహనాల అమ్మకాలు 59 శాతం తగ్గి, 16,644 యూనిట్లుగా నమోదయ్యాయి. టాటా మోటార్స్ గడచిన మార్చి 2021లో మొత్తం 66,609 యూనిట్లను విక్రయించింది.

Domestic Sales Performance:
Category April 2021 March 2021 April 2020 % change

(m-0-m)

Total Domestic Sales 39,530 66,609 NA -41%
ఏప్రిల్ నెలలో భారీగా తగ్గిన టాటా మోటార్స్ సేల్స్; కరోనా ప్రభావమేనా?

ఏప్రిల్ నెలలో కోవిడ్-19 కేసులు భారీగా పెరగడంతో పలు రాష్ట్రాల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌లను విధించడం మరియు ప్రజలు, కొనుగోలుదారులు ఇంటి నుండి బయటకు రావటానికి విముఖత చూపుతుండటంతో వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ నెలలో భారీగా తగ్గిన టాటా మోటార్స్ సేల్స్; కరోనా ప్రభావమేనా?

కాగా, ఏప్రిల్ 2020లో సంపూర్ణ లాక్‌డౌన్ కారణంగా, టాటా మోటార్స్ ఆ సమయంలో సున్నా అమ్మకాలను నమోదు చేసింది. గడచిన మార్చి (2021) నెలలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ హోల్‌సేల్స్ 29,654 యూనిట్లుగా ఉన్నాయి.

ఏప్రిల్ నెలలో భారీగా తగ్గిన టాటా మోటార్స్ సేల్స్; కరోనా ప్రభావమేనా?

దేశీయ వాణిజ్య వాహనం (సివి) హోల్‌సేల్స్‌లో 6,930 యూనిట్ల చిన్న వాణిజ్య వాహనాలు (కార్గో అండ్ పిక్ అప్ కేతగిరీలు), 4,942 యూనిట్ల మధ్య మరియు భారీ వాణిజ్య వాహనాలు (ఎంహెచ్‌సివి), 2,013 యూనిట్ల ఇంటర్మీడియట్ మరియు లైట్ కమర్షియల్ వెహికల్స్ (ఐఎల్‌సివి) మరియు 550 ప్యాసింజర్ క్యారియర్లు ఉన్నాయి.

Domestic - Commercial Vehicles:
Category April 2021 March 2021 April 2020 % change

(m-0-m)

M&HCV 4942 11030 NA -55%
I & LCV 2013 6792 NA -70%
Passenger Carriers 550 1880 NA -71%
SCV cargo and pickup 6930 17253 NA -60%
Total Domestic 14435 36955 NA -61%
CV Exports 2209 3654 NA -40%
Total CV 16644 40609 NA -59%
ఏప్రిల్ నెలలో భారీగా తగ్గిన టాటా మోటార్స్ సేల్స్; కరోనా ప్రభావమేనా?

టాటా మోటార్స్ బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ విక్రయిస్తున్న టిగోర్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కంపెనీ ఓ అప్‌డేటెట్ మోడల్‌ను కొత్త పేరుతో తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం ప్రభుత్వ మరియు వాణిజ్య వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఏప్రిల్ నెలలో భారీగా తగ్గిన టాటా మోటార్స్ సేల్స్; కరోనా ప్రభావమేనా?

కాగా, కొత్తగా రానున్న ఫేస్‌లిఫ్ట్ మోడల్ కొత్త పేరు, సరికొత్త డిజైన్, మెరుగైన రేంజ్ మరియు అధునాత ఫీచర్లతో రాబోతోంది. టాటా ఎక్స్ ప్రెస్-టి పేరుతో కంపెనీ ఈ కొత్త 2021 మోడల్ ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టనుంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.

ఏప్రిల్ నెలలో భారీగా తగ్గిన టాటా మోటార్స్ సేల్స్; కరోనా ప్రభావమేనా?

మార్కెట్లో టాటా ఎక్స్ ప్రెస్-టి ప్రారంభ ధర రూ.12.90 లక్షలు ఉండొచ్చని సమాచారం. టాటా టిగోర్ ఈవికి రీబ్యాడ్జ్ వెర్షన్‌గా వస్తున్న టాటా ఎక్స్ ప్రెస్-టి ఈవి స్టాండర్డ్ మరియు లాంగ్ రేంజ్ బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. లాంగ్ రేంజ్ వేరియంట్‌లో పెద్ద బ్యాటరీ ఉంటుంది.

ఏప్రిల్ నెలలో భారీగా తగ్గిన టాటా మోటార్స్ సేల్స్; కరోనా ప్రభావమేనా?

టాటా ఎక్స్ ప్రెస్-టి ఈవి కారులోని క్యాబిన్ లేఅవుట్ స్టాండర్డ్ టిగోర్ కాంపాక్ట్ సెడాన్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభ్యం కానుంది. స్టాండర్డ్ రేంజ్ వేరియంట్లో 16.2 కిలోవాట్ బ్యాటరీ మరియు లాంగ్ రేంజ్ వేరియంట్‌లో 21.5 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది.

ఏప్రిల్ నెలలో భారీగా తగ్గిన టాటా మోటార్స్ సేల్స్; కరోనా ప్రభావమేనా?

ఈ బ్యాటరీ కారులో అమర్చిన 70 వోల్ట్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటారుకు శక్తినిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 41 హెచ్‌పి పవర్‌ను మరియు 105 న్యూటన్ మీటర్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లుగా ఉంటుంది.

ఏప్రిల్ నెలలో భారీగా తగ్గిన టాటా మోటార్స్ సేల్స్; కరోనా ప్రభావమేనా?

స్టాండర్డ్ రేంజ్ టాటా ఎక్స్ ప్రెస్-టి ఈవి పూర్తి బ్యాటరీ చార్జ్‌పై 165 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. అలాగే, లాంగ్ రేంజ్ వేరియంట్ టాటా ఎక్స్ ప్రెస్-టి ఈవి 213 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
Tata Motors Sales April 2021 Declines 41 Percent, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X