9 సంవత్సరాల రికార్డ్ తిరిగిరాసిన మార్చి 2021 టాటా మోటార్స్ సేల్స్

ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ 2021 మార్చి నెలలో జరిపిన అమ్మకాల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మార్చ్ నెలలో దాదాపు 66,609 యూనిట్లను విక్రయించింది. ఈ అమ్మకాల వల్ల ఒక్క మార్చిలోనే 505 శాతం వృద్ధిని నమోదు చేసింది.

9 సంవత్సరాల రికార్డ్ తిరిగిరాసిన మార్చి 2021 టాటా మోటార్స్ సేల్స్

గత ఏడాది ఇదే నెలలో టాటా మోటార్స్ 5,676 యూనిట్ల కార్లను మాత్రమే విక్రయించింది. ప్రస్తుతం విడుదలైన నివేదిక ప్రకారం ఈ సంఖ్య 9 సంవత్సరాలలో ఎప్పుడు చేయని అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది మార్చిలో కరోనా లాక్ డౌన్ కారణంగా అమ్మకాలు బాగా తగ్గాయని కంపెనీ ప్రకటించింది.

9 సంవత్సరాల రికార్డ్ తిరిగిరాసిన మార్చి 2021 టాటా మోటార్స్ సేల్స్

టాటా మోటార్స్ ఫిబ్రవరి 2021 లో 29,654 యూనిట్ల కార్లను విక్రయించింది. అయితే ఇప్పుడు కంపెనీ యొక్క అమ్మకాలు మునుపటి నెల కంటే మెరుగైన పనితీరును కనబరిచింది. కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, టాటా మోటార్స్ గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) 2,22,025 యూనిట్ల కార్లను విక్రయించింది.

MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్‌పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్‌

9 సంవత్సరాల రికార్డ్ తిరిగిరాసిన మార్చి 2021 టాటా మోటార్స్ సేల్స్

టాటా మోటార్స్ యొక్క అమ్మకాలలో ఎక్కువ భాగం సఫారి, హారియర్, నెక్సాన్, టిగోర్, అల్ట్రోస్ మరియు టియాగో వంటి కార్లు ఉన్నాయి. టాటా మోటార్స్ ఈ కార్లను నిరంతరం అప్‌డేట్ చేస్తూనే ఉంది, ఈ కారణంగా కంపెనీ యొక్క ఈ కార్లు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్ తో, మంచి ధర వద్ద లభిస్తున్న కారణంగా ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి.

9 సంవత్సరాల రికార్డ్ తిరిగిరాసిన మార్చి 2021 టాటా మోటార్స్ సేల్స్

ఇది మాత్రమే కాకుండా టాటా మోటార్స్ కంపెనీ తన కార్ల అమ్మకాలను మరింత పెంచడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. టాటా మోటార్స్ కంపెనీ యొక్క కార్లు మంచి ఫీచర్స్ మాత్రమే కాదు మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉన్నాయి. ఇటీవల జరిపిన గ్లోబల్ ఎన్‌సిఎపి టెస్ట్‌లో టాటా యొక్క అన్ని కార్లకు 4 మరియు 5 స్టార్ రేటింగ్స్ సొంతం చేసుకున్నాయి.

MOST READ:షిప్పుల గురించి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు.. ఇక్కడ మీకోసం..ఓ లుక్కేసెయ్యండి

9 సంవత్సరాల రికార్డ్ తిరిగిరాసిన మార్చి 2021 టాటా మోటార్స్ సేల్స్

టాటా మోటార్స్ త్వరలో తన చిన్న కమర్షియల్ వాహనాలను, ఎలక్ట్రిక్ వేరియంట్లలో విడుదల చేయనుంది. ఫేమ్-2 స్కీమ్ కింద కంపెనీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిందని, ఇప్పుడు చిన్న వాణిజ్య వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి ఆలోచిస్తున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది.

9 సంవత్సరాల రికార్డ్ తిరిగిరాసిన మార్చి 2021 టాటా మోటార్స్ సేల్స్

ఇటీవల కాలంలో ఇంధన ధరలు పెరగడం వల్ల వాణిజ్య వాహనాలను నడపడానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతోంది ఈ పరిస్థిలో, ఇంధనంతో నడుస్తున్న చిన్న వాణిజ్య వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల విడుదలకు కంపెనీ సన్నద్ధమవుతోంది.

MOST READ:నడి రోడ్డుపై మహిళా స్కూటరిస్ట్ చెంప చెళ్లుమనిపించిన పిఎస్‌ఐ [వీడియో]

9 సంవత్సరాల రికార్డ్ తిరిగిరాసిన మార్చి 2021 టాటా మోటార్స్ సేల్స్

టాటా మోటార్స్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సులను కూడా తయారు చేస్తున్నట్లు తెలిపింది. బాసులను తయారుచేయడానికి పూనుకున్న ఈ కంపెనీ, చిన్న వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాలను కూడా తయారు చేయడానికి తగిన ఏర్పాట్లను చేస్తోంది. టాటా మోటార్స్ తన కొన్ని కార్ మోడళ్లను సిఎన్‌జికి మార్చడానికి కూడా కృషి చేస్తోంది.

9 సంవత్సరాల రికార్డ్ తిరిగిరాసిన మార్చి 2021 టాటా మోటార్స్ సేల్స్

ఇటీవల, టాటా టియాగో మరియు టిగోర్ యొక్క సిఎన్‌జి మోడల్స్ టెస్టింగ్ సమయంలో గుర్తించబడ్డాయి. ఇటీవల కాలంలో కంపెనీ యొక్క కొత్త కార్ అయినా టాటా సఫారిని కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం కొత్త టాటా సఫారి 5,000 యూనిట్లకు పైగా బుక్ చేయబడ్డాయి.

MOST READ:యువకులు కూడా చేయలేని బైక్ స్టంట్ చేసిన యువతి అరెస్ట్

Most Read Articles

English summary
Tata Motors Car Sales March 2021. Read in Telugu.
Story first published: Thursday, April 1, 2021, 19:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X