టాటా వాణిజ్య వాహనాలపై ఉచిత సర్వీస్ మరియు వారంటీ గడువు పొడగింపు

దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ కారణంగా, ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పూర్తి లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో దేశంలోని అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ సర్వీస్ సెంటర్లను మరియు డీలర్‌షిప్ కేంద్రాలను మూసివేస్తున్నాయి.

టాటా వాణిజ్య వాహనాలపై ఉచిత సర్వీస్ మరియు వారంటీ గడువు పొడగింపు

ఫలితంగా, వాహనదారులు గడువు తేదీ లోపుగా తమ వాహనాలకు ఉచిత సర్వీస్ చేయించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా, కొన్ని వాహనాల వారంటీ పీరియడ్ కూడా ఈ లాక్‌డౌన్ సమయంలో ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ తమ వాణిజ్య వాహనాలపై ఉచిత సర్వీస్ మరియు వారంటీ వ్యవధిని వచ్చే నెలాఖరు వరకూ పెంచుతున్నట్లు ప్రకటించింది.

టాటా వాణిజ్య వాహనాలపై ఉచిత సర్వీస్ మరియు వారంటీ గడువు పొడగింపు

గడచిన ఏప్రిల్ నాటికి సర్వీస్ లేదా వారంటీ ముగిసిన వాహనాల విషయంలో ఈ గడువును జూన్ 30, 2021వ తేదీ వరకూ పొడగిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వాణిజ్య వాహనాలు రవాణా విషయంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వాటి యజమానులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

టాటా వాణిజ్య వాహనాలపై ఉచిత సర్వీస్ మరియు వారంటీ గడువు పొడగింపు

ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని టాటా వాణిజ్య వాహన వినియోగదారులకు వర్తిస్తుంది. కంపెనీ తీసుకున్న నిర్ణయంతో టాటా వాణిజ్య వాహనాల వినియోగదారులు ఇప్పుడు తమ వాహనాలపై వారంటీ మరియు సర్వీసును ఒక నెల అదనంగా పొందవచ్చు.

టాటా వాణిజ్య వాహనాలపై ఉచిత సర్వీస్ మరియు వారంటీ గడువు పొడగింపు

టాటా మోటార్స్ సెక్యూరిటీ కస్టమర్ల కోసం కూడా వారి ఏఎమ్‌సి (వార్షిక మెయింటినెన్స్ కాంట్రాక్ట్)ని కూడా ఒక నెల వరకు పొడిగించారు. టాటా మోటార్స్ వాణిజ్య వాహనాలకు సంబంధించి ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కోసం కంపెనీ 1800 209 7979 హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. వినియోగదారులు ఈ నెంబరుపై కాల్ చేయడం ద్వారా ఎలాంటి సమాచారాన్నైనా పొందవచ్చు.

టాటా వాణిజ్య వాహనాలపై ఉచిత సర్వీస్ మరియు వారంటీ గడువు పొడగింపు

కేవలం వాణిజ్య వాహనాలకే కాకుండా, టాటా మోటార్స్ విక్రయిస్తున్న ప్యాసింజర్ కార్ల విషయంలో కంపెనీ ఇదే నిర్ణయం తీసుకుంది. ప్యాసింజర్ వాహన వినియోగదారుల కోసం, కంపెనీ ఉచిత సర్వీస్ మరియు వారంటీ వ్యవధిని జూన్ 30 వరకు పొడిగించింది. ఇది ఏప్రిల్ 1 మరియు మే 31 మధ్య ముగిసే వాహనాలకు వర్తిస్తుంది.

టాటా వాణిజ్య వాహనాలపై ఉచిత సర్వీస్ మరియు వారంటీ గడువు పొడగింపు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ కారణంగా, చాలా మంది కస్టమర్లు నిర్ణీత సమయంలో తమ వాహనాలను సర్వీస్ చేయించుకోలేకపోతున్నారని, అలాంటి వారి ప్రయోజనార్థం ఏప్రిల్, మే నెలలో గడువు ముగిసే అన్ని వాహనాల వారంటీ మరియు ఉచిత సర్వీస్ వ్యవధిని పొడిగించాలని టాటా మోటార్స్ నిర్ణయించింది.

టాటా వాణిజ్య వాహనాలపై ఉచిత సర్వీస్ మరియు వారంటీ గడువు పొడగింపు

టాటా మోటార్స్ ఇటీవల తమ వినియోగదారులు, డీలర్లు మరియు సరఫరాదారుల ప్రయోజనం కోసం 'బిజినెస్ ఎజిలిటీ ప్లాన్'ను ప్రవేశపెట్టింది. టాటా మోటార్స్ కూడా ఈ విపత్కర సమయంలో సామాన్య ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. లాక్‌డౌన్ సమయంలో కారును సురక్షితంగా ఉంచే చిట్కాలను కూడా కంపెనీ విడుదల చేసింది.

Most Read Articles

English summary
Tata Motors Now Extends Warranty And Free Service Period For Its CV Range. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X