Tata Punch కోసం అనధికారిక బుకింగ్స్ ప్రారంభం; పండుగ సీజన్‌లో విడుదల!

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ఎంట్రీ లెవల్ కార్ మార్కెట్ ని టార్గెట్ చేసి ఆవిష్కరించిన తమ సరికొత్త మైక్రో ఎస్‌యూవీ 'టాటా పంచ్' (Tata Punch) కోసం ఇప్పుడు కంపెనీ డీలర్లు అనధికారింగా బుకింగ్ లను కూడా స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పండుగ సీజన్ లో ఇది ప్రజల ముందుకు రానుంది.

Tata Punch కోసం అనధికారిక బుకింగ్స్ ప్రారంభం; పండుగ సీజన్‌లో విడుదల!

అయితే, ఈ విషయంపై Tata Motors నుండి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మార్కెట్ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం, మెట్రో నగరాల్లోని కొందరు Tata Motors డీలర్లు ఈ కారు కోసం అనధికారిక బుకింగ్‌లను తీసుకోవడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సదరు డీలర్లు కస్టమర్ల వద్ద నుండి రూ. 11,000 టోకెన్ అడ్వాన్స్ తీసుకుంటున్నట్లు సమాచారం.

Tata Punch కోసం అనధికారిక బుకింగ్స్ ప్రారంభం; పండుగ సీజన్‌లో విడుదల!

ఈ చిన్న ఎస్‌యూవీని అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ ప్రారంభంలో మార్కెట్లో విడుదల చేయవచ్చని అంచనా. కంపెనీ ఈ కొత్త కారును అనేక ఆధునిక ఫీచర్లతో మార్కెట్లో విడుదల చేయబోతోంది. కొత్త Punch మైక్రో ఎస్‌యూవీ Tata యొక్క ఎంట్రీ లెవల్ మోడల్ అని నమ్ముతారు మరియు ఇది అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో రానుంది.

Tata Punch కోసం అనధికారిక బుకింగ్స్ ప్రారంభం; పండుగ సీజన్‌లో విడుదల!

టాటా మోటార్స్ ఇటీవల ఈ కొత్త కారుకి సంబంధించిన టీజర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వచ్చింది. ఇప్పటి వరకూ విడుదల చేసిన టీజర్లలో కంపెనీ తమ పంచ్ మైక్రో ఎస్‌యూవీ ఎక్స్టీరియర్ డీటేలింగ్స్ మరియు డ్రైవింగ్ సామర్థ్యాలను తెలియజేసింది. కంపెనీ ఈ కొత్త కారును తమ పాపులర్ ALFA ARC ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మిస్తోంది.

Tata Punch కోసం అనధికారిక బుకింగ్స్ ప్రారంభం; పండుగ సీజన్‌లో విడుదల!

ఈ టీజర్ల ప్రకారం, Tata Punch మైక్రో ఎస్‌యూవీలో ఆకర్షణీయంగా కనిపించే హ్యారియర్ ప్రేరేపిత బంపర్ మరియు గ్రిల్ డిజైన్, ఫ్రంట్ బంపర్‌ పై అమర్చిన ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ లు మరియు ఫాగ్ ల్యాంప్‌ లతో ఇది ముందు వైపు నండి చాలా అగ్రెసివ్ లుక్ ని కలిగి ఉంటుంది.

Tata Punch కోసం అనధికారిక బుకింగ్స్ ప్రారంభం; పండుగ సీజన్‌లో విడుదల!

ఈ కారులోని హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్ క్లస్టర్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, సైడ్ మిర్రర్స్, మజిక్యులర్ బానెట్ లైన్స్, డోర్ హ్యాండిల్స్, ఫ్యూయెల్ క్యాప్ డిజైన్ మరియు పియానో బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడిన ఏ, బి, సి పిల్లర్స్ మొదలైన డిజైన్ అంశాలు గడచిన 2020 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ప్రదర్శించిన Tata HBX కాన్సెప్ట్ తో సమానంగా ఉన్నట్లు అనిపిస్తాయి.

Tata Punch కోసం అనధికారిక బుకింగ్స్ ప్రారంభం; పండుగ సీజన్‌లో విడుదల!

ఈ కారులో సన్నని ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, డ్యూయల్ టోన్ సైడ్ మిర్రర్లు, ఆకర్షణీయమైన ఫోర్ స్పోక్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ రూఫ్ మరియు రూఫ్ రైల్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది సైడ్ నుండి కూడా గొప్ప రూపాన్ని కలిగి ఉంటుంది. Tata Punch వెనుక రెండు వైపులా Y- ఆకారంలో ఉండే టెయిల్ లైట్ క్లస్టర్ మరియు దాని మధ్యలో టాటా లోగో, అలాగే ఎగువన హై-మౌంట్ స్టాప్ ల్యాంప్ కూడా ఉన్నాయి.

Tata Punch కోసం అనధికారిక బుకింగ్స్ ప్రారంభం; పండుగ సీజన్‌లో విడుదల!

డ్యూయల్ టోన్ అవతార్‌లో ఈ చిన్న ఎస్‌యూవీ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ప్రొడక్షన్ వెర్షన్ లో కూడా కంపెనీ ఈ కలర్ ఆప్షన్లను అలానే కొనసాగించవచ్చని తెలుస్తోంది. Tata Motors ఈ చిన్న కారుని అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో, అందించే అవకాశం ఉంది. తాజాగా విడుదలైన టీజర్ వీడియో ప్రకారం, ఈ మైక్రో ఎస్‌యూవీలో వివిధ రకాల ట్రాక్షన్ మోడ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.

Tata Punch కోసం అనధికారిక బుకింగ్స్ ప్రారంభం; పండుగ సీజన్‌లో విడుదల!

ఇక టాటా Tata Punch ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఈ చిన్న కారుకి సంబంధించిన ఇంటీరియర్ ఫొటోలను కంపెనీ ఇంకా వెల్లడించనప్పటికీ, ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, IRA కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మొదలైన ఫీచర్లు ఉంటాయని సమాచారం.

Tata Punch కోసం అనధికారిక బుకింగ్స్ ప్రారంభం; పండుగ సీజన్‌లో విడుదల!

సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారును 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) ని తయారు చేసిన ALFA ARC ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్న నేపథ్యంలో, ఇది చాలా ధృడంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో ABS, EBD, స్పీడ్ అలర్ట్, రెండు ఎయిర్ బ్యాగ్స్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు లభ్యం కానున్నాయి.

Tata Punch కోసం అనధికారిక బుకింగ్స్ ప్రారంభం; పండుగ సీజన్‌లో విడుదల!

ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, Tata Punch ఎస్‌యూవీలో కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్‌లను అందించే అవకాశం ఉంది. ఇందులో మొదటిది 1.2-లీటర్, 3 సిలిండర్ రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ 86 బిహెచ్‌పి పవర్ ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, రెండవది 1.2 లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్ ను మరియు 140 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది.

Tata Punch కోసం అనధికారిక బుకింగ్స్ ప్రారంభం; పండుగ సీజన్‌లో విడుదల!

ఈ ఇంజన్లు 5 స్పీడ్ మాన్యువల్ లేదా AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇది ఈ విభాగంలో ప్రధానంగా మహీంద్రా కెయువి 100 (Mahindra KUV100), మారుతి సుజుకి ఇగ్నిస్ (Maruti Suzuki Ignis) మరియు మారుతి సుజుకి ఎస్‌ప్రెసో (Maruti Suzuki S-Presso) వంటి మోడళ్లతో పోటీ పడే అవకాశం ఉంది.

Article Published On: Thursday, September 16, 2021, 16:53 [IST]
English summary
Tata motors dealers taking unofficial bookings for punch micro suv india launch expected soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+