భారతీయ రెజ్లర్‌ల కోసం టాటా మోటార్స్ ముందడుగు; నెక్స్ట్ ఒలంపిక్స్‌లో మరిన్ని మెడల్స్ ఖాయం

ఇటీవల 2020 ఒలంపిక్ గేమ్స్ జపాన్ రాజధాని టోక్యోలో అట్టహాసంగా, ఎంతో హోరాహోరీగా జరిగాయి. ఇందులో భారతీయ ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంతో తమ ప్రతిభను ప్రదర్శించి దేశానికే వన్నె తెచ్చారు. అయితే తరువాత 2024 లో జరిగే ఒలంపిక్ గేమ్స్ ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరగనున్నాయి. 2020 ఒలంపిక్స్ లో పాల్గొన్న ఆటగాళ్లు మొత్తం 7 పతకాలను సాధించారు, అయితే రానున్న ఒలంపిక్ గేమ్స్ లో మరిన్ని పతకాలను సాధించడానికి తమ వంతు సాయం చేయడానికి దేశీయ వాహన తయారీ సంస్థ అయిన Tata Motors (టాటా మోటార్స్) ముందుకు వచ్చింది.

భారతీయ రెజ్లర్‌ల కోసం టాటా మోటార్స్ ముందడుగు; నెక్స్ట్ ఒలంపిక్స్‌లో మరిన్ని మెడల్స్ ఖాయం

ఒలంపిక్ గేమ్స్ లో ఆడటానికి సన్నద్ధమయ్యే రెజ్లర్లకు Tata Motors సహాయం అందించనుంది. దీని కోసం Tata Motors ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్‌తో చేతులు కలిపింది. క్వెస్ట్ ఫర్ గోల్డ్ అని పిలువబడే ఈ ప్రాజెక్ట్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది.

భారతీయ రెజ్లర్‌ల కోసం టాటా మోటార్స్ ముందడుగు; నెక్స్ట్ ఒలంపిక్స్‌లో మరిన్ని మెడల్స్ ఖాయం

Tata Motors కంపెనీ ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో పారిస్ ఒలింపిక్స్‌లో ప్రదర్శన ఇవ్వడానికి భారతీయ రెజ్లర్‌లకు సహాయం అందించబడుతుందని తెలిపింది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించేలా చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

భారతీయ రెజ్లర్‌ల కోసం టాటా మోటార్స్ ముందడుగు; నెక్స్ట్ ఒలంపిక్స్‌లో మరిన్ని మెడల్స్ ఖాయం

ఇందులో భాగంగానే Tata Motors కంపెనీ, టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత రెజ్లింగ్ జట్టును సత్కరించింది. ఇందులో ఇండియన్ రెజ్లింగ్ బృందంలోని ప్రతి సభ్యుడికి టాటా మోటార్స్ యొక్క టాటా యోధ పిక్-అప్ ట్రక్ అందించారు. అంతే కాకూండా ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన Ravi Kumar Dahiya మరియు Bajarang Punia ని టాటా మోటార్స్ సత్కరించింది.

భారతీయ రెజ్లర్‌ల కోసం టాటా మోటార్స్ ముందడుగు; నెక్స్ట్ ఒలంపిక్స్‌లో మరిన్ని మెడల్స్ ఖాయం

ఇటీవల Tokyo Olympics లో Ravi Kumar Dahiya 57 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సొంతం చేసుకోగా, 65 కేజీల విభాగంలో Bajarang Punia బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నారు. ఈ ఇద్దరికీ Renault Kigger SUV లను Renault కంపెనీ యొక్క సేల్స్ & మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ Sudhir Malhotra అందజేశారు.

భారతీయ రెజ్లర్‌ల కోసం టాటా మోటార్స్ ముందడుగు; నెక్స్ట్ ఒలంపిక్స్‌లో మరిన్ని మెడల్స్ ఖాయం

Tata Motors ప్రారంభించిన ఈ కొత్త ప్రాజెక్ట్ కింద, అన్ని వయసుల మరియు బరువులు కలిగిన భారతీయ రెజ్లర్ల పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి చర్యలు తీసుకోబడుతుంది. ఇందులో భాగంగానే ఇండియన్ రెజ్లర్లకు ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించబడతాయి.

భారతీయ రెజ్లర్‌ల కోసం టాటా మోటార్స్ ముందడుగు; నెక్స్ట్ ఒలంపిక్స్‌లో మరిన్ని మెడల్స్ ఖాయం

ఈ ఈవెంట్ గురించి మాట్లాడుతూ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ, రెజ్లింగ్ క్రీడల్లో కొత్త శిఖరాలను చేరుకోవడానికి Tata Motors సహాయం చేస్తోందని అన్నారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో జరిగే రెజ్లింగ్‌లో భారత్ స్వర్ణం సాధిస్తుందని భావిస్తున్నారు.

భారతీయ రెజ్లర్‌ల కోసం టాటా మోటార్స్ ముందడుగు; నెక్స్ట్ ఒలంపిక్స్‌లో మరిన్ని మెడల్స్ ఖాయం

ఇంటర్నేషనల్ రెజ్లింగ్ పోటీల్లో భారతీయ ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే Tata Motors వీరికి సహాయం చేసి మరింత ఉన్నతావకాశాలు కల్పించడానికి సహాయం చేస్తుంది. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న 24 మంది భారతీయులకు Tata Motors Altroz కారును గిఫ్ట్ గా ఇచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన వారికి Tata Motors Altroz (ఆల్టోజ్) కారును గిఫ్ట్ గా ఇచ్చింది.

భారతీయ రెజ్లర్‌ల కోసం టాటా మోటార్స్ ముందడుగు; నెక్స్ట్ ఒలంపిక్స్‌లో మరిన్ని మెడల్స్ ఖాయం

స్పోర్ట్స్ స్టార్స్ యొక్క ప్రయత్నాలను ప్రశంసించడానికి మరియు ప్రోత్సహించడానికి Tata Motors ఈ గిఫ్ట్స్ అందించడం జరిగింది. అందరూ ఒలింపిక్స్‌లో పతక విజేతలకు బహుమతులు ఇస్తున్నప్పుడు, Tata Motors మాత్రం కాంస్య పతకం సాధించడంలో విఫలమైన వారికి కూడా గిఫ్ట్ ఇచ్చి మరింత ప్రోత్సహిస్తోంది.

భారతీయ రెజ్లర్‌ల కోసం టాటా మోటార్స్ ముందడుగు; నెక్స్ట్ ఒలంపిక్స్‌లో మరిన్ని మెడల్స్ ఖాయం

Tata Motors కంపెనీ చేసిన ఈ చర్యకు ఏంతోమంది ముగ్దులయ్యారు. Tata Motors అథ్లెట్లకు Tata Altroz కారుని అందించింది. ఈ కారు NCAP క్రాష్ టెస్ట్‌లో5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కైవసం చేసుకున్న కారు. ఇది దేశీయ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందింది. Tata Motors కార్లు వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యతను ఇస్తాయి.

భారతీయ రెజ్లర్‌ల కోసం టాటా మోటార్స్ ముందడుగు; నెక్స్ట్ ఒలంపిక్స్‌లో మరిన్ని మెడల్స్ ఖాయం

Tata Motors కంపెనీ భారతదేశానికి ఎనలేని సేవ చేస్తోంది. కరోనా కోరల్లో నలుగుతున్న వేళ Tata Motors చైర్మన్ Ratan Tata దేశం కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. అంతే కాకూండా Tata Motors మెడికల్ ఆక్సిజన్‌తో సహా వివిధ అవసరమైన వైద్య సౌకర్యాలకు కూడా అందించి తన సేవా దృక్పథాన్ని చాటుకుంది.

Most Read Articles

English summary
Tata motors felicitates tokyo olympic wrestlers launches initiative to train wrestlers
Story first published: Saturday, August 28, 2021, 13:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X