ఒకే రోజు 106 కార్లను డెలివరీ చేసిన Tata డీలర్: ఎక్కడో తెలుసా?

దేశీయ మార్కెట్లో Tata Motors (టాటా మోటార్స్) కి మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే కంపెనీ మంచి అమ్మకాలతో మంచి ప్రజాదరణ పొందుతోంది. అయితే ఇప్పుడు భారతదేశంలో దుర్గష్టమి యొక్క నవరాత్రులు మొదలయ్యాయి. చాలా మంది ప్రజలు ఈ సమయంలో కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే Tata Motors కంపెనీ నవరాత్రులు ప్రారంభమైన మొదటి రోజు ఏకంగా 106 కార్లను డెలివరీ చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఒకే రోజు 106 కార్లను డెలివరీ చేసిన Tata డీలర్: ఎక్కడో తెలుసా?

నివేదికల ప్రకారం, Tata Motors (టాటా మోటార్స్) తన గురుగ్రామ్ డీలర్‌షిప్ వద్ద నవరాత్రి మొదటి రోజున 106 కార్లను డెలివరీ చేసింది. కంపెనీ ఈ కార్లలో సఫారీ, నెక్సాన్, ఆల్ట్రోజ్, టియాగో, హారియర్ మరియు టిగోర్ వంటి మోడల్స్ ఉన్నాయి. నవరాత్రులు ప్రారంభమైన మొదటి రోజే ఇన్ని డెలివరీలు చేసిందంటే కంపెనీ ఈ నెల భారీ అమ్మకాలనే చేపట్టే అవకాశం ఉంటుంది.

ఒకే రోజు 106 కార్లను డెలివరీ చేసిన Tata డీలర్: ఎక్కడో తెలుసా?

కంపెనీ డెలివరీ చేసిన ఈ కార్లను చూపించే వీడియో కూడా అందుబాటులో ఉంది. ఈ వీడియెను మీరు ఇక్కడ చూడవచ్చు. గురుగ్రామ్ డీలర్‌షిప్ వద్ద కార్లను డెలియరీ చేసేటప్పుడు ప్రతి కారు వద్ద కేక్ కటింగ్ కూడా చేశారు. 106 కార్లను డెలియరీ చేసిన ఈ గురుగ్రామ్ లోని డీలర్‌షిప్ పేరు ఆర్య డీలర్‌షిప్.

ఆర్య డీలర్‌షిప్ పండుగ సీజన్ మొదటి రోజు ఇంత పెద్ద సంఖ్యలో వాహనాలను డెలివరీ చేయడం గొప్ప విషయం, అనే చేప్పాలి. పండుగ సీజన్ ప్రారంభం కావడం వల్ల కంపెనీలన్నీ కూడా అమ్మకాలు మెరుగుపరచడానికి తగిన సన్నాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ పండుగ సీజన్లో కంపెనీ మంచి అమ్మకాలు చేపట్టే అవకాశం ఉంటుంది.

ఒకే రోజు 106 కార్లను డెలివరీ చేసిన Tata డీలర్: ఎక్కడో తెలుసా?

చాలా కంపెనీ మంచి అమ్మకాలను పొందటం కోసం అనేక కొత్త మోడల్స్ కూడా మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. అయితే టాటా మోటార్స్ టాటా పంచ్ అనే కొత్త మైక్రో SUV ప్రారంభించడానికి సన్నాలు సిద్ధం చేస్తుంది. ఈ కొత్త మోడల్స్ అన్ని కూడా వినియోగదారులను ఆకర్షించడంలో సహాయపడతాయి.

ఒకే రోజు 106 కార్లను డెలివరీ చేసిన Tata డీలర్: ఎక్కడో తెలుసా?

ఈ పండుగ సీజన్‌లో కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త మైక్రో SUV కోసం కంపెనీ బుకింగ్స్ కూడా అధికారికంగా ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు కంపెనీ డీలర్‌షిప్ లేదా వెబ్‌సైట్‌ను సందర్శించి రూ. 21,000 లతో బుక్ చేసుకోవచ్చు. టాటా పంచ్ అక్టోబర్ 20 న దేశీయ మార్కెట్లో విడుదల కానుంది.

ఈ రోజు నుండి Tata Motors కంపెనీ ఈ కొత్త టాటా పంచ్ మైక్రో SUV ని డీలర్‌షిప్‌లో ప్రదర్శించబోతోంది, కావున కస్టమర్లు దీనిని డీలర్‌షిప్‌లో చూడవచ్చు. అంతే కాకుండా కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇప్పుడు దీనిని ఈ రోజు నుంచి టెస్ట్ డ్రైవ్ కూడా చేయవచ్చు. కంపెనీ ఈ టెస్ట్ డ్రైవ్ కోసం టెస్ట్ మోడల్‌ని కూడా అందుబాటులో ఉంచింది.

ఒకే రోజు 106 కార్లను డెలివరీ చేసిన Tata డీలర్: ఎక్కడో తెలుసా?

కొత్త టాటా పంచ్ అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలతో పాటు, మంచ్చి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇది మంచి పర్ఫామెన్స్ అందించడానికి మంచి ఇంజిన్ కూడా పొందుతుంది. కావున టాటా మోటార్స్ యొక్క ఈ కొత్త మైక్రో SUV ఈ పండుగా సీజన్లో ఎక్కువమందిని ఆకర్శించే అవకాశం ఉంటుంది.

Tata Motors ఇటీవల తన అమ్మకాల నివేదికను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం, తన ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో 20 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. కార్ల తయారీదారు గత నెలలో 25,730 యూనిట్లను విక్రయించగా, గత ఏడాది ఇదే కాలంలో 21,199 యూనిట్లను విక్రయించింది.

ఒకే రోజు 106 కార్లను డెలివరీ చేసిన Tata డీలర్: ఎక్కడో తెలుసా?

కంపెనీ యొక్క అమ్మకాల వృద్ధిలో ఎలక్ట్రిక్ వాహనాలు చాలా దోహదపడ్డాయి. టాటా మోటార్స్ EV వ్యాపారం గత 12 నెలల్లో దాదాపు మూడు రెట్లు పెరిగింది. టాటా మోటార్స్ గత నెలలో 1,078 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో కేవలం 308 EV లను మాత్రమే విక్రయించగలిగింది.

Tata Motors తన ఉత్పత్తిని మరింత పెంచడానికి ఇప్పటికే తమిళనాడులోని ఫోర్డ్ ప్లాంట్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఫోర్డ్ ఇండియా ఇటీవల భారతదేశంలో దేశీయ ఉత్పత్తిని నిలిపివేసిందని, వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి అన్ని స్థానిక ఉత్పత్తిని నిలిపివేయడానికి కూడా సన్నాహాలు చేస్తుంది.

ఒకే రోజు 106 కార్లను డెలివరీ చేసిన Tata డీలర్: ఎక్కడో తెలుసా?

Tata Motors కంపెనీ యొక్క డీలర్షిప్ ఇప్పుడు ఒకే రోజు ఎక్కువ మొత్తంలో వాహనాలను డెలివరీ చేయడంతో, కంపెనీ తప్పకుండా మంచి అమ్మకాలతో ముందుకు వెళుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కావున కంపెనీ మళ్ళీ మంచి అమ్మకాలతో పూర్వ వైభవం పొందనుంది.

Most Read Articles

English summary
Tata motors gurugram dealership delivers 106 cars in a day details
Story first published: Saturday, October 9, 2021, 18:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X