పెరిగిన టాటా కార్ల ధరలు; ఏయే మోడల్ ధరలు ఎంత మేర పెరిగాయంటే..

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవల తమ హారియర్ మరియు సఫారీ మోడళ్లలో రెండు కొత్త వేరియంట్లను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు కంపెనీ తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఇతర మూడు కార్ల ధరలను పెంచింది.

పెరిగిన టాటా కార్ల ధరలు; ఏయే మోడల్ ధరలు ఎంత మేర పెరిగాయంటే..

టాటా నెక్సాన్, టాటా టియాగో మరియు టాటా టిగోర్ మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ధరల పెరుగుదలకు సంబంధించిన కారణాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. మోడల్ మరియు వేరింయంట్‌ల వారీగా పెరిగిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

పెరిగిన టాటా కార్ల ధరలు; ఏయే మోడల్ ధరలు ఎంత మేర పెరిగాయంటే..

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ ధరల పెరుగుదల విషయానికి వస్తే, కంపెనీ ఈ మోడల్ ధరలను కనిష్టంగా రూ.4,000 నుండి గరిష్టంగా రూ.13,500 వరకూ పెంచింది. ధరల పెంపు అనంతరం పెట్రోల్ వెర్షన్ నెక్సాన్ ధరలు రూ.7,28,900 నుండి రూ.11,76,400 మధ్యలో ఉన్నాయి.

పెరిగిన టాటా కార్ల ధరలు; ఏయే మోడల్ ధరలు ఎంత మేర పెరిగాయంటే..

ఇక డీజిల్ వెర్షన్ నెక్సాన్ ధరల పెరుగుదల విషయానికి వస్తే, కంపెనీ వీటిని కనిష్టంగా రూ.2,500 నుండి గరిష్టంగా రూ.13,500 మేర పెంచింది. ధరల పెరుగుదల అనంతరం డీజిల్ వెర్షన్ నెక్సాన్ ధరలు రూ.8,58,900 నుండి రూ.13,23,900 మధ్యలో అమ్ముడవుతున్నాయి.

Nexon Petrol Old Price New Price Difference
XE ₹7,19,900 ₹7,28,900 ₹9,000
XM ₹8,15,900 ₹8,27,400 ₹11,500
XM (S) ₹8,67,900 ₹8,81,400 ₹13,500
XZ ₹9,15,900 ₹9,27,400 ₹11,500
XZ+ ₹9,95,900 ₹9,99,900 ₹4,000
XZ+ DT ₹10,12,900 ₹10,19,400 ₹6,500
XZ+ Dark - ₹10,39,900 -
XZ+ S ₹10,55,900 ₹10,67,400 ₹11,500
XZ+ DT (S) ₹10,72,900 ₹10,84,400 ₹11,500
XZ+ (O) ₹10,85,900 ₹10,97,400 ₹11,500
XZ+ DT (O) ₹11,02,900 ₹11,14,400 ₹11,500
XZ+ (O) Dark - ₹11,29,900 -
XMA ₹8,75,900 ₹8,89,400 ₹13,500
XMA (S) ₹9,27,900 ₹9,41,400 ₹13,500
XZA+ ₹10,55,900 ₹10,64,400 ₹8,500
XZA+ DT ₹10,72,900 ₹10,81,400 ₹8,500
XZA+ Dark - ₹10,99,900 -
XZ+ S ₹11,15,900 ₹11,29,400 ₹13,500
XZA+ DT(S) ₹11,32,900 ₹11,46,400 ₹13,500
XZA+ (O) ₹11,45,900 ₹11,59,400 ₹13,500
XZA+ DT (O) ₹11,62,900 ₹11,76,400 ₹13,500
Nexon Diesel Old Price New Price Difference
XE ₹8,49,900 ₹8,58,900 ₹9,000
XM ₹9,48,900 ₹9,51,400 ₹2,500
XM (S) ₹9,99,900 ₹9,99,900 0
XZ ₹10,48,900 ₹10,60,400 ₹11,500
XZ+ ₹11,28,900 ₹11,35,400 ₹6,500
XZ+ DT ₹11,45,900 ₹11,51,400 ₹6,500
XZ+ Dark ₹11,73,900 -
XZ+ S ₹11,88,900 ₹12,00,400 ₹11,500
XZ+ DT (S) ₹12,05,900 ₹12,17,400 ₹11,500
XZ+ (O) ₹12,18,900 ₹12,30,400 ₹11,500
XZ+ DT (O) ₹12,35,900 ₹12,47,400 ₹11,500
XZ+ (O) Dark - ₹12,63,900 -
XMA ₹10,08,900 ₹10,13,400 ₹4,500
XMA (S) ₹10,60,900 ₹10,63,900 ₹3,000
XZA+ ₹11,88,900 ₹11,97,400 ₹8,500
XZA+ DT ₹12,05,900 ₹11,14,400 ₹8,500
XZA+ Dark - ₹12,33,900 -
XZ+ S ₹12,48,900 ₹12,62,400 ₹13,500
XZA+ DT(S) ₹12,65,900 ₹12,79,400 ₹13,500
XZA+ (O) ₹12,78,900 ₹12,92,400 ₹13,500
XZA+ DT (O) ₹12,95,900 ₹13,09,400 ₹13,500
XZA+ (O) Dark - ₹13,23,900 -
పెరిగిన టాటా కార్ల ధరలు; ఏయే మోడల్ ధరలు ఎంత మేర పెరిగాయంటే..

టాటా మోటార్స్ ఇటీవలే నెక్సాన్‌లో కొత్తగా డార్క్ ఎడిషన్‌ను కూడా విడుదల చేసింది. టాటా నెక్సాన్ 1.2-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్ మరియు 170 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగా, డీజిల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్ మరియు 260 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పెరిగిన టాటా కార్ల ధరలు; ఏయే మోడల్ ధరలు ఎంత మేర పెరిగాయంటే..

టాటా టియాగో

టాటా మోటార్స్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టియాగో ధరలు కనిష్టంగా రూ.1,100 నుండి గరిష్టంగా రూ.7,000 మేర పెరిగాయి. ఇది కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ధరల పెరుగుదల అనంతరం మాన్యువల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.4,99,900 గా ఉంటే, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.6,43,900 కి పెరిగింది.

పెరిగిన టాటా కార్ల ధరలు; ఏయే మోడల్ ధరలు ఎంత మేర పెరిగాయంటే..

అలాగే, టాటా టియాగో ఆటోమేటిక్ వేరియంట్ ధరల విషయానికి వస్తే, ఇవి కనిష్టంగా రూ.5,000 నుండి గరిష్టంగా రూ.10,000 మేర పెరిగాయి. ధరల పెరుగుదల అనంతరం ఆటోమేటిక్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6,24,900 గా ఉంటే, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.7,04,900 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Tiago Petrol MT

New Price Old Price Difference
XE ₹4,99,900 ₹4,99,900 0
XTO ₹5,49,900 - -
XT ₹5,69,900 ₹5,62,900 ₹7,000
XT LE ₹5,79,000 - -
XZ ₹6,09,000 ₹6,07,900 ₹1,100
XZ+ ₹6,37,900 ₹6,33,900 ₹4,000
XZA+ DT ₹6,49,900 ₹6,43,900 ₹6,000
Tiago Petrol AMT

New Price Old Price Difference
XTA ₹6,24,900 ₹6,14,900 ₹10,000
XZA ₹6,64,900 ₹6,59,900 ₹5,000
XZA+ ₹6,92,900 ₹6,85,900 ₹7,000
XZA+ DT ₹7,04,900 ₹6,95,900 ₹9,000
పెరిగిన టాటా కార్ల ధరలు; ఏయే మోడల్ ధరలు ఎంత మేర పెరిగాయంటే..

టాటా టియాగోలో కంపెనీ ఇటీవలే ఎక్స్‌టి (ఓ) అనే కొత్త వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో బిఎస్ 6 కంప్లైంట్ 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్‌ను మరియు 3300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

పెరిగిన టాటా కార్ల ధరలు; ఏయే మోడల్ ధరలు ఎంత మేర పెరిగాయంటే..

టాటా టిగోర్

టాటా టియాగో ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకున్న టిగోర్ కాంపాక్ట్ సెడాన్ ధరలను కంపెనీ కనిష్టంగా రూ.5,000 నుండి గరిష్టంగా రూ.8,000 మేర పెంచింది. ధరల పెరుగుదల ధర అనంతరం మార్కెట్లో టాటా టిగోర్ సెడాన్ కొత్త ధరలు రూ.5,64,900 నుండి రూ.7,81,900 (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

Tigor Petrol

New Price Old Price Difference
XE ₹5,64,900 ₹5,59,900 ₹5,000
XM ₹6,24,900 ₹6,19,900 ₹5,000
XZ ₹6,65,900 ₹6,60,900 ₹5,000
XZ+ ₹7,16,900 ₹7,21,000 ₹5,000
XMA ₹6,79,900 ₹6,71,900 ₹8,000
XZA+ ₹7,81,900 ₹7,73,900 ₹8,000
పెరిగిన టాటా కార్ల ధరలు; ఏయే మోడల్ ధరలు ఎంత మేర పెరిగాయంటే..

టాటా టియాగో మరియు టిగోర్ మోడళ్లలో ఒకేరకమైన ఇంజన్‌ను ఉపయోగించారు. టాటా టిగోర్‌లోని బిఎస్-6 కంప్లైంట్ 1.2-లీటర్ న్యాచురల్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

English summary
Tata motors increases nexon tiago tigor prices new price list
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X