టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా డీల్; కార్ల కోసం కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, ఈ కరోనా మహమ్మారి కష్టకాలంలో తమ వాహనాల కొనుగోలును సులభతరం చేసేందుకు కొత్త ఫైనాన్స్ పథకాలను ప్రవేశపెట్టింది. కంపెనీ ఇందుకోసం కోటాక్ మహీంద్రా ప్రైమ్ లిమిటెడ్ ఓ సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.

టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా డీల్; కార్ల కోసం కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

ఈ ఒప్పందంలో భాగంగా, రెడ్ కార్పెట్, ప్రైమ్ విశ్వాస్ మరియు వివిధ కస్టమర్ గ్రూపుల (జీతం, స్వయం ఉపాధి, ఆదాయ రుజువు) కోసం తక్కువ ఈఎమ్ఐ అనే మూడు ఫైనాన్స్ పథకాలను ప్రవేశపెట్టారు. పట్టణ మరియు గ్రామీణ కస్టమర్ సమూహాలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాలను మోడల్ ప్రాతిపదికన ప్రవేశపెట్టారు.

టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా డీల్; కార్ల కోసం కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

రెడ్ కార్పెట్ స్కీమ్:

ఆదాయ ధృవీకరణ (ఇన్‌కమ్ ప్రూఫ్) వారికి మాత్రమే రెడ్ కార్పెట్ ఫైనాన్స్ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్‌లో భాగంగా, ఆన్-రోడ్ ధరపై 90 శాతం వరకూ ఫండింగ్‌ను అందిస్తున్నారు. ఇందులో 7 సంవత్సరాల వరకు రుణ వ్యవధి మరియు రుణం యొక్క ప్రీ-పేమెంట్ లేదా పార్ట్-పేమెంట్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నారు.

టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా డీల్; కార్ల కోసం కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

టాటా సఫారి, టాటా హారియర్, టాటా నెక్సాన్, టాటా ఆల్ట్రోజ్, టాటా టిగోర్ మరియు టాటా టియాగో వంటి వాహనాలను ఈ రెడ్ కార్పెట్ స్కీమ్ కవర్ చేస్తుంది.

టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా డీల్; కార్ల కోసం కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

ప్రైమ్ విశ్వస్ స్కీమ్:

ఆదాయ రుజువు (ఇన్‌కమ్ ప్రూఫ్) లేని వినియోగదారుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా, వాహనం యొక్క ఎక్స్-షోరూమ్ ధరలో వినియోగదారులకు 90 శాతం వరకూ ఫండింగ్, 5 సంవత్సరాల వరకు రుణ వ్యవధి ఉంటుంది. వ్యవసాయ భూమి లేదా ఆస్తి పత్రాల ఆధారంగా రుణం ఇవ్వబడుతుంది.

టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా డీల్; కార్ల కోసం కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

తక్కువ EMI స్కీమ్:

ఈ పథకాన్ని ప్రత్యేకించి స్వయం ఉపాధి లేదా జీతానికి పనిచేసే వారిని దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టారు. ఇందులో వినియోగదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, మొదటి మూడు నెలల పాటు 50 శాతం వరకు తక్కువ EMI ఆప్షన్ ఉంటుంది. అంటే, మొదటి 3 నెలల పాటు ప్రతి లక్ష రూపాయలకు కనీస EMI రూ.999గా ఉంటుంది. అంతేకాకుండా, ఈ స్కీమ్‌లో భాగంగా కస్టమర్లకు ఆన్-రోడ్ ధరపై 80 శాతం వరకు ఫండింగ్ అందించనున్నారు.

టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా డీల్; కార్ల కోసం కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

ఈ కొత్త ఫైనాన్స్ పథకాలను పొందటానికి వినియోగదారులు టాటా మోటార్స్ డీలర్‌షిప్‌లను సందర్శించవచ్చు లేదా టాటా మోటార్స్ వాహనాలను కొనుగోలు చేయడానికి కోటక్ మహీంద్రా ప్రైమ్ బ్రాంచ్‌ను కూడా సంప్రదించవచ్చు. అంతే కాకుండా, ఈ పథకాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో కూడా పొందవచ్చు.

టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా డీల్; కార్ల కోసం కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

టాటా కార్లపై రూ.65,000 వరకూ డిస్కౌంట్స్

టాటా మోటార్స్ జూన్ 2021 నెలలో భాగంగా, తమ ప్యాసింజర్ కార్లపై రూ.65,000 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. టాటా నెక్సాన్, టియాగో, టిగోర్ మరియు హారియర్ మోడళ్లపై కంపెనీ ఈ తగ్గింపులను అందిస్తోంది. మోడల్‌ను బట్టి డిస్కౌంట్ అమౌంట్ మారుతూ ఉంటుంది.

టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా డీల్; కార్ల కోసం కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

టాటా టియాగోపై ఈ నెలలో కంపెనీ మొత్తం రూ.25,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటుగా రూ.15,000 నగదు తగ్గింపు ఉన్నాయి. అలాగే, టిగోర్ సెడాన్‌పై కంపెనీ మొత్తం రూ.30,000 వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.15,000 నగదు తగ్గింపుతో పాటుగా రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.

టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా డీల్; కార్ల కోసం కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

టాటా నెక్సాన్‌పై కంపెనీ ఈ కేవలం రూ.15,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్‌ను మాత్రమే అందిస్తోంది. ఇది కాకుండా, దీనిపై వేరే ఏ ఇతర ఆఫర్ లేదు. కాగా, టాటా హారియర్‌పై ఈ నెలలో కంపెనీ గరిష్టంగా రూ.65,000 వరకు లాభాలను అందిస్తోంది. ఇందులో రూ.25,000 నగదు తగ్గింపు మరియు రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Tata Motors Join Hands With Kotak Mahindra And Announces New Finance Scheme, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X