టాటా కార్లపై జూన్ 2021 ఆఫర్స్; రూ.65,000 వర్కూ డిస్కౌంట్స్!
దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా, గత నెలలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలలో భారీ తగ్గుదల కనిపించింది. ఈ జాబితాలో ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కూడా ఉంది. గడచిన మే 2021 నెలలో టాటా మోటార్స్ అమ్మకాలు భారీగా తగ్గాయి. ఏప్రిల్ 2021తో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 38 శాతం తగ్గాయి.

అమ్మకాల తగ్గుదల తర్వాత, కంపెనీ ఇప్పుడు తమ కార్ల అమ్మకాలను మెరుగుపరచేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా, కంపెనీ జూన్ 2021 నెలలో తమ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఇందులో టాటా టియాగో, హారియర్, టిగోర్ మరియు నెక్సాన్ మోడళ్లు ఉన్నాయి. మోడల్ వారీగా లభించే డిస్కౌంట్ల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

1. టాటా టియాగో
కంపెనీ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగోపై ఈ నెలలో కంపెనీ మొత్తం రూ.25,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటుగా రూ.15,000 నగదు తగ్గింపును అందిస్తోంది.

2. టాటా టిగర్
టాటా మోటార్స్ విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ సెడాన్ టాటా టిగోర్‌పై జూన్ 2021లో భాగంగా, కంపెనీ మొత్తం రూ.30,000 వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.15,000 నగదు తగ్గింపుతో పాటుగా రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది.

3. టాటా నెక్సాన్
టాటా మోటార్స్ నుండి అత్యంత పాపులర్ అయిన కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్‌పై జూన్ 2021 ఆఫర్‌లో భాగంగా, కంపెనీ ఈ ఎస్‌యూవీపై కేవలం రూ.15,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్‌ను మాత్రమే అందిస్తోంది. ఇది కాకుండా, దీనిపై వేరే ఏ ఇతర ఆఫర్ లేదు.

4. టాటా హారియర్
టాటా మోటార్స్‌కు చెందిన 5-సీటర్ ప్రీమియం ఎస్‌యూవీ టాటా హారియర్‌పై ఈ నెలలో కంపెనీ గరిష్టంగా రూ.65,000 వరకు లాభాలను అందిస్తోంది. ఇందులో రూ.25,000 నగదు తగ్గింపును కంపెనీ అందిస్తుండగా, రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తున్నారు.

టాటా హారియర్ యొక్క క్యామో, డార్క్ ఎడిషన్, ఎక్స్‌జెడ్+ మరియు ఎక్స్‌జెడ్ఏ+ వేరియంట్లు మినహా మిగతా వాటిపై రూ.65,000 వరకు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. మరోవైపు, పైన పేర్కొన్న అన్ని వేరియంట్లపై కంపెనీ కేవలం రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను మాత్రమే అందిస్తోంది.

టాటా మోటార్స్ గడచిన మే 2021 నెలలో దేశీయ మార్కెట్లో 15,181 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (మే 2020లో) కంపెనీ మొత్తం అమ్మకాలు 3,152 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ఏకంగా 382 శాతం పెరిగాయి.


Click it and Unblock the Notifications








