Just In
- 3 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 6 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 7 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్
- 8 hrs ago
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- Sports
RCB vs RR: పడిక్కల్ మెరుపు సెంచరీ.. కోహ్లీ అర్ధ శతకం.. రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం!
- News
కోవిడ్ వ్యాక్సిన్ అప్డేట్: ధర, రిజిస్ట్రేషన్, సైడ్ ఎఫెక్ట్స్ - అన్ని ప్రశ్నలకు సమాధానాలు
- Movies
మరణం తర్వాత కూడా తీరని వివేక్ చివరి కోరిక.. అభిమానులకు షాక్ ఇచ్చిన స్టార్ దర్శకుడు
- Finance
భారీగా తగ్గిన బంగారం ధరలు: పసిడి రూ.500 డౌన్, వెండి రూ.1000 పతనం
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నెక్స్ట్ జనరేషన్ ఆల్టా స్లీక్ టి-సిరీస్ ట్రక్కులను విడుదల చేసిన టాటా మోటార్స్
భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్, దేశీయ మార్కెట్లో కొత్త రకం ట్రక్కులను విడుదల చేసింది. మధ్య తరహా మరియు తేలికపాటి వాణిజ్య ట్రక్కుల విభాగంలో కంపెనీ ఈ కొత్త తరం వాహనాలను ప్రవేశపెట్టింది.

పట్టణ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని టాటా మోటార్స్ ఈ ట్రక్కులను ప్రత్యేకంగా డిజైన్ చేసింది. ఆల్ట్రా స్లీక్ టి-సీరిస్ పేరుతో కంపెనీ వీటిని విడుదల చేసింది. ఇందులో టి6, టి7 మరియు టి9 మోడళ్లను కంపెనీ విక్రయిస్తోంది.

ఈ సరికొత్త టాటా టి-సిరీస్ ట్రక్కుల డెక్ పరిమాణం 10 అడుగుల నుండి 20 అడుగుల వరకు ఉంటుంది. ఈ ట్రక్కులు 1900 మిమీ వెడల్పు గల క్యాబిన్ కలిగివుంటాయి. ఫలితంగా, ట్రక్కు లోపల డ్రైవర్‌కు సౌకర్యవంతమైన మరియు విశాలవంతమైన క్యాబిన్ స్పేస్ లభిస్తుంది.

టాటా మోటార్స్ ఈ ట్రక్కుల యొక్క ఎన్‌విహెచ్ (నాయిస్, వైబ్రేషన్, హార్ష్‌నెస్) లెవల్స్ స్థాయిని కూడా మెరుగుపరిచింది. ఫలితంగా, ఇవి చాలా స్మూత్‌గా తక్కువ శబ్ధాన్ని కలిగించేలా ఉంటాయి. దీని కారణంగా, క్యాబిన్ లోపల ఇది డ్రైవర్‌కు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని కల్పిస్తుంది.

కంపెనీ ఈ ట్రక్కుల క్యాబిన్ యొక్క దృఢత్వాన్ని కూడా బాగా మెరుగుపరచింది. ఈ క్యాబిన్లను కొత్త భద్రతా నిబంధనల ప్రకారం నిర్మించినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. ఈ ట్రక్కులలో డ్రైవర్‌కు సురక్షితమైన క్యాబిన్ అనుభూతిని కల్పిస్తామని కంపెనీ పేర్కొంది.

కఠినమైన రహదారుల్లో సైతం సురక్షితంగా మరియు సౌకర్యంగా ప్రయాణించేలా ఈ కొత్త తరం ట్రక్కులను రూపొందించినట్లు టాటా మోటార్స్ తెలిపింది. వీటిలో ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, టిల్ట్ అడ్జస్టబల్ స్టీరింగ్ వీల్, పవర్ స్టీరింగ్, డాష్‌బోర్డుకే అమర్చిన గేర్‌బాక్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

అంతేకాకుండా, డ్రైవర్ వినోదం కోసం ఇన్‌బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, యుఎస్‌బి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ మరియు స్టోరేజ్ స్పేస్ వంటి పలు అధునాతన ఫీచర్లతో దీనిని రూపొందించారు. వీటిలో కొత్త పారాబొలిక్ లీఫ్ సస్పెన్షన్ సిస్టమ్ మరియు ఎయిర్ బ్రేక్‌లను ఉపయోగించినట్లు కంపెనీ వివరించింది.

అధునాతన సస్పెన్షన్ సిస్టమ్ మరియు ధృడమైన బ్రేకులు ట్రక్కుపై మంచి కంట్రోల్‌ను ఆఫర్ చేస్తాయని, రాత్రివేళల్లో వెనుక నుంచి వచ్చే వాహనాల యొక్క విజిబిలిటీ కోసం ఇందులో ఎల్ఈడి ల్యాంప్స్‌ను ఉపయోగించామని టాటా మోటార్స్ తెలిపింది.

ఈ ట్రక్కుల పరిమాణం మరియు బరువు ప్రకారం, ఇవి 4 టైర్లు మరియు 6 టైర్ల రూపంలో లభ్యం కానున్నాయి. ఈ ట్రక్కులను నిర్మాణ పనులు, ఇ-కామర్స్ మరియు అనేక ఇతర పనులకు ఉపయోగించవచ్చు. ఈ ట్రక్కుల ద్వారా చల్లటి పదార్థాలను రవాణా చేసేందుకు ఇందులో ఎయిర్ కండిషన్డ్ కంటైనర్లను కూడా ఏర్పాటు చేసే సదుపాయాన్ని టాటా అందించింది.

టాటా మోటార్స్ ప్రవేశపెట్టిన ఈ లేటెస్ట్ టి-సిరీస్ ట్రక్కులలో బిఎస్6 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పి పవర్‌ను 300 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి ఈ విభాగంలోనే ఉత్తమై మైలేజీని ఆఫర్ చేస్తాయని కంపెనీ తెలిపింది.

మెరుగైన మైలేజీని అందించడానికి ట్రక్కులలో రేడియల్ టైర్లను ఉపయోగించారు. టాటా ఈ ట్రక్కులతో దేశవ్యాప్తంగా సర్వీస్ వారంటీ, సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్స్ మరియు అధిక రీసేల్ వ్యాల్యూ వంటి వాటికి హామీ ఇస్తుంది. ఈ కొత్త ట్రక్ శ్రేణికి 3 సంవత్సరాల లేదా 3 లక్షల కిలోమీటర్ల వారంటీని కంపెనీ అందిస్తోంది.