ఏప్రిల్ 2021లో ఏ టాటా కార్ బెస్ట్ అంటే..?

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ గడచిన ఏప్రిల్ 2021 నెల అమ్మకాలను విడుదల చేసింది. అంతకు ముందు నెల (మార్చి 2021)తో పోల్చుకుంటే, గత నెలలో టాటా మోటార్స్ అమ్మకాలు 15 శాతం క్షీణించాయి. ఈ సమయంలో కంపెనీ మొత్తం 25,096 కార్లను విక్రయించింది.

ఏప్రిల్ 2021లో ఏ టాటా కార్ బెస్ట్ అంటే..?

టాటా మోటార్స్ మోడల్ వారీ అమ్మకాలను గమనిస్తే, గత నెలలో టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మొదటి స్థానంలో ఉండగా, తరువాతి స్థానాల్లో టియాగో మరియు అల్ట్రోజ్ కార్లు ఉన్నాయి. ఈ జాబితాలో ఇటీవలే విడుదలైన సరికొత్త ఫుల్ సైజ్ ఎస్‌యూవీ టాటా సఫారీ చివరి స్థానంలో ఉంది.

ఏప్రిల్ 2021లో ఏ టాటా కార్ బెస్ట్ అంటే..?

ఏప్రిల్ 2021లో టాటా నెక్సాన్ అమ్మకాలు 20 శాతం తగ్గి 6,938 యూనిట్లు అమ్ముడయ్యాయి. మార్చి 2021లో ఈ ఎస్‌యూవీ అమ్మకాలు 8,683 యూనిట్లుగా నమోదయ్యాయి. కొత్త అవతార్ ప్రవేశపెట్టిన తరువాత, టాటా నెక్సాన్ ఎస్‌యూవీ అమ్మకాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. అయితే, విజంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ నెలలో ఇవి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

MOST READ:కరోనా నివారణ కోసం ఫస్ట్ డ్రైవ్-ఇన్ వ్యాక్సిన్ క్యాంప్ స్టార్ట్ చేసిన BMC

ఏప్రిల్ 2021లో ఏ టాటా కార్ బెస్ట్ అంటే..?

టాటా మోటార్స్ విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో అమ్మకాలు కూడా గడచిన మార్చి 2021తో పోలిస్తే, ఏప్రిల్ 2021లో స్వల్పంగా 3 శాతం తగ్గాయి. ఈ సమయంలో టాటా టియాగో అమ్మకాలు 6,893 యూనిట్ల నుండి 6,656 యూనిట్లకు పడిపోయాయి. ఈ సమయంలో ఇది టాటా ఆల్ట్రోజ్‌ను ఓవర్‌టేక్ చేసి ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది.

Model

Apr'21

Tata Nexon 6,938
Tata Tiago 6,656
Tata Altroz 6,649
Tata Harrier 1,712
Tata Tigor 1,627
Tata Safari 1,514
Total 25,096
ఏప్రిల్ 2021లో ఏ టాటా కార్ బెస్ట్ అంటే..?

మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20, టొయోటా గ్లాంజా వంటి మోడళ్లకు పోటీగా టాటా మోటార్స్ విక్రయిస్తున్న టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు గత నెలలో 12 శాతం తగ్గాయి. అంతకు ముందు నెలతో పోల్చుకుంటే, ఏప్రిల్ 2021లో టాటా ఆల్ట్రోజ్ అమ్మకాలు 7,550 యూనిట్ల నుండి 6,649 యూనిట్లకు తగ్గాయి.

MOST READ:ఆక్సిజెన్ ట్యాంకర్లను దొంగిలిస్తున్నారు.. జిపిఎస్ ట్రాకర్‌తో అక్రమాలకు చెక్..

ఏప్రిల్ 2021లో ఏ టాటా కార్ బెస్ట్ అంటే..?

మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో టాటా మోటార్స్ అందిస్తున్న 5-సీటర్ వెర్షన్ టాటా హారియర్ అమ్మకాలు గత నెలలో 25 శాతం తగ్గి 1,712 యూనిట్లుగా నమోదయ్యాయి. మార్చి 2021లో ఇవి 2,284 యూనిట్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో టాటా టిగోర్ సెడాన్ అమ్మకాలు 2097 యూనిట్ల నుండి 1,627 యూనిట్లకు పడిపోయి 22 శాతం తగ్గుదలను నమోదు చేశాయి.

ఏప్రిల్ 2021లో ఏ టాటా కార్ బెస్ట్ అంటే..?

ఇక కంపెనీ ఇటీవలే విడుదల చేసిన తమ సరికొత్త సఫారీ ఎస్‌యూవీ విషయానికి వస్తే, గడచిన ఏప్రిల్ నెలలో కంపెనీ మొత్తం 1,514 యూనిట్లను విక్రయించింది. టాటా హారియర్ మరియు టాటా సఫారీ రెండూ కలిపి మొత్తంగా 3,226 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి.

MOST READ:గుడ్ న్యూస్.. డ్రైవర్లకు రూ. 5000 ఆర్థిక సహాయం ప్రకటించిన గవర్నమెంట్.. ఎక్కడంటే?

ఏప్రిల్ 2021లో ఏ టాటా కార్ బెస్ట్ అంటే..?

గత నెలలో టాటా మోటార్స్ గడచిన ఏప్రిల్ 2021లో మొత్తం 39,530 యూనిట్ల వాహనాలను (ప్యాసింజర్ మరియు వాణిజ్య వాహనాలు రెండు కలిపి) విక్రయించింది. అంతకు ముందు నెల (మార్చి 2021) అమ్మకాలతో పోల్చుకుంటే, ఇది 41 శాతం క్షీణతను నమోదు చేసినట్లు కంపెనీ పేర్కొంది.

ఏప్రిల్ 2021లో ఏ టాటా కార్ బెస్ట్ అంటే..?

ఈ మొత్తం అమ్మకాలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 15 శాతం తగ్గి 25,095 యూనిట్లుగా నమోదు కాగా, వాణిజ్య వాహనాల అమ్మకాలు 59 శాతం తగ్గి, 16,644 యూనిట్లుగా నమోదయ్యాయి. టాటా మోటార్స్ గడచిన మార్చి 2021లో మొత్తం 66,609 యూనిట్లను విక్రయించింది.

MOST READ:రోడ్డు నిర్మాణంలో రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న కేంద్రం

Most Read Articles

English summary
Tata Motors Model Wise Sales In April 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X