టాటా మోటార్స్ జూన్ 2021 మోడల్ వారీగా సేల్స్ రిపోర్ట్; మొదటి స్థానంలో నెక్సాన్, చివరి స్థానంలో?

భారతదేశంలో ప్రముఖ వాహన తయారీదారుగా ప్రసిద్ధి చెందిన టాటా మోటార్స్, ఇటీవల తన జూన్ 2021 అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. దీని ప్రకారం 2021 జూన్ నెలలో మంచి అమ్మకాలు జరిపినట్లు తెలుస్తోంది. 2020 జూన్ తో పోలిస్తే ఈ ఏడాది 2021 జూన్‌లో కంపెనీ అమ్మకాలు దాదాపు 111 శాతం పెరిగాయి.

టాటా మోటార్స్ జూన్ 2021 మోడల్ వారీగా సేల్స్ రిపోర్ట్; మొదటి స్థానంలో నెక్సాన్, చివరి స్థానంలో?

2021 జూన్ నెలలో కంపెనీ మొత్తం 24,111 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. అయితే 2020 జూన్ లో కంపెనీ మొత్తం 11,419 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. దీన్నిబట్టి చూస్తే కంపెనీ అమ్మకాలు ఈ నెలలో బాగా పెరిగాయి.

టాటా మోటార్స్ జూన్ 2021 మోడల్ వారీగా సేల్స్ రిపోర్ట్; మొదటి స్థానంలో నెక్సాన్, చివరి స్థానంలో?

ఇదిలా ఉండగా టాటా మోటార్స్ యొక్క నెలవారీ అమ్మకాల విషయానికి వస్తే, కంపెనీ అమ్మకాలు ఏకంగా 59 శాతం పెరిగాయి. టాటా మోటార్స్ మే 2021 లో మొత్తం 15,180 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది.

టాటా మోటార్స్ జూన్ 2021 మోడల్ వారీగా సేల్స్ రిపోర్ట్; మొదటి స్థానంలో నెక్సాన్, చివరి స్థానంలో?

టాటా మోటార్స్ యొక్క మోడల్ వారీ అమ్మకాల నివేదికను పరిశీలిస్తే, 2021 జూన్ నెలలో టాటా మోటార్స్ తన కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్‌ ను ఎక్కువ అమ్మినట్లు తెలుస్తోంది. కంపెనీ గత నెలలో 8,033 యూనిట్లను విక్రయించగా, గత ఏడాది జూన్ లో 3,040 యూనిట్లను విక్రయించింది. దీని అమ్మకాలు మునుపటికంటే పెరిగాయి.

టాటా మోటార్స్ జూన్ 2021 మోడల్ వారీగా సేల్స్ రిపోర్ట్; మొదటి స్థానంలో నెక్సాన్, చివరి స్థానంలో?

టాటా మోటార్స్ యొక్క ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ కారు అమ్మకాల పరంగా రెండవ స్థానంలో ఉంది. ఇది గత నెలలో 6,350 యూనిట్లు అమ్ముడయ్యింది. అదే విధంగా గత ఏడాది అంటే 2020 జూన్ నెలలో కంపెనీ 3,104 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఈ ఏడాది టాటా ఆల్ట్రోజ్ అమ్మకాలు 104.57% పెరిగాయి.

టాటా మోటార్స్ జూన్ 2021 మోడల్ వారీగా సేల్స్ రిపోర్ట్; మొదటి స్థానంలో నెక్సాన్, చివరి స్థానంలో?

ఇక టాటా మోటార్స్ యొక్క ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ 'టాటా టియాగో' అమ్మకాల విషయానికి వస్తే, కంపెనీ గత నెలలో 4,881 యూనిట్లను విక్రయించింది. అదే విధంగా 2020 లో 4,069 యూనిట్లను విక్రయించింది. టాటా టియాగో యొక్క ఈ ఏడాది అమ్మకాలు 19.96 శాతం పెరిగినట్లు నివేదికల ద్వారా తెలిసింది.

టాటా మోటార్స్ జూన్ 2021 మోడల్ వారీగా సేల్స్ రిపోర్ట్; మొదటి స్థానంలో నెక్సాన్, చివరి స్థానంలో?

కంపెనీ యొక్క ఫుల్ సైజ్ 5-సీట్స్ ఎస్‌యూవీ టాటా హారియర్ ఈ నెల అమ్మకాల్లో నాల్గవ స్థానంలో ఉంది. గత నెలలో కంపెనీ ఈ ఎస్‌యూవీని 2,041 యూనిట్లను విక్రయించగలిగింది. ఇదే నెలలో గత సంవత్సరం కంపెనీ 653 యూనిట్లను మాత్రమే విక్రయించింది. అంటే దీని ప్రకారం ఈ ఏడాది అమ్మకాలు 212.56 శాతం పెరిగాయి.

టాటా మోటార్స్ జూన్ 2021 మోడల్ వారీగా సేల్స్ రిపోర్ట్; మొదటి స్థానంలో నెక్సాన్, చివరి స్థానంలో?

ఇవి మాత్రమే కాకుండా, కంపెనీ కొత్త 7 సీట్స్ ఎస్‌యూవీ టాటా సఫారి విషయానికి వస్తే, గత నెలలో ఈ కారు మొత్తం 1,730 యూనిట్లను విక్రయించింది. అదే విధంగా మే 2021 అమ్మకాలతో పోలిస్తే, దాని అమ్మకాలలో 12.63 శాతం పెరుగుదల ఉంది. దీని 1,536 యూనిట్లు మే 2021 లో అమ్ముడయ్యాయి.

టాటా మోటార్స్ జూన్ 2021 మోడల్ వారీగా సేల్స్ రిపోర్ట్; మొదటి స్థానంలో నెక్సాన్, చివరి స్థానంలో?

టాటా మోటార్స్ యొక్క అమ్మకాల జాబితాలో చివరి స్థానంలో టాటా టిగోర్ చేరింది. టాటా టిగోర్ గత నెలలో మార్కెట్లో 1,076 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయింది. అదే సమయంలో గత ఏడాది జూన్ నెలలో కంపెనీ 553 యూనిట్లను మార్కెట్లో విక్రయించింది. గత అమ్మకాలకంటే ఈ జూన్ నెలలో అమ్మకాలు దాదాపు 94.58 శాతం పెరిగింది.

Most Read Articles

English summary
Tata Motors Model Wise Sales Report June 2021. Read in Telugu.
Story first published: Saturday, July 10, 2021, 14:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X