టాటా కార్లపై జనవరి స్పెషల్ ఆఫర్లు; రూ.65,000 వరకూ సేవింగ్స్

కొత్త సంవత్సరంలో దాదాపుగా అన్ని కార్ కంపెనీలు తమ ఉత్పత్తులను ధరలను పెంచుతుంటే, దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ మాత్రం తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. జనవరి 2021 టాటా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.65,000 ఆదా చేసుకోవచ్చు.

టాటా కార్లపై జనవరి స్పెషల్ ఆఫర్లు; రూ.65,000 వరకూ సేవింగ్స్

టాటా మోటార్స్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలోని 'ఫరెవర్ రేంజ్'లో ఎంపిక చేసిన మోడళ్లపై కంపెనీ న్యూ ఇయర్ ఆఫర్లను అందిస్తోంది. ఇందులో టియాగో, టిగోర్, నెక్సాన్ మరియు హారియర్ మోడళ్లు ఉన్నాయి. ఈ ఆఫర్లు జనవరి నెల మొత్తం చెల్లుబాటులో ఉంటాయి. మోడల్ వారీగా ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

టాటా కార్లపై జనవరి స్పెషల్ ఆఫర్లు; రూ.65,000 వరకూ సేవింగ్స్

టాటా టియాగో

టాటా మోటార్స్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టియాగోపై కంపెనీ ఈ జనవరి 2021 నెలలో భాగంగా గరిష్టంగా రూ.25,000 వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.15,000 కస్టమర్ స్కీమ్స్ మరియు రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు లభిస్తాయి.

MOST READ:ఒక ఛార్జ్‌తో 240 కి.మీ అందించగల సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

టాటా కార్లపై జనవరి స్పెషల్ ఆఫర్లు; రూ.65,000 వరకూ సేవింగ్స్

టాటా టిగోర్

అలాగే, టాటా మోటార్స్ విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ సెడాన్ టాటా టిగోర్‌పై కంపెనీ ఈ నెలలో గరిష్టంగా రూ.30,000 వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.15,000 విలువైన కస్టమర్ స్కీమ్స్ మరియు రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ఉన్నాయి.

టాటా కార్లపై జనవరి స్పెషల్ ఆఫర్లు; రూ.65,000 వరకూ సేవింగ్స్

టాటా నెక్సాన్

టాటా మోటార్స్ నుండి అత్యధికంగా అమ్ముడుపోతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్‌పై కేవలం ఎక్సేంజ్ బోనస్‌ను మాత్రమే అందిస్తున్నారు. జనవరి 2021 నెలలో నెక్సాన్ కొనుగోలుపై కంపెనీ రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది.

MOST READ:పాకిస్థాన్ క్రికెటర్ 'షోయబ్ మాలిక్' కార్ యాక్సిడెంట్ ; తృటిలో తప్పిన పెను ప్రమాదం

టాటా కార్లపై జనవరి స్పెషల్ ఆఫర్లు; రూ.65,000 వరకూ సేవింగ్స్

టాటా హారియర్

టాటా మోటార్స్ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ టాటా హారియర్‌పై కంపెనీ గరిష్టంగా జనవరి 2021 నెలలో రూ.65,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.25,000 కస్టమర్ స్కీమ్స్ మరియు రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిసి ఉన్నాయి.

టాటా కార్లపై జనవరి స్పెషల్ ఆఫర్లు; రూ.65,000 వరకూ సేవింగ్స్

అయితే, ఇందులో క్యాష్ డిస్కౌంట్ ఆఫర్లు ఎక్స్‌జెడ్+, ఎక్స్‌జెడ్ఏ+ మరియు మార్కెట్లో ప్రత్యేకంగా విక్రయించే క్యామో మరియు డార్క్ ఎడిషన్ మోడళ్లకు వర్తించవు. టాటా హారియర్ ఎక్స్‌జెడ్+, ఎక్స్‌జడ్ఏ+, క్యామో మరియు డార్క్ ఎడిషన్ వేరియంట్‌లపై కేవలం రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తున్నారు.

MOST READ:మీకు తెలుసా.. 2021 కవాసకి నింజా 650 బైక్, ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా..

టాటా కార్లపై జనవరి స్పెషల్ ఆఫర్లు; రూ.65,000 వరకూ సేవింగ్స్

టాటా మోటార్స్ తమ కస్టమర్ల కోసం పైన పేర్కొన్న ప్రయోజనాలు మరియు పథకాలతో పాటుగా, కంపెనీ విక్రయిస్తన్న అన్ని మోడళ్లపై కార్పొరేట్ డిస్కౌంట్లను కూడా ఆఫర్ చేస్తోంది. ఇవి కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ఇది మారుతూ ఉంటాయి. ఈ ఆఫర్లు జనవరి 1 నుండి 31, 2021 మధ్యలో కొనుగోలు చేసే టాటా వాహనాలకు మాత్రమే వర్తిస్తాయి.

టాటా కార్లపై జనవరి స్పెషల్ ఆఫర్లు; రూ.65,000 వరకూ సేవింగ్స్

కాగా, టాటా మోటార్స్ ప్రస్తుతం భారత మార్కెట్ కోసం ఓ కొత్త 7-సీటర్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ విక్రయిస్తున్న హారియర్ ఎస్‌యూవీ ప్లాట్‌ఫామ్‌పై తయారైన ఈ ఎస్‌యూవీకి ఇటీవలే సఫారీ అనే పేరును ఖరారు చేశారు. త్వరలోనే ఈ మోడల్ కోసం బుకింగ్‌లు కూడా ప్రారంభం కానున్నాయి.

MOST READ:ఈ కారు ప్రయాణికుల పాలిట రక్షణ కవచం.. ఇంతకీ ఏ కారనుకుంటున్నారు

Most Read Articles

English summary
Tata Motors New Year Offers, Discounts And Benefits On Selected Models. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X