ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్న Tata Punch; టీజర్ వీడియోలు

భారతదేశంలో ప్రముఖ వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన Tata Motors (టాటా మోటార్స్) దేశీయ మార్కెట్లో ఒక కొత్త SUV ని విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే, అయితే ఈ కొత్త మోడల్ అయిన Tata Punch (టాటా పంచ్) త్వరలో దేశీయ మార్కెట్లో విడుదలకానుంది. కంపెనీ దీనికి సంబంధించిన టీజర్ వీడియోలనుకూడా విడుదల చేసింది.

ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్న Tata Punch; టీజర్ వీడియోలు

Tata Motors తన కొత్త మైక్రో ఎస్‌యూవీకి Tata Punch అని కూడా అధికారికంగా తెలిపింది. ఇప్పుడు కంపెనీ ఈ SUV యొక్క మూడు కొత్త టీజర్‌లను మరోసారి విడుదల చేసింది. కంపెనీ ఈ మూడు టీజర్ వీడియోలను వివిధ ట్యాగ్ లైన్‌లతో పరిచయం చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త టీజర్ వీడియోల ప్రకారం Tata Punch విడుదల అతి త్వరలోనే ఉంటుందని నమ్మతున్నారు.

ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్న Tata Punch; టీజర్ వీడియోలు

కంపెనీ విడుదల చేసిన టీజర్ వీడియోలలో కొత్త Tata Punch కఠినమైన రోడ్లలో వెళ్తున్నట్లు తెలుస్తుంది. కావున ఈ Tata Punch SUV ఖచ్చితమైన ఆఫ్ రోడింగ్ కి చాలా అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు. ఈ Tata Punch దేశీయ మార్కెట్లో చిన్న SUV లకు సరైన ప్రత్యర్థిగా ఉంటుంది.

Tata Motors యొక్క Tata Punch అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలియు ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్స్ ఉంటాయి. కొత్త Tata Punch సుమారు 185 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలియు ఉంటుంది, అంటే కాకుండా ఇది 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. కావున ఇది ఆఫ్-రోడింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది.

ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్న Tata Punch; టీజర్ వీడియోలు

Tata Punch (టాటా పంచ్) అనేది ఎస్‌యువి ఫీచర్లతో కూడిన హ్యాచ్‌బ్యాక్ కారు. ఈ కారణంగానే ఇది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లకు కూడా గట్టి పోటీ ఇస్తుంది.

Tata Punch ఆల్ఫా-ఎఆర్‌సి ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది, ఈ కారు ఇంపాక్ట్ 2.0 డిజైన్ కలిగి ఉంటుంది. Tata Punch (టాటా పంచ్) అనేది కంపెనీ యొక్క మైక్రో ఎస్‌యూవీ అంతే కాకూండా, ఇది కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్, కావున ఈ కొత్త మోడల్ అనేక ఫీచర్లు మరియు పరికరాలతో రానుంది.

Tata Punch యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి, Tata Harrier మరియు Safari మోడల్స్ లాగా ఉందనిపిస్తుంది. అంటే ఈ కొత్త మోడల్ అదే స్ప్లిట్ హెడ్‌లైట్ మరియు గ్రిల్ కలిగి ఉంటుంది. ఫ్రంట్ బంపర్ మరియు బాడీ దాని కాన్సెప్ట్ మోడల్ నుండి ప్రేరణ పొందినట్లు అనిపిస్తుంది.

ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్న Tata Punch; టీజర్ వీడియోలు

Tata Punch అద్భుతమైన ఇంటీరియర్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ మినీ ఎస్‌యూవీలో Tata Nexon తరహాలో 7 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో పాటు ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేయనుంది.

అంతేకాకుండా, Tata Punch లో కంపెనీ Harman ప్రీమియం సౌండ్ సిస్టమ్‌ను కూడా అందించవచ్చు. ఇంకా ఇందులో స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటుగా అన్ని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను ఆశించవచ్చు.

ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్న Tata Punch; టీజర్ వీడియోలు

Tata Punch ఎస్‌యూవీని కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ఇందులో మొదటిది 1.2 లీటర్, 3 సిలిండర్ రివోట్రాన్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 86 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఏఎమ్‌టి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది.

ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్న Tata Punch; టీజర్ వీడియోలు

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, Tata Punch యొక్క టాప్-ఎండ్ వేరియంట్లలో, కంపెనీ తమ పాపులర్ Altroz iTurbo వేరియంట్లలో ఉపయోగిస్తున్న 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది.

ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్న Tata Punch; టీజర్ వీడియోలు

భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, Tata Punch ఈ విభాగంలో హై-రైడింగ్ హ్యాచ్‌బ్యాక్‌లు మరియు మినీ ఎస్‌యూవీలకు గట్టిపోటీగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇది ఈ సెగ్మెంట్లోని Maruti Suzuki Ignis, WagonR, Ford Freestyle మరియు Mahindra KUV100 వంటి మోడళ్లతో పాటుగా త్వరలో రాబోయే Hyundai Casper వంటి మోడళ్లతో కూడా పోటీపడే అవకాశం ఉంది. Tata Punch (టాటా పంచ్) ధర వంటి వివరాలు ఇంకా పూర్తి వెల్లడవ్వలేదు, కానీ త్వరలో దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా విడుదలవుతాయి.

More from DriveSpark

Article Published On: Monday, August 30, 2021, 14:08 [IST]
English summary
Tata motors released new teaser video for punch micro suv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+