టాటా హారియర్ కలర్ ఆప్షన్లలో మార్పులు; స్పార్కల్ కోకోవా కలర్ డిస్‌కంటిన్యూ!

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తమ పాపులర్ కార్లలో కలర్ ఆప్షన్లను సైలెంట్‌గా అప్‌డేట్ చేస్తూ వస్తోంది. కంపెనీ ఇటీవలే తమ టియాగో మరియు నెక్సాన్ మోడళ్లలో టెక్టోనిక్ బ్లూ కలర్ ఆప్షన్‌ను సైలెంట్‌గా డిస్‌కంటిన్యూ చేసిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు టాటా మోటార్స్ తమ పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ హారియర్‌లో స్పార్కల్ కోకోవా (బ్రౌన్) కలర్ ఆప్షన్‌ను డిస్‌కంటిన్యూ చేసింది.

టాటా హారియర్ కలర్ ఆప్షన్లలో మార్పులు; స్పార్కల్ కోకోవా కలర్ డిస్‌కంటిన్యూ!

టాటా హారియర్ స్పార్కల్ కోకోవా కలర్ వేరియంట్ అమ్మకాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో, కంపెనీ ఈ కలర్ ఆప్షన్‌ను తొలగించినట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ విషయాన్ని టాటా మోటార్స్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

టాటా హారియర్ కలర్ ఆప్షన్లలో మార్పులు; స్పార్కల్ కోకోవా కలర్ డిస్‌కంటిన్యూ!

హారియర్ ఎస్‌యూవీలో స్పార్కల్ కోకోవా కలర్‌ను డిస్‌కంటిన్యూ చేయడంతో ఇప్పుడు ఈ మోడల్ క్యామో గ్రీన్ (క్యామో ఎడిషన్), టెలిస్టో గ్రే, కాలిప్సో రెడ్, ఆర్కస్ వైట్ మరియు అట్లాస్ బ్లాక్ (డార్క్ ఎడిషన్) అనే ఐదు రంగులలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

టాటా హారియర్ కలర్ ఆప్షన్లలో మార్పులు; స్పార్కల్ కోకోవా కలర్ డిస్‌కంటిన్యూ!

కాలిప్సో రెడ్ మరియు ఆర్కస్ వైట్ కలర్ ఆప్షన్లు డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో కూడా లభిస్తాయి. కాకపోతే, వీటి ధర స్టాండర్డ్ పెయింట్ స్కీమ్ వేరియంట్ ధర కన్నా రూ.20,000 అధికంగా ఉంటుంది. ప్రస్తుతం తొలగించబడిన స్పార్కల కోకోవా కలర్ ఆప్షన్‌ను కంపెనీ తమ 2020 మోడల్ అప్‌డేట్స్‌లో భాగంగా హెరియర్‌కు జోడించింది.

టాటా హారియర్ కలర్ ఆప్షన్లలో మార్పులు; స్పార్కల్ కోకోవా కలర్ డిస్‌కంటిన్యూ!

మరి ఇందులో కంపెనీ కొత్తగా ఏదైనా కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెడుతుందో లేదో వేచి చూడాలి. వాస్తవానికి టాటా మోటార్స్ తమ పాత కలర్ ఆప్షన్లను నిలిపివేసిన తర్వాత, తిరిగి ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు వేరొక కొత్త కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెడుతుంది.

టాటా హారియర్ కలర్ ఆప్షన్లలో మార్పులు; స్పార్కల్ కోకోవా కలర్ డిస్‌కంటిన్యూ!

టియాగో మోడల్‌లో కూడా కంపెనీ తమ టెక్టోనిక్ బ్లూ కలర్ ఆప్షన్‌ని నిలిపివేసిన తర్వాత, ఇందులో కొత్తగా అరిజోనా బ్లూ అనే కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. టాటా సఫారీలో అందిస్తున్న రాయల్ బ్లూ కలర్‌తో పోలిస్తే, ఈ ఆరిజో బ్లూ కలర్ కాస్తంత డార్క్‌గా అనిపిస్తుంది.

టాటా హారియర్ కలర్ ఆప్షన్లలో మార్పులు; స్పార్కల్ కోకోవా కలర్ డిస్‌కంటిన్యూ!

ప్రస్తుతం టాటా మోటార్స్ విక్రయిస్తున్న హారియర్ డార్క్ ఎడిషన్ మాదిరిగానే, కంపెనీ తమ ఇతర మోడళ్లలో కూడా మరిన్ని డార్క్ ఎడిషన్‌లను విడుదల చేయాలని యోచిస్తోంది. భారత మార్కెట్లో టాటా మోటార్స్ విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్ మోడళ్లలో కంపెనీ 'డార్క్ ఎడిషన్' లను విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

టాటా హారియర్ కలర్ ఆప్షన్లలో మార్పులు; స్పార్కల్ కోకోవా కలర్ డిస్‌కంటిన్యూ!

ఈ మేరకు కంపెనీ ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఈ టీజర్‌లో కంపెనీ తమ హారియర్, నెక్సాన్ మరియు ఆల్ట్రోజ్ కార్లను డార్క్ థీమ్‌లో హైలైట్ చేసింది. త్వరలోనే కంపెనీ ఈ మోడళ్ల కోసం బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించనుంది. ఈ కొత్త డార్క్ ఎడిషన్ మోడళ్లు మరికొన్ని వారాల్లోనే అన్ని అధీకృత టాటా డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకోనున్నాయి.

టాటా హారియర్ కలర్ ఆప్షన్లలో మార్పులు; స్పార్కల్ కోకోవా కలర్ డిస్‌కంటిన్యూ!

స్టాండర్డ్ హారియర్ మోడల్‌తో పోలిస్తే టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌లో అనేక మార్పులు ఉంటాయి. ఇందులో ‘అట్లాస్ బ్లాక్' అని పిలువబడే ఆల్-బ్లాక్ పెయింట్ స్కీమ్, 17 ఇంచ్ బ్లాక్‌స్టోన్ అల్లాయ్ వీల్స్, రెండు చివర్లలో బ్లాక్-అవుట్ స్కఫ్ ప్లేట్లు, డార్క్-టోన్డ్ టెయిల్ లాంప్స్ మరియు షార్క్ ఫిన్ యాంటెన్నా మొదలైనవి ఉంటాయి.

టాటా హారియర్ కలర్ ఆప్షన్లలో మార్పులు; స్పార్కల్ కోకోవా కలర్ డిస్‌కంటిన్యూ!

టాటా హారియర్ డార్క్ ఎడిషన్ ఇంటీరియర్స్‌లో బ్లాక్-అవుట్ క్యాబిన్, కాంట్రాస్ట్ గ్రే స్టిచింగ్‌తో బెనెక్ కాలికో లెదర్ సీట్ అప్‌హోలెస్ట్రీ మరియు బ్లాక్‌స్టోన్ గ్రే డాష్‌బోర్డ్ ఉంటాయి. స్టాండర్డ్ హారియర్ వేరియంట్లలో కనిపించే అన్ని క్రోమ్ ట్రిమ్‌లు ఇందులో కొత్త గన్‌మెటల్ గ్రే క్రోమ్ ప్యాక్‌లో ఫినిష్ చేయబడి ఉంటాయి. ఇది ఆల్-బ్లాక్ ఇంటీరియర్‌లకు మరింత కాంట్రాస్టింగ్ లుక్‌ని ఇస్తుంది.

టాటా హారియర్ కలర్ ఆప్షన్లలో మార్పులు; స్పార్కల్ కోకోవా కలర్ డిస్‌కంటిన్యూ!

ఇకపోతే, ఇంజన్ పరంగా ఈ డార్క్ ఎడిషన్ హారియర్‌లో ఎలాంటి మార్పు ఉండదు. స్టాండర్డ్ మోడళ్లలో కనిపించే బిఎస్-6 2.0-లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్‌నే ఇందులోనూ ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆప్షనల్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్‌తో పాటుగా స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడా లభిస్తుంది.

Most Read Articles

English summary
Tata Motors Silently Updates Harrier Colour Options; Sparkle Cocoa Discontinued, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X