స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్

టాటా మోటార్స్ గడచిన సంవత్సరం భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కేవలం 12 నెలల వ్యవధిలోనే 50,000 మందికి పైగా కస్టమర్లకు చేరువైనట్లు ప్రకటించింది. ఈ మోడల్ మొత్తం అమ్మకాలలో 90 శాతం సాధారణ పెట్రోల్ ఇంజన్ వేరియంట్ల నుండే వచ్చినట్లు కంపెనీ తెలిపింది.

స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్

ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా మోటార్స్‌కి ఈ విభాగంలో గేమ్ ఛేంజర్ మోడల్‌గా మారింది. అంతేకాకుండా, ఇది దేశంలోనే అత్యంత సురక్షితమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో ఒకటిగా నిలిచింది. ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇటీవలే ఇందులో టర్బో పెట్రోల్ ఇంజన్ వేరియంట్ కూడా అందుబాటులోకి వచ్చింది.

స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్

జనవరి మరియు డిసెంబర్ 2020 మధ్య కాలంలో మొత్తం 47,076 టాటా ఆల్ట్రోజ్ కార్లు అమ్ముడయ్యాయి. ఇందులో 44,427 యూనిట్ల పెట్రోల్ మోడళ్లు కాగా కేవలం 2,649 యూనిట్లు మాత్రమే డీజిల్ మోడళ్లు ఉన్నాయి. అయితే, తాజాగా ప్రవేశపెట్టిన అల్ట్రోస్ ఐ-టర్బో వేరియంట్‌తో రానున్న నెలల్లో ఈ మోడల్ అమ్మకాలు మరింత పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది.

MOST READ:ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్

టాటా ఆల్ట్రోజ్ ప్రస్తుతం భారత మార్కెట్లోని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో, మారుతి సుజుకి బాలెనో, కొత్త తరం హ్యుందాయ్ ఐ20, టొయోటా గ్లాంజా వంటి మోడళ్లతో పోటీపడుతుంది. ఈ విభాగంలో టాటా అల్ట్రోజ్ మోడల్‌కి 17 శాతం మార్కెట్ వాటా ఉంది.

స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్

కంపెనీ ఇటీవలే, ఇందులో కొత్తగా పెట్రోల్, డీజిల్ మోడళ్లలో ఎక్స్‌జెడ్ + అనే కొత్త వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. ప్రస్తుతం టాటా ఆల్ట్రోజ్ మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో, మొత్తం 10 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

MOST READ:బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]

స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్

మార్కెట్లో పెట్రోల్ మోడల్ టాటా ఆల్ట్రోజ్ కారు ధరలు రూ.5.69 లక్షల నుండి ప్రారంభమై రూ.8.85 లక్షల వరకూ ఉన్నాయి. అలాగే, డీజిల్ మోడల్ ధరలు రూ.6.99 లక్షల నుండి ప్రారంభమై రూ.9.45 లక్షల వరకూ ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్

ఇక ఇటీవలే విడుదలైన టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో విషయానికి వస్తే, ఇది ఎక్స్‌టి, ఎక్స్‌జెడ్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో వీటి ధరలు రూ.7.73 లక్షల నుండి రూ.8.85 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్యలో ఉన్నాయి.

MOST READ:ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివరాలు

స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్

టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో కారులో పవర్‌ఫుల్ 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్‌ను మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్

ప్రస్తుతానికి ఈ మోడల్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యం కానుంది. అయితే, భవిష్యత్తులో ఇందులో 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కూడా పరిచయం చేయాలని కంపెనీ భావిస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

MOST READ:ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే

Most Read Articles

English summary
Tata Motors Sold Over 50,000 Altroz Cars In 12 Months, Reaches New Sales Milestone. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X