Tata Punch నవంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: వివరాలు

దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) ఈ ఏడాది అక్టోబర్‌లో భారతీయ మార్కెట్లో చాలా కాలంగా ఎదురుచూస్తున్న టాటా పంచ్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. కంపెనీ యొక్క ఈ కొత్త టాటా పంచ్ భారతీయ మార్కెట్లో అత్యంత సరసమైన మైక్రో SUV లలో ఒకటిగా నిలిచింది. టాటా పంచ్ దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కూడా మంచి డిమాండ్ పొందుతూనే ఉంది.

Tata Punch నవంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: వివరాలు

టాటా మోటార్స్ 2021 నవంబర్ లో భారతీయ మార్కెట్లో మొత్తం 6,110 యూనిట్ల టాటా పంచ్ SUV లను విక్రయించింది, ఇది నవంబర్ 2021లో నెక్సాన్ తర్వాత టాటా సిరీస్‌లో రెండవ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. టాటా పంచ్ ఈ ఏడాది అక్టోబర్‌లో 8,453 యూనిట్ల ఎస్‌యూవీలను విక్రయించింది.

Tata Punch నవంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: వివరాలు

అంతకుముందు నెల విక్రయాలతో పోలిస్తే ఇది 27.72 శాతం తగ్గుదలను నమోదు చేసింది. టాటా పంచ్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి అల్ట్రోజ్ కారు అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి. టాటా పంచ్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

Tata Punch నవంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: వివరాలు

Tata Punch మైక్రో SUV కంపెనీ కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ (ALFA) ఆర్కిటెక్చర్‌పై ఆధారపడింది. ఈ SUV పరిమాణం పరంగా కూడా అద్బుతంగా ఉంటుంది. ఈ కాంపాక్ట్ SUV పొడవు 3,827 మిమీ, 1,742 మిమీ వెడల్పు మరియు 1,615 మిమీ ఎత్తు, 2,445 మిమీ వీల్‌బేస్ మరియు 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది.

Tata Punch నవంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: వివరాలు

కొత్త Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. Tata Punch యొక్క సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.

Tata Punch నవంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: వివరాలు

Tata Punch యొక్క ఇంటీరియర్ డ్యూయల్-టోన్ థీమ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉపయోగించబడింది. ఇదే డ్యూయెల్ టోన్ కలర్ దాని డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఇది కాకుండా, దానిలో కనిపించే AC వెంట్‌లపై బ్లూ హైలైట్‌లు మరియు లోపలి డోర్ హ్యాండిల్స్‌లో వైట్ ఇన్సర్ట్‌లు ఉపయోగించబడ్డాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

Tata Punch నవంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: వివరాలు

Tata Punch 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

Tata Punch నవంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: వివరాలు

టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ మైక్రో SUV అత్యంత సురక్షితమైన వాహనం. ఇటీవల గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్‌ పొంది అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. కావున మార్కెట్లో ఈ కారుకి మరింత డిమాండ్ పెరిగింది.

Tata Punch నవంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: వివరాలు

Tata Punch లో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి. ఇటువంటి అధునాతన మరియు ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉన్న ఈ కొత్త మైక్రో SUV దేశీయ మార్కెట్లో ఈ నెలలో కూడా మరింత ఆశాజనకమైన అమ్మకాలను పొందుతుంది.

Tata Punch నవంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: వివరాలు

ప్రస్తుతం తక్కువ ధర వద్ద ఆధునిక ఫీచర్స్ కలిగి, సేఫ్టీ విషయంలో తనకు తానే సాటిగా నిలిచిన టాటా పంచ్ ఎంతోమంది కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధించింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా పంచ్ ధర రూ. 5.49 లక్షల నుంచి రూ. 9.09 లక్షల మధ్యలో ఉంది.

Tata Punch నవంబర్ 2021 సేల్స్ రిపోర్ట్: వివరాలు

Tata Punch నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్‌ వేరియంట్స్. ఈ నాలు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి. దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త Tata Punch మొత్తం 7 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఓర్క్స్ వైట్, అటామిక్ ఆరెంజ్ ,డేటోనా గ్రే, మెటోర్ బ్రాంజ్, కాలిప్సో రెడ్, ట్రాపికల్ మిస్ట్ మరియు టోర్నాడో బ్లూ కలర్స్.

More from DriveSpark

Article Published On: Monday, December 6, 2021, 14:21 [IST]
English summary
Tata motors sold over 6100 of punch micro suv in november 2021 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+