Tata Punch డెలివెరీలు మొదలయ్యాయి.. ఇక పండుగ సీజన్లో పండుగ చేసుకోండి

భారతదేశపు కార్ల తయారీ సంస్థ Tata Motors 2021 అక్టోబర్ 18 న దేశీయ మార్కెట్లో తన కొత్త మైక్రో SUV Tata Punch ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కంపెనీ విడుదల సమయంలోనే బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కంపెనీ ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం Tata Punch కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లేదా ఏదైనా కంపెనీ డీలర్‌షిప్ నుండి రూ. 21,000 అడ్వాన్స్‌తో బుక్ చేసుకోవచ్చు.

Tata Punch డెలివెరీలు మొదలయ్యాయి.. ఇక పండుగ సీజన్లో పండుగ చేసుకోండి

కంపెనీ బుకింగ్స్ ఓపెన్ చేసిన అతి తక్కువ కాలంలోనే Tata Punch మంచి బుకింగ్స్ పొందగలిగింది. అయితే ఈ పండుగ సీజన్లో ఏ మాత్రం బుక్ చేసుకున్న కస్టమర్లకు ఆలస్యం చేయకుండా కంపెనీ డెలివరీలను కూడా ప్రారంభించింది. Tata Motors యొక్క కొత్త Tata Punch ధర రూ .5.50 లక్షల నుండి రూ. 9.40 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

Tata Punch డెలివెరీలు మొదలయ్యాయి.. ఇక పండుగ సీజన్లో పండుగ చేసుకోండి

Tata Punch ఆల్ఫా ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇది నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్‌ వేరియంట్స్. ఈ నాలు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి. అంతే కాకుండా, కంపెనీ ఇటీవల Tata Punch కోసం 4 యాక్ససరీస్ ప్యాక్‌లను కూడా అందుబాటులోకి తెచ్చింది, ఇది ట్రిమ్‌లను బట్టి, వీటి ధర రూ. 30,000 నుండి రూ . 45,000 వరకు ఉంటుంది.

Tata Punch డెలివెరీలు మొదలయ్యాయి.. ఇక పండుగ సీజన్లో పండుగ చేసుకోండి

Tata Punch యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 3,840 మిమీ, 1,800 మిమీ వెడల్పు మరియు 1635 మిమీ ఎత్తు మరియు 2,450 మిమీ వీల్‌బేస్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 366 లీటర్ల బూట్ స్పేస్ కూడా అందుబాటులో ఉంటుంది.

Tata Punch డెలివెరీలు మొదలయ్యాయి.. ఇక పండుగ సీజన్లో పండుగ చేసుకోండి

దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త Tata Punch మొత్తం 7 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. కొత్త Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. Tata Punch యొక్క సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.

Tata Punch డెలివెరీలు మొదలయ్యాయి.. ఇక పండుగ సీజన్లో పండుగ చేసుకోండి

Tata Punch యొక్క ఇంటీరియర్ డ్యూయల్-టోన్ థీమ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉపయోగించబడింది. ఇదే డ్యూయెల్ టోన్ కలర్ దాని డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఇది కాకుండా, దానిలో కనిపించే AC వెంట్‌లపై బ్లూ హైలైట్‌లు మరియు లోపలి డోర్ హ్యాండిల్స్‌లో వైట్ ఇన్సర్ట్‌లు ఉపయోగించబడ్డాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

Tata Punch డెలివెరీలు మొదలయ్యాయి.. ఇక పండుగ సీజన్లో పండుగ చేసుకోండి

Tata Punch మైక్రో SUV 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి వాటితో పాటు, 27 కనెక్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇందులో ఆటోమేటిక్ ఎసి, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

Tata Punch డెలివెరీలు మొదలయ్యాయి.. ఇక పండుగ సీజన్లో పండుగ చేసుకోండి

Tata Punch అద్భుతమైన పర్ఫామెన్స్ అందింస్తుంది, దీని కోసం 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించనుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

Tata Punch డెలివెరీలు మొదలయ్యాయి.. ఇక పండుగ సీజన్లో పండుగ చేసుకోండి

Tata మోటార్స్ కొత్త Tata Punch SUV యొక్క ఆటోమేటిక్ వేరియంట్‌లో 'ట్రాక్షన్ ప్రో' మోడ్ కూడా అందించింది. ఈ ఫీచర్ వల్ల కారు బురదలో చిక్కుకున్నప్పుడు బయటపడటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త Tata పంచ్ కేవలం 6.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

Tata Punch డెలివెరీలు మొదలయ్యాయి.. ఇక పండుగ సీజన్లో పండుగ చేసుకోండి

నివేదికల ప్రకారం కొత్త Tata Punch వయోజన భద్రత విషయంలో 5 స్టార్ రేటింగ్ పొందింది. అదేవిధంగా పిల్లల భద్రత విషయంలో 4 స్టార్ రేటింగ్ కైవసం చేసుకున్నట్లు తెలిసింది.

Tata Punch డెలివెరీలు మొదలయ్యాయి.. ఇక పండుగ సీజన్లో పండుగ చేసుకోండి

Tata Punch లో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి. ఇటువంటి అధునాతన మరియు ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉన్న ఈ కొత్త మైక్రో SUV దేశీయ మార్కెట్లో మరిన్ని మంచి అమ్మకాలతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, October 22, 2021, 9:32 [IST]
English summary
Tata motors starts delivery for punch micro suv across india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+