టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన భారత అథ్లెట్లకు టాటా ఆల్ట్రోజ్ గిఫ్ట్!

సాధారణంగా ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడా వేదికలలో పతకం సాధించిన వారిని అందరూ గుర్తు పెట్టుకుంటారు. కానీ, ఆ స్థాయి వరకూ చేరుకొని, చివరి నిమిషంలో పతకం కోల్పోయిన వారిని ఎవ్వరూ గుర్తు పెట్టుకోరు. ఎంతో శ్రమ, పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పు వారు ఆ స్థానానికి చేరుకోలేరు.

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన భారత అథ్లెట్లకు టాటా ఆల్ట్రోజ్ గిఫ్ట్!

కాబట్టి, అలాంటి వారిని గుర్తుంచుకోవటం మరియు వారిని భావితరాలకు స్పూర్తిగా పరిచయం చేయటం ఎంతో అవసరం. సరిగ్గా టాటా మోటార్స్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. టోక్యో ఒలింపిక్స్ 2020 లో కాంస్య పతకాన్ని తృటిలో కోల్పోయిన భారతీయ అథ్లెట్లను ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌తో సత్కరిస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది.

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన భారత అథ్లెట్లకు టాటా ఆల్ట్రోజ్ గిఫ్ట్!

ఈ అథ్లెట్ల కోసం ప్రత్యేకమైన హై స్ట్రీట్ గోల్డ్ కలర్‌లో పెయింట్ చేయబడిన టాటా ఆల్ట్రోజ్ కారును కంపెనీ తయారు చేస్తోంది. ఈ కార్లను వారికి ఉచితంగా బహుకరించనుంది. ఈ విషయాన్ని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ ప్రెసిడెంట్ శ్రీ శైలేష్ చంద్ర ధృవీకరించారు.

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన భారత అథ్లెట్లకు టాటా ఆల్ట్రోజ్ గిఫ్ట్!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశానికి, ఈ ఒలింపిక్స్ పతకాలు మరియు పోడియం ముగింపుల కంటే చాలా ఎక్కువని, మన దేశానికి ప్రాతినిధ్యం వహించిన మన అథ్లెట్ల ప్రయత్నం మరియు స్ఫూర్తిని జరుపుకోవడం నిజంగా మన అదృష్టమని ఆయన అన్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన భారత అథ్లెట్లకు టాటా ఆల్ట్రోజ్ గిఫ్ట్!

ఇలాంటి అథ్లెట్లు అత్యధిక ఒత్తిడితో పోటీపడి, పోడియం ముగింపుకు చాలా దగ్గరగా వచ్చారని, వారు ఒక పతకాన్ని కోల్పోయి ఉండవచ్చు కానీ, తమ అంకితభావంతో లక్షలాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారని మరియు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న అథ్లెట్లకు వీరు నిజమైన స్ఫూర్తిగా నిలిచాలని శైలేష్ చంద్ర అన్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన భారత అథ్లెట్లకు టాటా ఆల్ట్రోజ్ గిఫ్ట్!

టాటా మోటార్స్ ఓ ప్రముఖ స్వదేశీ ఆటోమోటివ్ బ్రాండ్‌గా, 'డేర్ టు డ్రీమ్ అండ్ అచీవ్' అనే బ్రాండ్ స్ఫూర్తిని మేము నిజంగా అర్థం చేసుకున్నామని, ఎందుకంటే టాటా మోటార్స్‌లో తమను నడిపించే సంస్కృతి కూడా ఇదేనని, ఇందులో భాగంగానే తమ వంతు బాధ్యతగా, ఈ పాత్-బ్రేకర్స్ స్ఫూర్తిని గౌరవించడానికి ఆల్ట్రోజ్ కారును బహుమతిగా ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఆటగాళ్లకు ప్రకటించిన టాటా ఆల్ట్రోజ్ డెలివరీ త్వరలో చేయబడుతుందని కంపెనీ ప్రకటించింది.

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన భారత అథ్లెట్లకు టాటా ఆల్ట్రోజ్ గిఫ్ట్!

టాటా ఆల్ట్రోజ్ విషయానికి వస్తే, ఇది టాటా మోటార్స్ నుండి లభిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి బాలెనో, టొయోటా గ్లాంజా, హోండా జాజ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. కంపెనీ ఈ కారును తమ కొత్త 'ఇంపాక్ట్ 2.0' డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా రూపొందించింది. టాటా హారియర్ తర్వాత కొత్త డిజైన్ లాంగ్వేజ్‌పై ఆధారపడిన సంస్థ యొక్క రెండవ ఉత్పత్తి ఈ టాటా ఆల్ట్రోజ్.

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన భారత అథ్లెట్లకు టాటా ఆల్ట్రోజ్ గిఫ్ట్!

ప్రస్తుతం మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది, ఇందులో ఒకటి 1.2 లీటర్ రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 82 బిహెచ్‌పి పవర్‌ను మరియు 3300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, రెండవది 1.5 లీటర్ రివోటార్క్ డీజిల్ ఇంజన్. ఇది 4000 ఆర్‌పిఎమ్ వద్ద 90 బిహెచ్‌పి పవర్‌ను మరియు 1250-3000 ఆర్‌పిఎమ్ మధ్యలో 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన భారత అథ్లెట్లకు టాటా ఆల్ట్రోజ్ గిఫ్ట్!

నీరజ్ చోప్రాకు మహీంద్రా ఎక్స్‌యూవీ700

ఇదిలా ఉంటే, భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా ఒలింపిక్స్‌లో అథ్లెట్ విభాగంలో దేశానికి స్వర్ణ పతకం సాధించి పెట్టిన జావలిన్ త్రో ఆటగాడు 23 ఏళ్ల నీరజ్ చోప్రాకు తమ సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని కానుకగా ఇస్తామని మహీంద్రా గ్రూప్ సీఈఓ ఆనంద్ మహీంద్రా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసినదే.

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన భారత అథ్లెట్లకు టాటా ఆల్ట్రోజ్ గిఫ్ట్!

మహీంద్రా సంస్థ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని కంపెనీ రేపు (ఆగస్ట్ 14) సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించనుంది. కాగా, సోషల్ మీడియా వెల్లువెత్తిన సలహాల మేరకు, నీరజ్ చోప్రాను గౌరవించేందుకు గాను మహీంద్రా ఓ స్పెషల్ ఎడిషన్ మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ ఎస్‌యూవీ లోపలి ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులోని డాష్‌బోర్డ్‌లో డ్యూయల్ ఎల్‌సిడి స్క్రీన్ సెటప్ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ఒక టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఉపయోగించనుండగా మరొక స్క్రీన్‌ను డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఉపయోగించనున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఇందులో అధునాతన టెక్నాలజీ కలిగి ఉన్న డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ మరియు స్పీడ్ సెన్సిటివ్ సేఫ్టీ ఫీచర్‌ కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Tata motors to gift golden color altroz for indians who missed medal at tokyo olympics
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X