టాటా నెక్సాన్, ఆల్ట్రోజ్ మరియు హారియర్ మోడళ్లలో డార్క్ ఎడిషన్స్; త్వరలోనే లాంచ్!

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్, కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్ మరియు మిడ్-సైజ్ ఎస్‌యూవీ హారియర్ మోడళ్లలో కంపెనీ 'డార్క్ ఎడిషన్' లను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఈ మేరకు కంపెనీ ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

ఈ టీజర్‌లో కంపెనీ తమ హారియర్, నెక్సాన్ మరియు ఆల్ట్రోజ్ కార్లను డార్క్ థీమ్‌లో హైలైట్ చేసింది. త్వరలోనే కంపెనీ ఈ మోడళ్ల కోసం బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించనుంది. ఈ కొత్త బ్లాక్ ఎడిషన్ మోడళ్లు మరికొన్ని వారాల్లోనే అన్ని అధీకృత టాటా డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకోనున్నాయి.

కాగా, టాటా మోటార్స్ తమ హారియర్, నెక్సాన్ మరియు ఆల్ట్రోజ్ మోడళ్ల యొక్క ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్ల ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇవన్నీ ఒక్కసారి భారతదేశం అంతటా ఉన్న టాటా డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకున్న తర్వాత కంపెనీ వీటి ధరలను ప్రకటించే అవకాశం ఉంది.

డార్క్ ఎడిషన్ నెక్సాన్, ఆల్ట్రోజ్, హారియర్

టాటా మోటార్స్ కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ 'డార్క్ ఎడిషన్' హారియర్, నెక్సాన్ మరియు ఆల్ట్రోజ్ మోడళ్లలో కంపెనీ ఎలాంటి కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ చేయనుందనే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేనప్పటికీ, టాటా మోటార్ అందిస్తున్న హారియర్ యొక్క ప్రస్తుత మోడల్ లైనప్‌లో 'డార్క్ ఎడిషన్' మాదిరిగానే ఈ కొత్త వేరియంట్లు కూడా ఉంటాయని భావిస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాటా హారియర్ యొక్క 'డార్క్ ఎడిషన్'లు ఎక్స్‌జెడ్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దేశీయ విపణిలో ఈ రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ.18.35 లక్షలు మరియు రూ.19.60 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

స్టాండర్డ్ వేరయంట్లలో కనిపించే క్రోమ్ ఫినిషింగ్స్‌లను ఈ డార్క్ ఎడిషన్‌లో పియానో బ్లాక్ కలర్‌లో ఫినిషింగ్ చేయబడి ఉంటాయి. ఎక్స్టీరియర్ స్పోర్టీ బ్లాక్ కలర్ థీమ్‌ను ఇంటీరియర్ క్యాబిన్‌లో కూడా కొనసాగించనున్నారు. ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లలో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా మెకానికల్ అప్‌గ్రేడ్స్ ఉండబోవు.

ఇంజన్ పరంగా ఈ మూడు మోడళ్లు కూడా ప్రస్తుత ఇంజన్లనే కొనసాగిస్తాయి. మరియు వాటి పవర్, టార్క్ గణాంకాల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండబోవు. డార్క్ ఎడిషన్ టాటా నెక్సాన్, ఆల్ట్రోజ్ మరియు హారియర్ మోడళ్లకు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

టాటా టియాగో ఎక్స్‌టి (ఆప్షనల్) వేరియంట్ లాంచ్
ఇదిలా ఉంటే, టాటా మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. దేశీయ విపణిలో 'టాటా టియాగో ఎక్స్‌టి (ఓ)' పేరుతో విడుదలైన ఈ కొత్త వేరియంట్ ధర రూ.5.48 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది.

ఈ కొత్త టాటా టియాగో ఎక్స్‌టి (ఓ) వేరియంట్‌ను ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న టియాగో ఎక్స్‌టి వేరియంట్‌పై ఆధారపడి తయారు చేశారు. ఇది బేస్ ఎక్స్‌ఇ మరియు మిడ్ ఎక్స్‌టి వేరియంట్ మధ్యలో అందుబాటులో ఉంటుంది. టియాగో ఎక్స్‌ఇ వేరియంట్‌తో పోలిస్తే కొత్త టియాగో ఎక్స్‌టి (ఓ) వేరియంట్ ధర రూ. 47,900 ఎక్కువగా ఉంటుంది.

Most Read Articles

English summary
Tata Motors To Launch Nexon, Altroz And Harrier Dark Editions Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X