జనవరి 2022లో Tata Tiago మరియు Tata Tigor సిఎన్‌జి మోడళ్ల లాంచ్; ప్రీ-బుకింగ్స్ ఓపెన్!

భారత ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న టియాగో (Tiago) హ్యాచ్‌బ్యాక్ మరియు టిగోర్ (Tigor) కాంపాక్ట్ సెడాన్లలో సిఎన్‌జి మోడళ్లను విడుదల చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసినదే. తాజా సమాచారం ప్రకారం, ఈ రెండు సిఎన్‌జి కార్లు వచ్చే ఏడాది జనవరి మధ్య భాగం నాటికి భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఎంపిక చేసిన టాటా డీలర్లు ఈ రెండు సిఎన్‌జి కార్ల కోసం ముందస్తు బుకింగ్స్ కూడా స్వీకరిస్తున్నట్లు సమాచారం.

జనవరి 2022లో Tata Tiago మరియు Tata Tigor సిఎన్‌జి మోడళ్ల లాంచ్; ప్రీ-బుకింగ్స్ ఓపెన్!

భారతదేశంలో ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు ఇప్పుడు సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) తో నడిచే ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం, ఈ విభాగంలో మారుతి సుజుకి అత్యధిక సంఖ్యలో సిఎన్‌జి కార్లను విక్రయిస్తూ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఉంది. దేశంలో ఈ రెండు కార్ కంపెనీలు మాత్రమే సిఎన్‌జి కార్లను విక్రయిస్తున్నాయి. కాగా, ఇప్పుడు ఈ విభాగంలోకి దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ వచ్చి చేరనుంది.

జనవరి 2022లో Tata Tiago మరియు Tata Tigor సిఎన్‌జి మోడళ్ల లాంచ్; ప్రీ-బుకింగ్స్ ఓపెన్!

టాటా మోటార్స్ గత కొంతకాలంగా దేశంలో సిఎన్‌జి మోడళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికపై పనిచేస్తోంది. ఇందులో భాగంగా అభివృద్ది చేసిన టాటా టియాగో మరియు టిగోర్ యొక్క సిఎన్‌జి మోడళ్లను కంపెనీ ఇప్పటికే భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. పలు సందర్భాల్లో ఈ టెస్టింగ్ వాహనాలు భారత రోడ్లపై పరీక్షిస్తున్నట్లు గుర్తించబడ్డాయి మరియు అందుకు సంబంధించిన స్పై చిత్రాలు కూడా ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, టాటా మోటార్స్ డీలర్‌షిప్‌లు ఇప్పుడు ఈ రెండు CNG వేరియంట్‌ల కోసం అనధికారికంగా ప్రీ-బుకింగ్‌లను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.

జనవరి 2022లో Tata Tiago మరియు Tata Tigor సిఎన్‌జి మోడళ్ల లాంచ్; ప్రీ-బుకింగ్స్ ఓపెన్!

నివేదిక ప్రకారం, కొత్త టాటా టియాగో సిఎన్‌జి (Tata Tiago CNG) మరియు టాటా టిగోర్ సిఎన్‌జి (Tata Tigor CNG) వేరియంట్‌లు జనవరి 2022 మధ్యలో లేదా చివరి నాటికి విడుదల కావచ్చని తెలుస్తోంది. ఆ సమయంలోనే వాటి ధరలు మరియు ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ కొత్త సిఎన్‌జి వేరియంట్లను ఈ మోడల్ లైనప్ లోని మిడ్-రేంజ్ XT మరియు XZ వేరియంట్‌లలో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. పెట్రోల్ వేరియంట్ కంటే సిఎన్‌జి వెర్షన్ ధర రూ. 50,000 నుండి రూ. 60,000 వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది.

జనవరి 2022లో Tata Tiago మరియు Tata Tigor సిఎన్‌జి మోడళ్ల లాంచ్; ప్రీ-బుకింగ్స్ ఓపెన్!

ఈ కొత్త సిఎన్‌జి వేరియంట్లలో పవర్‌ట్రైన్ మార్పు మినహా డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. అంతేకాకుండా, ఇవి కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే లభ్యం కానున్నాయి మరియు వీటిలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉండే అవకాశమే లేదు. భారతదేశంలో బిఎస్6 కాలుష్య నిబంధనలు అమల్లోకి రాక మునుపు టియాగో మరియు టిగోర్ మోడళ్లు రెండూ కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమయ్యేవి. అయితే, కొత్త ఉద్గార నిబంధనల తర్వాత కంపెనీ వీటిలో డీజిల్ ఇంజన్లను నిలిపివేసి, కేవలం పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే విక్రయిస్తోంది.

జనవరి 2022లో Tata Tiago మరియు Tata Tigor సిఎన్‌జి మోడళ్ల లాంచ్; ప్రీ-బుకింగ్స్ ఓపెన్!

గతంలో అందించిన 1.5 లీటర్ త్రీ-సిలిండర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 70 బిహెచ్‌పి శక్తిని మరియు140 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసేది. ఈ నేపథ్యంలో, టాటా కార్లలో సిఎన్‌జి వేరియంట్లకు డీజిల్ మోడళ్లకు చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంటాయి. పవర్, టార్క్ గణాంకాలతో సంబంధం లేకుండా అధిక మైలేజీకి ప్రాధాన్యతనిచ్చే వాహనాలను ఎంచుకోవాలనుకునే కస్టమర్లకు ఈ సిఎన్‌జి వేరియంట్లు ఉత్తమ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. పెట్రోల్ ఇంజన్ వేరియంట్లతో పోల్చుకుంటే, ఇవి అధిక మైలేజీని ఆఫర్ చేస్తాయి.

జనవరి 2022లో Tata Tiago మరియు Tata Tigor సిఎన్‌జి మోడళ్ల లాంచ్; ప్రీ-బుకింగ్స్ ఓపెన్!

టియాగో మరియు టిగోర్ రెండు కార్లు కూడా బిఎస్6 వెర్షన్ 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తున్నాయి. కొత్తగా రాబోయే సిఎన్‌జి మోడళ్లు కూడా ఇదే 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించుకోనున్నాయి.పెట్రోల్ మోడళ్లలోని ఈ ఇంజన్ గరిష్టంగా 6,000 rpm వద్ద 86 బిహెచ్‌పి శక్తిని మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, సిఎన్‌జి వేరియంట్ లో ఈ పవర్ టార్క్ గణాంకాలు భారీగా తగ్గే అవకాశం ఉంది.

జనవరి 2022లో Tata Tiago మరియు Tata Tigor సిఎన్‌జి మోడళ్ల లాంచ్; ప్రీ-బుకింగ్స్ ఓపెన్!

టాటా టియాగో సిఎన్‌జి మార్కెట్లో విడుదలైన తర్వాత ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్, హ్యుందాయ్ ఐ10 మరియు హ్యుందా శాంత్రో వంటి మోడళ్లతో పోటీపడుతుంది. ఇక, టాటా టిగోర్ సిఎన్‌జి విషయానికి వస్తే, ఇది హ్యుందాయ్ ఆరా మరియు త్వరలో మార్కెట్లోకి రానున్న మారుతి సుజుకి డిజైర్‌ వంటి సిఎన్‌జి మోడళ్లతో పోటీ పడనుంది. Tiago మరియు Tigor CNG లాంచ్ తర్వాత, కంపెనీ తమ లేటెస్ట్ మోడల్ టాటా పంచ్ (Tata Punch CNG) లో కూడా ఓ సిఎన్‌జి వేరియంట్‌ను విడుదల చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Tata motors to launch tiago and tigor cng models by mid january 2022 pre bookings open details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X