మూడు రోజుల పాటు Tata Motors ప్లాంట్ బంద్.. కారణం ఏంటో తెలుసా..?

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) తమ జంషెడ్‌పూర్ ప్లాంట్‌ను మరోసారి మూడు రోజుల పాటు మూసివేయనునన్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 13, 2021 వ తేదీ నుండి డిసెంబర్ 15, 2021 వ తేదీ వరకు ఈ ప్లాంట్‌ను మూసివేయనున్నారు. ప్లాంట్ మూసివేతకు సంబంధించి కంపెనీ ఎలాంటి కారణం వెల్లడించకపోయినప్పటికీ, టాటా మోటార్స్ యొక్క భారీ వాణిజ్య వాహనాలకు డిమాండ్ తగ్గడం వల్లనే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. గత నవంబర్ 29న కూడా కంపెనీ ఈ ప్లాంట్ ను మూసివేసింది.

మూడు రోజుల పాటు Tata Motors ప్లాంట్ బంద్.. కారణం ఏంటో తెలుసా..?

ఈ విషయం గురించి టాటా మోటార్స్ యొక్క జంషెడ్‌పూర్ ప్లాంట్ చీఫ్ ఆఫీసర్ విశాల్ బాద్‌షా మాట్లాడుతూ.. ప్లాంట్‌లో వాహనాల ఉత్పత్తిని మూడు రోజుల పాటు మూసివేయబడుతుందని, ఈ సమయంలో కంపెనీ ప్లాంట్ లో అవసరమైన మెయింటినెన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. దీని కారణంగా కొంతమంది ఉద్యోగులను మాత్రమే పనికి పిలవవచ్చని ఉద్యోగులకు తెలిపారు. టాటా మోటార్స్ ఈ జంషెడ్‌పూర్ ప్లాంట్ లో భారీ వాణిజ్య వాహనాల ట్రక్కులు, ట్రైలర్లు, టిప్పర్లు వంటి వాటిని తయారు చేస్తుంది.

మూడు రోజుల పాటు Tata Motors ప్లాంట్ బంద్.. కారణం ఏంటో తెలుసా..?

యూనియన్ వర్గాల ప్రకారం, సాధారణంగా ప్రతి సంవత్సరం ఈ సమయంలో భారీ వాణిజ్య వాహనాలకు డిమాండ్ తక్కువగా ఉంటుంది, దీని కారణంగా వాటి విక్రయాలు కూడా తగ్గుముఖం పడుతాయి. ఈ డిసెంబర్ 2021 నెలలో టాటా మోటార్స్ దాదాపు 5500 యూనిట్ల భారీ వాహనాలను ఉత్పత్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. టాటా మోటార్స్‌ కు సంబంధించిన పరికరాలను తయారు చేస్తున్న దాదాపు 700 కంపెనీలు కూడా ఈ ప్లాంట్ షట్‌డౌన్ వల్ల ప్రభావితం కానున్నాయి.

మూడు రోజుల పాటు Tata Motors ప్లాంట్ బంద్.. కారణం ఏంటో తెలుసా..?

పెరిగనున్న వాణిజ్య, ప్యాసింజర్ వాహనాల ధరలు

ఇదిలా ఉంటే టాటా మోటార్స్ వచ్చే ఏడాది ప్రారంభం నుండి తమ అన్ని వాణిజ్య వాహనాల ధరలను పెంచబోతోంది. జనవరి 1, 2022 వ తేదీ నుండి వాణిజ్య వాహనాల ధరలను 2.5 శాతం పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. వాహనాల తయారీలో ఉపయోగించే స్టీల్, అల్యూమినియం మరియు ఇతర విలువైన లోహాల ధరలు పెరగడంతో వాహనాల ధరలను కూడా పెంచాలని కంపెనీ నిర్ణయించింది.

మూడు రోజుల పాటు Tata Motors ప్లాంట్ బంద్.. కారణం ఏంటో తెలుసా..?

కేవలం వాణిజ్య వాహనాల ధరలను మాత్రమే కాకుండా ప్యాసింజర్ వాహనాల ధరలను కూడా పెంచాలని కంపెనీ యోచిస్తోంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్లు జనవరి 2022 నుండి ఖరీదైనవిగా ఉండబోతున్నాయి. వాహనాల తయారీ విషయంలో ఇన్‌పుట్ కాస్ట్ నిరంతరం పెరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ ఈ భారాన్ని తగ్గించుకునేందుకే కార్ల ధరలను పెంచునుందని టాటా మోటార్స్ తెలిపింది.

మూడు రోజుల పాటు Tata Motors ప్లాంట్ బంద్.. కారణం ఏంటో తెలుసా..?

మార్కెట్లో ముడి పదార్థాల ధరలను నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి, దీని కారణంగా కార్ కంపెనీలు కూడా ధరలను పెంచాల్సి వస్తోంది. దేశంలోని చాలా వరకూ ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల ధరలను రెండు నుండి మూడు రెట్ల మేర పెంచాయి. కాగా, గత నవంబర్‌ నెలలో టాటా మోటార్స్ మొత్తం వాహనాల విక్రయాలు 58,073 యూనిట్లుగా ఉన్నాయి. వీటిలో వాణిజ్య వాహనాలు కూడా ఉన్నాయి.

మూడు రోజుల పాటు Tata Motors ప్లాంట్ బంద్.. కారణం ఏంటో తెలుసా..?

గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌లో కంపెనీ అమ్మకాలు 20 శాతానికి పైగా పెరిగాయి, అయితే అక్టోబర్ 2021లో విక్రయించిన 67,829 యూనిట్లతో పోలిస్తే మాత్రం గత నెలలో అమ్మకాలు క్షీణించాయి. టాటా మోటార్స్ గత నెలలో వాణిజ్య వాహనాల విభాగంలో నంబర్ వన్ స్థానంలో ఉండి, సెగ్మెంట్ లీడర్‌గా నిలిచింది.

మూడు రోజుల పాటు Tata Motors ప్లాంట్ బంద్.. కారణం ఏంటో తెలుసా..?

టాటా ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలకు పెరుగుతున్న డిమాండ్

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాణిజ్య వాహన విభాగంలో కూడా బాగా రాణిస్తోంది. గడచిన శుక్రవారం టాటా మోటార్స్ మొత్తం 60 ఎలక్ట్రిక్ బస్సులను అహ్మదాబాద్ జనమార్గ్ లిమిటెడ్ (AJL)కి డెలివరీ చేసింది. సబర్మతి రివర్ ఫ్రంట్ ఈవెంట్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ టాటా ఎలక్ట్రిక్ బస్సులను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

మూడు రోజుల పాటు Tata Motors ప్లాంట్ బంద్.. కారణం ఏంటో తెలుసా..?

టాటా అల్ట్రా అర్బన్ 9/9 ఏసి బస్సులు అహ్మదాబాద్ యొక్క బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (BRTS) కారిడార్‌లో తిరుగుతాయి. ఈ బస్సులకు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో కూడా కంపెనీ తమవంతు సాయం చేయనుంది. రెండేళ్ల క్రితం AJL కి 300 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసేందుకు టాటా మోటార్స్ ఒప్పందం కుదుర్చుకుంది. టాటా అల్ట్రా అర్బన్ 9/9 బస్సులు పూర్తిగా బ్యాటరీ శక్తిపై ఆధారపడి ఉంటాయి. ఈ బస్సులు గరిష్టంగా 345 బిహెచ్‌పిల శక్తిని మరియు గరిష్టంగా 3000 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయగలవు.

మూడు రోజుల పాటు Tata Motors ప్లాంట్ బంద్.. కారణం ఏంటో తెలుసా..?

Tata Altroz EV ఎలక్ట్రిక్ కార్ వస్తోంది..

టాటా మోటార్స్ అందిస్తున్న పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) లో కూడా కంపెనీ ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ వచ్చే ఐదేళ్లలో 10 కొత్త ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో విడుదల చేయాలని యోచిస్తోంది. కంపెనీ నుండి రాబోయే కొత్త మోడళ్లలో టాటా ఆల్ట్రోజ్ ఈవీ (Tata Altroz EV) కూడా ఒకటి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Tata motors to shut down jamshedpur plant for three days details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X