దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన టాటా టిగోర్ ఈవి; ఫీచర్స్ & వివరాలు

దేశీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన 'టాటా మోటార్స్' ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో కొత్త టాటా టిగోర్ ఈవి ని ఆవిష్కరించింది. ఈ కొత్త టిగోర్ ఈవి బ్రాండ్ యొక్క జిప్ట్రాన్ హై వోల్టేజ్ ఆర్కిటెక్చర్ పై ఆధారపడి ఉంటుంది. అయితే టాటా మోటార్స్ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుని భారతీయ మార్కెట్లో 2021 ఆగష్టు 31 అధికారికంగా లాంచ్ చేయనుంది.

దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన టాటా టిగోర్ ఈవి; ఫీచర్స్ & వివరాలు

భారతదేశంలో ఆవిష్కరించిన కొత్త టాటా టిగోర్ ఈవి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ కొత్త ఈవి కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో రూ. 21,000 టోకెన్ మొత్తంతో దీనిని బుక్ చేసుకోవచ్చు. ఈ కాంపాక్ట్ సెడాన్ మెరుగైన రేంజ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

కొత్త టాటా టిగోర్ ఈవి అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. దీని లోపల మరియు బయటి వైపు అనేక అనేక మార్పులు చేయబడ్డాయి. ఇది ఎక్స్‌ప్రెస్-టి మోడల్‌కు చేసిన అన్ని ఎక్స్టీరియర్ డిజైన్స్ కలిగి ఉంటుంది. ఇందులో కొత్త హెడ్‌ల్యాంప్‌లు, ట్రై-యారో డిజైన్‌తో కొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన టెయిల్‌ల్యాంప్‌లు, కలర్ యాక్సెంట్స్ మరియు కొత్త అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన టాటా టిగోర్ ఈవి; ఫీచర్స్ & వివరాలు

ఇక ఇందులోని ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో కాంట్రాస్ట్ స్టిచింగ్‌ సీట్లు, డాష్‌బోర్డ్ మరియు డోర్ ప్యానెల్‌ వంటివి అప్డేట్ చేయబడి ఉంటాయి. క్యాబిన్‌కు ఆధునిక రూపాన్ని అందించే ఎక్స్‌టీరియర్‌కి సరిపోయేలా కలర్ యాక్సెంట్స్ కూడా ఇందులో ఉంటాయి.

అంతే కాకుండా ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్, ఐఆర్ఏ కనెక్టెడ్ టెక్నాలజీ, 30+ కనెక్టెడ్ ఫీచర్లు, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్‌లు, రియర్ ఏసీ వెంట్‌లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్ మరియు 316-లీటర్ బూట్ స్పేస్ వున్నాయి.

దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన టాటా టిగోర్ ఈవి; ఫీచర్స్ & వివరాలు

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, టాటా మోటార్స్ కంపెనీ కార్లన్నీ కూడా మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటాయి. కావున ఈ కొత్త టాటా టిగోర్ ఈవి కూడా మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబిడి, స్టెబిలిటీ కంట్రోల్ ISOFIX చైల్డ్-సీట్ యాంకర్స్ మరియు సీట్-బెల్ట్ రిమైండర్ వున్నాయి.

టాటా మోటార్స్ యొక్క కొత్త టాటా టిగోర్ ఈవి ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 26 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగి, 55 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ తో జతచేయబడి ఉంటుంది. టిగోర్ ఈవి యొక్క గరిష్ట టార్క్ 170 ఎన్ఎమ్ వరకు ఉంటుంది. ఈ కారు ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 60 నిముషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. అదేవిధంగా నార్మర్ ఛార్జర్ ఉపయోగించి ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి దాదాపు 8.5 గంటల సమయం పడుతుంది. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకి దాదాపు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన టాటా టిగోర్ ఈవి; ఫీచర్స్ & వివరాలు

ఇందులోని బ్యాటరీ వారంటీ విషయానికి వస్తే, కంపెనీ IP67 రేటెడ్ బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తోంది. కంపెనీ దీనికి 8 సంవత్సరాల వ్యారంటీ మరియు 1,60,000 కిమీ బ్యాటరీ వారంటీని కూడా అందిస్తోంది. కావున ఇది వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త టాటా టిగోర్ ఈవి ఆవిష్కరణ సందర్భంగా టాటా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనరంగం బాగా అభివృద్ధి చెందుతోంది. కంపెనీ ఇప్పటికే టాటా నెక్సాన్ EV తో అత్యంత ప్రజాదరణ పొందిదన్నారు. కావున ఇప్పుడు దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త టాటా టిగోర్ ఈవి కూడా మంచి ప్రజాదరణ పొందుతుందని భావిస్తున్నాము.

దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన టాటా టిగోర్ ఈవి; ఫీచర్స్ & వివరాలు

వ్యక్తిగత విభాగంలో మా రెండవ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. కొత్త టాటా టిగోర్ ఈవి కూడా మంచి అమ్మకాలతో ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాము.

ప్రొడక్ట్ లైన్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ కులకర్ణి మాట్లాడుతూ, ఈ కొత్త టాటా టిగోర్ ఈవి మంచి పనితీరు, టెక్నాలజీ, విశ్వసనీయత, ఛార్జింగ్ మరియు కంఫర్ట్ అనే అంశాలను బలపరుస్తూ నిర్మించబడింది. కావున వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉండదు.ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కొత్త టిగోర్ ఈవి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.

దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన టాటా టిగోర్ ఈవి; ఫీచర్స్ & వివరాలు

జిప్‌ట్రాన్ టెక్నాలజీ ఎలక్ట్రిక్ సెడాన్ పనితీరును మెరుగుపరుస్తుంది మరియు ప్రీమియం అనుభూతిని మరియు ఆకర్షణను అందిస్తుంది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ అయితే కొనుగోలుదారులకు చాలా సరసమైన సమర్పణగా నిలుస్తుంది. కంపెనీ ఈ ఎలెక్ట్రిక్ కారు ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే దీని ధర దాదాపు ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 10 లక్షల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Tata motors unveiled 2021tigor electric with new colour option and ziptron technology
Story first published: Wednesday, August 18, 2021, 14:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X