టాటా ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ డార్క్ ఎడిషన్ల డెలివరీలు ప్రారంభం

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన తమ లేటెస్ట్ డార్క్ ఎడిషన్ మోడళ్లు నెక్సాన్, ఆల్ట్రోజ్, నెక్సాన్ ఈవీ మరియు హారియర్ డెలివరీలను ప్రారంభించింది. ఇప్పుడు ఇవి దేశవ్యాప్తంగా ఉన్న టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ల ద్వారా అందుబాటులో ఉన్నాయి.

టాటా ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ డార్క్ ఎడిషన్ల డెలివరీలు ప్రారంభం

స్టాండర్డ్ మోడళ్లతో పోల్చుకుంటే, ఈ డార్క్ ఎడిషన్ మోడళ్లు కాస్తంత అధిక ధరను కలిగి ఉంటాయి. అయినప్పటికీ, ఇవి ధరకు తగిన ప్రీమియం ఫీచర్లను ఆఫర్ చేస్తాయి. ఈ డార్క్ ఎడిషన్ మోడళ్లలో ఎక్స్టీరియర్‌పై ప్రత్యేకమైన బ్లాక్ కలర్ పెయింటింగ్ ఉంటుంది. లోపలి భాగం కూడా ఎక్స్టీరియర్ థీమ్‌కు మ్యాచ్ అయ్యేలా ఆల్-బ్లాక్ ఇంటీరియర్స్‌ని కలిగి ఉంటుంది.

టాటా ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ డార్క్ ఎడిషన్ల డెలివరీలు ప్రారంభం

ఈ డార్క్ ఎడిషన్ మోడళ్లలో వెలుపలి వైపు నిగనిగలాడే బ్లాక్ పెయింట్ స్కీమ్, ముందు భాగంలో పియానో బ్లాక్ ఫినిష్‌లో డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, బ్లాక్ క్రోమ్ లైనింగ్ మరియు బ్లాక్ ఎయిర్ వెంట్స్ ఉంటాయి. సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే, అల్లాయ్ వీల్స్‌ను మ్యాట్ బ్లాక్ కలర్‌లో పెయింట్‌లో చేయబడి ఉంటాయి.

టాటా ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ డార్క్ ఎడిషన్ల డెలివరీలు ప్రారంభం

అంతే కాకుండా, కారు డోర్ హ్యాండిల్స్, బి-పిల్లర్ మరియు కారు యొక్క సి-పిల్లర్లను కూడా ప్రీమియం బ్లాక్ మెటీరియల్స్‌తో ఫినిష్ చేయబడి ఉంటాయి. ఇంకా ఇందులో బ్లాక్ క్రోమ్ లైనింగ్‌తో కూడిన రియర్‌వ్యూ మిర్రర్ కూడా ఉంటుంది. వీటిలో ప్రత్యేకమైన గోల్డ్ కలర్ 'బ్లాక్ ఎడిషన్' లోగో కూడా ఉంటుంది.

టాటా ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ డార్క్ ఎడిషన్ల డెలివరీలు ప్రారంభం

ఈ స్పెషల్ ఎడిషన్ కార్లలోని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో కాస్మెటిక్ మార్పులు మినహా యాంత్రికంగా మరియు ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు లేవు. స్టాండర్డ్ మోడళ్లలో లభించే అన్ని ఫీచర్లు మరియు అవే ఇంజన్, గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇందులో కూడా ఉంటాయి.

టాటా ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ డార్క్ ఎడిషన్ల డెలివరీలు ప్రారంభం

టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ విషయానికి వస్తే, ఇది 1.2-లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ టర్బో-ఛార్జ్డ్ డీజల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 84 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ డార్క్ ఎడిషన్ల డెలివరీలు ప్రారంభం

కాగా, ఇందులోని 1.5-లీటర్ టర్బో-ఛార్జ్డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్ డార్క్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.8.71 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

టాటా ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ డార్క్ ఎడిషన్ల డెలివరీలు ప్రారంభం

ఇక, టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ విషయానికి వస్తే, ఇది కూడా 1.2-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్ మరియు 170 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగా, డీజిల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్ మరియు 260 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ డార్క్ ఎడిషన్ల డెలివరీలు ప్రారంభం

డార్క్ ఎడిషన్ టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.10.40 లక్షలు కాగా, ఇందులోని ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ ధర రూ.15.99 లక్షలుగా ఉంది. కాగా, టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌ను కంపెనీ రూ.18.04 లక్షల ప్రారంభ ధరతే విక్రయిస్తోంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

టాటా ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ డార్క్ ఎడిషన్ల డెలివరీలు ప్రారంభం

కొత్త టాటా నెక్సాన్ డార్క్ XZ +, XZA +, XZ + (O) మరియు XZA + (O) వేరియంట్లలో, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. టాటా ఆల్ట్రోజ్ డార్క్ ఎడిషన్ పెట్రోల్ (న్యాచురల్ మరియు ఐటర్బో) ఇంజన్ ఆప్షన్లతో టాప్-ఎండ్ XZ+ వేరియంట్‌లో లభిస్తుంది.

టాటా ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ డార్క్ ఎడిషన్ల డెలివరీలు ప్రారంభం

కాగా, టాటా హారియర్ డార్క్ ఎడిషన్ XT +, XZ + మరియు XZA అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ XZ + మరియు XZ + LUX అనే రెండు వేరియంట్లో అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

English summary
Tata Nexon, Altroz, Nexon EV And Harrier Dark Edition Deliveries Started, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X