అడల్ట్ సేఫ్టీలో కూడా నేనే నెం.1 అంటున్న Tata Punch.. పిల్లల భద్రతలో కూడా..

Tata Motors దేశీయ మార్కెట్లో త్వరలో విడుదల చేయనున్న మైక్రో SUV Tata Punch. ఈ SUV ని కంపెనీ ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించింది. అయితే ఇప్పుడు ఈ SUV యొక్క సేఫ్టీ రేటింగ్ విడుదలైంది. Tata Punch యొక్క సేఫ్టీ రేటింగ్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

అడల్ట్ సేఫ్టీలో కూడా నేనే నెం.1 అంటున్న Tata Punch.. పిల్లల భద్రతలో కూడా..

నివేదికల ప్రకారం కొత్త Tata Punch వయోజన భద్రత విషయంలో 5 స్టార్ రేటింగ్ పొందింది. అదేవిధంగా పిల్లల భద్రత విషయంలో 4 స్టార్ రేటింగ్ కైవసం చేసుకున్నట్లు తెలిసింది. ఈ SUV టెస్ట్ మోడల్‌లో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ బ్రేక్‌లు మరియు ఐసోఫిక్స్ యాంకర్‌లు అమర్చబడ్డాయి. కావున ఇవి మంచి భద్రతను నిర్దారిస్తాయి.

అడల్ట్ సేఫ్టీలో కూడా నేనే నెం.1 అంటున్న Tata Punch.. పిల్లల భద్రతలో కూడా..

కంపెనీ విభాగంలో 5 స్టార్ రేటింగ్ పొందిన మూడవ మోడల్ ఈ Tata Punch. ఇదివరకే కంపెనీ యొక్క ఆల్ట్రోజ్ జనవరి 2020 లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. అదేవిధంగా 2018 డిసెంబర్‌లో టాటా నెక్సాన్‌ కూడా సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ పొందింది. కావున ఇప్పుడు మరొక్క సారి కంపెనీ యొక్క మోడల్ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందింది. ఇది నిజంగా కంపెనీ యొక్క ఘనత.

అడల్ట్ సేఫ్టీలో కూడా నేనే నెం.1 అంటున్న Tata Punch.. పిల్లల భద్రతలో కూడా..

Tata Punch మైక్రో SUV వయోజన భద్రతలో 16.453 పాయింట్లు మరియు పిల్లల భద్రత కోసం 40.891 పాయింట్లను సొంతం చేసుకోగలిగింది. టాటా పంచ్ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందటం చాలా గర్వకారణం అని కంపెనీ సంతోషాన్ని వ్యక్తం చేసింది. కంపెనీ సాధించిన ఈ ఘనత వల్ల భారతదేశ ఆటోమోటివ్ పరిశ్రమలో గరిష్ట భద్రతలు కూడిన వాహనాలను అందించే సంస్థగా Tata Motors నిలిచింది.

అడల్ట్ సేఫ్టీలో కూడా నేనే నెం.1 అంటున్న Tata Punch.. పిల్లల భద్రతలో కూడా..

ఈ కొత్త మైక్రో SUV లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సైడ్ హెడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ సిస్టమ్ వంటి వాటిని స్టాండర్డ్‌గా అందించడం ద్వారా టాటా పంచ్ భద్రతను మెరుగుపరచవచ్చని గ్లోబల్ NCAP తెలిపింది. అలాగే టాటా మోటార్స్ చైల్డ్ సెక్యూరిటీ గార్డ్‌లను వెనుక వైపున ఉంచడం గొప్ప నిర్ణయమని, ఈ స్థానం పిల్లలిద్దరికీ గరిష్ట రక్షణను అందిస్తుంది. ఇవన్నీ కూడా టాటా పంచ్ 5 స్టార్ రేటింగ్ పొందటానికి దోహదపడ్డాయి.

అడల్ట్ సేఫ్టీలో కూడా నేనే నెం.1 అంటున్న Tata Punch.. పిల్లల భద్రతలో కూడా..

ఈ కొత్త SUV లో డ్రైవర్ మరియు ప్రయాణీకుల తల మరియు మెడకు మంచి రక్షణ లభించింది. అదే సమయంలో, ఇద్దరి ఛాతీకి కూడా మంచి రక్షణ లభించింది, డ్రైవర్ మోకాలికి మరియు ప్రయాణీకుడికి కూడా రక్షణ లభించింది. ఈ కారులో డ్రైవర్ మరియు ప్రయాణీకుల కోసం సీట్ బెల్ట్ రిమైండర్ ప్రామాణికంగా ఇవ్వబడింది.

అడల్ట్ సేఫ్టీలో కూడా నేనే నెం.1 అంటున్న Tata Punch.. పిల్లల భద్రతలో కూడా..

ఈ కారు UN95 సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ కూడా పాస్ చేసింది. దీనితో పాటు ఇది ABS ని ప్రామాణికంగా పొందుతుంది. ఈ సందర్భంగా గ్లోబల్ ఎన్‌సిఎపి కార్యదర్శి మాట్లాడుతూ టాటా మెరుగైన సేఫ్టీ కార్ల తయారీకి అనువైన సంస్థ అన్నారు. ఈ కొత్త మైక్రో SUV 5 స్టార్ రేటింగ్ పొందటానికి కావలసిన అన్ని సదుపాయాలను కలిగి ఉంది అన్నారు.

అడల్ట్ సేఫ్టీలో కూడా నేనే నెం.1 అంటున్న Tata Punch.. పిల్లల భద్రతలో కూడా..

Tata Punch లోని చైల్డ్ సీట్లు 3 సంవత్సరాలు లేదా 1.5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు, ఫ్రంట్ ఫేసింగ్ సీట్లు ఇన్‌స్టాల్ చేయబడ్డాయి, దీనికి ISOFIX కనెక్టర్‌లు వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కారు పిల్లల భద్రతకు అనుకూలంగా ఉంటుంది, కావున ఇది 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌లను పొందింది.

అడల్ట్ సేఫ్టీలో కూడా నేనే నెం.1 అంటున్న Tata Punch.. పిల్లల భద్రతలో కూడా..

Tata Punch 2021 అక్టోబర్ 18 న అధికారికంగా భారత మార్కెట్లో అరంగేట్రం చేయనుంది. Tata Motors ఇప్పటికే తన Tata Punch మైక్రో SUV కోసం బుకింగ్స్ స్వీకరిస్తోంది. ఈ SUV కొనువులు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ లేదా ఏదైనా అధికారిక డీలర్‌షిప్ నుండి ముందస్తుగా రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ SUV ఇప్పుడు టెస్ట్ డ్రైవింగ్ కి కూడా అందుబాటులో ఉంది. టెస్ట్ డ్రైవ్ చేయాలనుకునే కస్టమర్లు సమీపంలోని డీలర్‌షిప్ సందర్శించి టెస్ట్ డ్రైవింగ్ కోసం బుక్ చేసుకోవచ్చు.

Tata Punch ఆల్ఫా ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇది నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్‌ వేరియంట్స్. ఈ నాలు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి.

అడల్ట్ సేఫ్టీలో కూడా నేనే నెం.1 అంటున్న Tata Punch.. పిల్లల భద్రతలో కూడా..

Tata Punch అద్భుతమైన పర్ఫామెన్స్ అందింస్తుంది, దీని కోసం 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించనుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 14, 2021, 16:55 [IST]
English summary
Tata punch achieves 5 star safety rating details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+