CNG అవతార్‌లో రానున్న Tata Punch: వివరాలు

టాటా మోటార్స్ (Tata Motors) దేశీయ మార్కెట్లో ఇటీవల విడుదల చేసిన కొత్త టాటా పంచ్ (Tata Punch) SUV కి విపరీతమైన స్పందన వస్తోంది. మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. అయితే ప్రస్తుతం ఇంధన ధరల కారణంగా ఈ మైక్రో SUV ని CNG అవతార్‌లో తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల దీని CNG మాడల్ కూడా టెస్టింగ్ సమయంలో కనిపించింది.

CNG అవతార్‌లో రానున్న Tata Punch: వివరాలు

రానున్న 2022 వ సంవత్సరంలో టాటా మోటార్స్ తమ Tigor మరియు Tiago వంటి వాటిని కూడా CNG వెర్షన్ లో తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కావున ఈ రెండు మోడల్స్ కూడా త్వరలో CNG వెర్షన్ లో తీసుకురాబడతాయి. అయితే ఇందులో భాగంగానే టాటా పంచ్ కూడా CNG వెర్షన్ లో అడుగుపెట్టనుంది.

CNG అవతార్‌లో రానున్న Tata Punch: వివరాలు

టాటా పంచ్ ఇప్పటివరకు కూడా మంచి అమ్మకాలను పొందుతోంది. ఈ వెర్షన్ విడుదలైన తరువాత దీని పరిధి దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. కావున ఎక్కువ మంది కొనుగోలుదారులు ఈ మైక్రో SUV ని మరింత ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

CNG అవతార్‌లో రానున్న Tata Punch: వివరాలు

ప్రస్తుతం Tata Punch ఆల్ఫా ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇది నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్‌ వేరియంట్స్. ఈ నాలు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి.

CNG అవతార్‌లో రానున్న Tata Punch: వివరాలు

కొత్త Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. Tata Punch యొక్క సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.

CNG అవతార్‌లో రానున్న Tata Punch: వివరాలు

Tata Punch యొక్క ఇంటీరియర్ డ్యూయల్-టోన్ థీమ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉపయోగించబడింది. ఇదే డ్యూయెల్ టోన్ కలర్ దాని డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఇది కాకుండా, దానిలో కనిపించే AC వెంట్‌లపై బ్లూ హైలైట్‌లు మరియు లోపలి డోర్ హ్యాండిల్స్‌లో వైట్ ఇన్సర్ట్‌లు ఉపయోగించబడ్డాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

CNG అవతార్‌లో రానున్న Tata Punch: వివరాలు

Tata Punch మైక్రో SUV 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి వాటితో పాటు, 27 కనెక్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇందులో ఆటోమేటిక్ ఎసి, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

CNG అవతార్‌లో రానున్న Tata Punch: వివరాలు

Tata Punch అద్భుతమైన పర్ఫామెన్స్ అందింస్తుంది, దీని కోసం 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించనుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

CNG అవతార్‌లో రానున్న Tata Punch: వివరాలు

టాటా టియాగో మరియు టిగోర్ సిఎన్‌జిని ఈ ఏడాది చివర్లో తీసుకురావచ్చని కూడా ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాలం ఇది ఆలస్యం అయ్యింది. అయితే ఈ కొత్త వెర్షన్‌లను కంపెనీ 2022 జనవరి నెల చివరిలో తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. చాలా డీలర్‌షిప్‌లు అధికారిక బుకింగ్‌లను కూడా ప్రారంభించాయి. అయితే ధర ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ CNG వెర్షన్ దాని పెట్రోల్ వేరియంట్ కంటే కూడా దాదాపు రూ.60,000 వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

CNG అవతార్‌లో రానున్న Tata Punch: వివరాలు

ప్రస్తుతం మైక్రో SUV సిఎస్‌డి క్యాంటీన్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది, ఈ కారు అక్టోబర్‌ నెలలో ప్రారంభించబడింది. కావున ఇప్పుడు సైన్యంలో దేశ రక్షణలో సేవలందించే వ్యక్తుల కోసం సరసమైన ధరకు అందుబాటులోకి వచ్చింది. సిఎస్‌డి క్యాంటీన్ కింద, టాటా పంచ్ ప్రారంభ ధర రూ. 4,86,631కి అందుబాటులో ఉంది. కానీ దీని ధర సాధారణ వినియోగదారులకు రూ.5.49 లక్షల ధరకు అందుబాటులో ఉంచారు.

CNG అవతార్‌లో రానున్న Tata Punch: వివరాలు

నివేదికల ప్రకారం కొత్త Tata Punch వయోజన భద్రత విషయంలో 5 స్టార్ రేటింగ్ పొందింది. అదేవిధంగా పిల్లల భద్రత విషయంలో 4 స్టార్ రేటింగ్ కైవసం చేసుకున్నట్లు తెలిసింది.

Tata Punch లో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి. ఇటువంటి అధునాతన మరియు ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉన్న ఈ కొత్త మైక్రో SUV దేశీయ మార్కెట్లో ఈ నెలలో కూడా మరింత ఆశాజనకమైన అమ్మకాలను పొందుతుంది.

Most Read Articles

English summary
Tata punch cng version could launch soon details
Story first published: Sunday, December 26, 2021, 8:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X