మొదటి నెలలోనే Tata Punch అమ్మకాల పరుగులు.. ఈ నెల అమ్మకాలకు ఇక బ్రేకుల్లేవ్

దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవల కాలంలో తన లేటెస్ట్ మైక్రో SUV అయిన టాటా పంచ్ (Tata Punch) ను భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల్ చేసింది. ఈ SUV మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కూడా మంచి ఆదరణ పొందగలుగుతోంది. ఇదే సమయంలో కంపెనీ తన మొదటి నెల యొక్క Tata Punch అమ్మకాల నివేదికను విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మొదటి నెలలోనే Tata Punch అమ్మకాల పరుగులు.. ఈ నెల అమ్మకాలకు ఇక బ్రేకుల్లేవ్

Tata Punch మొదటి నెలలోనే అమ్మకాల్లో ఒక సంచలనం సృష్టించింది. ఈ మైక్రో SUV మొదటి నెలలో మొత్తం 8,453 యూనిట్లను విక్రయించినట్లు నివేదికల ద్వారా తెలుస్తుంది. ఈ కారణంగా కంపెనీ యొక్క అమ్మకాలలో టాటా పంచ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ కొత్త SUV మొదటి నెలలోనే టాటా టియాగో, టాటా ఆల్ట్రోజ్‌ వంటి వాటిని అధిగమించి ముందుకు చేరింది.

మొదటి నెలలోనే Tata Punch అమ్మకాల పరుగులు.. ఈ నెల అమ్మకాలకు ఇక బ్రేకుల్లేవ్

ఈ కారణంగా కంపెనీ యొక్క Tata Punch దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో ఇప్పుడు పదో స్థానంలో నిలిచింది, ఈ కారు మొదటి నెలలోనే ఈ ఘనతను సాధించడం నిజంగా చాలా ఆశ్చర్యం. ఇది కంపెనీ పొందిన అరుదైన ఘనత అనే చెప్పాలి.

మొదటి నెలలోనే Tata Punch అమ్మకాల పరుగులు.. ఈ నెల అమ్మకాలకు ఇక బ్రేకుల్లేవ్

ఈ కొత్త టాటా పంచ్ అమ్మకాలు అద్భుతంగా సాగడం వల్ల, టాటా మోటార్స్ యొక్క అమ్మకాలు గత నెలలో 33,926 యూనిట్లకు చేరింది. మొత్తం అమ్మకాల పరంగా కంపెనీ మూడవ స్థానంలో నిలిచింది. దీంతో అక్టోబర్‌లో కంపెనీ విక్రయాలు 44% పెరగ్గా, మార్కెట్ వాటా 13.7%కి పెరిగింది.

టాటా మోటార్స్ తన కొత్త మైక్రో SUV ని అక్టోబర్ 18 న విడుదల చేసింది. విడుదలైన కేవలం 12 రోజులలోనే ఇంత గొప్ప స్థాయిలో అమ్మాకాలను జరపడం నిజంగా చాలా గొప్ప విషయం. కంపెనీ ఈ SUV ని పండుగ సీజన్లో విడుదల చేయడం వల్ల అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని ఆశించింది. కావున అనుకున్న విధంగానే కంపెనీ మంచి అమ్మకాలతో ముందుకు సాగింది.

మొదటి నెలలోనే Tata Punch అమ్మకాల పరుగులు.. ఈ నెల అమ్మకాలకు ఇక బ్రేకుల్లేవ్

టాటా పంచ్ ఇప్పటికి ఎన్ని బుకింగ్స్ పొందగలిగింది అనే విషయం కంపెనీ ఖచ్చితంగా వెల్లడించలేదు. అయితే మొదటి దశలో బుక్ చేసుకున్న వారికీ డెలివరీ చేయడానికి స్టాక్ ఉన్నట్లు తెలిపింది. కావున త్వరలో మెగా డెలివరీలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

మొదటి నెలలోనే Tata Punch అమ్మకాల పరుగులు.. ఈ నెల అమ్మకాలకు ఇక బ్రేకుల్లేవ్

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా పంచ్ ధర రూ. 5.49 లక్షల నుంచి రూ. 9.09 లక్షల మధ్యలో ఉంది. కంపెనీ ఈ మైక్రో SUV ని ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో తీసుకువచ్చింది. అంతే కాకుండా ఈ SUV ధర కూడా తక్కువగా ఉన్న కారణంగా ఎక్కువమంది కొనుగోలుదారులు ఈ SUV ని కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున రానున్న రోజుల్లో కూడా ఇది ఎక్కువ సంఖ్యలో విక్రయాలను జరిపే అవకాశం ఉంటుంది.

మొదటి నెలలోనే Tata Punch అమ్మకాల పరుగులు.. ఈ నెల అమ్మకాలకు ఇక బ్రేకుల్లేవ్

Tata Punch ఆల్ఫా ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇది నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్‌ వేరియంట్స్. ఈ నాలు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి.

మొదటి నెలలోనే Tata Punch అమ్మకాల పరుగులు.. ఈ నెల అమ్మకాలకు ఇక బ్రేకుల్లేవ్

కొత్త Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. Tata Punch యొక్క సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.

మొదటి నెలలోనే Tata Punch అమ్మకాల పరుగులు.. ఈ నెల అమ్మకాలకు ఇక బ్రేకుల్లేవ్

Tata Punch యొక్క ఇంటీరియర్ డ్యూయల్-టోన్ థీమ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉపయోగించబడింది. ఇదే డ్యూయెల్ టోన్ కలర్ దాని డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఇది కాకుండా, దానిలో కనిపించే AC వెంట్‌లపై బ్లూ హైలైట్‌లు మరియు లోపలి డోర్ హ్యాండిల్స్‌లో వైట్ ఇన్సర్ట్‌లు ఉపయోగించబడ్డాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

మొదటి నెలలోనే Tata Punch అమ్మకాల పరుగులు.. ఈ నెల అమ్మకాలకు ఇక బ్రేకుల్లేవ్

Tata Punch మైక్రో SUV 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి వాటితో పాటు, 27 కనెక్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇందులో ఆటోమేటిక్ ఎసి, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

మొదటి నెలలోనే Tata Punch అమ్మకాల పరుగులు.. ఈ నెల అమ్మకాలకు ఇక బ్రేకుల్లేవ్

Tata Punch అద్భుతమైన పర్ఫామెన్స్ అందింస్తుంది, దీని కోసం 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించనుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

మొదటి నెలలోనే Tata Punch అమ్మకాల పరుగులు.. ఈ నెల అమ్మకాలకు ఇక బ్రేకుల్లేవ్

Tata మోటార్స్ కొత్త Tata Punch SUV యొక్క ఆటోమేటిక్ వేరియంట్‌లో 'ట్రాక్షన్ ప్రో' మోడ్ కూడా అందించింది. ఈ ఫీచర్ వల్ల కారు బురదలో చిక్కుకున్నప్పుడు బయటపడటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త Tata పంచ్ కేవలం 6.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

మొదటి నెలలోనే Tata Punch అమ్మకాల పరుగులు.. ఈ నెల అమ్మకాలకు ఇక బ్రేకుల్లేవ్

నివేదికల ప్రకారం కొత్త Tata Punch వయోజన భద్రత విషయంలో 5 స్టార్ రేటింగ్ పొందింది. అదేవిధంగా పిల్లల భద్రత విషయంలో 4 స్టార్ రేటింగ్ కైవసం చేసుకున్నట్లు తెలిసింది.

Tata Punch లో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి. ఇటువంటి అధునాతన మరియు ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉన్న ఈ కొత్త మైక్రో SUV దేశీయ మార్కెట్లో ఈ నెలలో కూడా మరింత ఆశాజనకమైన అమ్మకాలను పొందుతుంది.

Most Read Articles

English summary
Tata punch first month sales 8453 units beats tiago nexon details
Story first published: Wednesday, November 3, 2021, 12:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X