Tata Punch ఎంత ఇస్తుంది..? మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ మైలేజ్ డీటేల్స్

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors), గత కొంత కాలంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రియులను ఊరిస్తూ వచ్చిన 'టాటా పంచ్' (Tata Punch) ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో టాటా పంచ్ ఒకేఒక పెట్రోల్ ఇంజన్ తో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో విడుదల చేయబడింది.

Tata Punch ఎంత ఇస్తుంది..? మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ మైలేజ్ డీటేల్స్

మార్కెట్లో టాటా పంచ్ ధరలు రూ. 5.49 లక్షల నుండి రూ. 8.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. కాగా, ఇప్పుడు ఈ ఈ చిన్న ఎస్‌యూవీ యొక్క అధికారిక సర్టిఫైడ్ మైలేజ్ గణాంకాలు వెల్లడయ్యాయి. టాటా పంచ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభిస్తుంది. వీటి ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ గణాంకాలు ఇలా ఉన్నాయి:

  • మ్యాన్యువల్ - 18.97 kmpl
  • ఆటోమేటిక్ - 18.82 kmpl
  • Tata Punch ఎంత ఇస్తుంది..? మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ మైలేజ్ డీటేల్స్

    ఇది సర్టిఫైడ్ మైలేజ్ మాత్రమే, రియల్ వరల్డ్ లో ఈ మైలేజ్ గణాంకాలు మారే (ఇంత కన్నా తక్కువగా ఉండే) అవకాశం ఉంది. వాస్తవానికి, టాటా పంచ్ దాని విభాగంలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన ఎస్‌యూవీలలో ఒకటి కాదు. ఇందుకు ప్రధాన కారణం టాటా పంచ్ లో ఉపయోగించిన పంచీ ఇంజన్.

    Tata Punch ఎంత ఇస్తుంది..? మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ మైలేజ్ డీటేల్స్

    ఈ చిన్న ఎస్‌యూవీలో కంపెనీ పవర్‌ఫుల్ 1.2 లీటర్, త్రీ సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించింది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ ను మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం టాటా మోటార్స్ ఇదే ఇంజన్ ను టియాగో మరియు ఆల్ట్రోజ్ వంటి మోడళ్లలో ఉపయోగిస్తోంది.

    Tata Punch ఎంత ఇస్తుంది..? మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ మైలేజ్ డీటేల్స్

    అంటే, టాటా పంచ్ పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ, పెర్ఫార్మెన్స్ విషయంలో పెద్ద టాటా కార్లకు ఏమాత్రం తీసిపోదన్నమాట. భారత మార్కెట్లో టాటా పంచ్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిష్డ్ మరియు క్రియేటివ్‌ అనే వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో ప్యూర్ వేరియంట్ కాకుండా మిగిలిన మూడు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.

    Tata Punch ఎంత ఇస్తుంది..? మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ మైలేజ్ డీటేల్స్

    టాటా పంచ్ కోసం దేశవ్యాప్తంగా బుకింగ్‌లు కూడా ప్రారంభంమయ్యాయి. ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి కానీ లేదా ఏదైనా అధికారిక టాటా డీలర్‌షిప్ నుండి రూ. 21,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ఈ బుజ్జి కారుని బుక్ చేసుకోవచ్చు. టాటా పంచ్ మొత్తం ఏడు రంగులలో లభిస్తుంది. వీటిలో టోర్నెడో బ్లూ, కాలిప్సో రెడ్, మెటోర్ బ్రాంజ్, అటామిక్ ఆరెంజ్, ట్రాపికల్ మిస్ట్, డేటోనా గ్రే మరియు ఓర్కస్ వైట్ కలర్లు ఉన్నాయి.

    Tata Punch ఎంత ఇస్తుంది..? మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ మైలేజ్ డీటేల్స్

    కాంపిటీషన్ విషయానికి వస్తే, టాటా పంచ్ భారత మార్కెట్లో రెనో కైగర్, నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ వెన్యూ మరియు కియా సొనెట్ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడళ్లతో పోటీపడుతుంది. ఈ చిన్న ఎస్‌యూవీలు అందించే మైలేజ్ వివరాలను గమనిస్తే, నిస్సాన్ మాగ్నైట్ యొక్క న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ వేరియంట్ 18.75 kmpl మైలేజీని మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ యొక్క మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ వేరియంట్‌లు వరుసగా 20 kmpl మరియు 17.7 kmpl మైలేజీని అందిస్తాయి.

    Tata Punch ఎంత ఇస్తుంది..? మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ మైలేజ్ డీటేల్స్

    అలాగే, కియా సోనెట్ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ 19.0 కెఎమ్‌పిఎల్ మరియు టర్బో పెట్రోల్ ఐఎంటికి 18.2 kmpl మైలేజీని ఇస్తుంది. మరోవైపు, హ్యుందాయ్ వెన్యూ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్‌ వేరియంట్లు వరుసగా 18.27 kmpl మరియు 18.15 kmpl మైలేజీని ఇస్తాయి. చివరిగా రెనో కైగర్ 20.5 kmpl మైలేజీని అందిస్తుంది.

    Tata Punch ఎంత ఇస్తుంది..? మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ మైలేజ్ డీటేల్స్

    కాబట్టి, మైలేజ్ పరంగా చూసుకుంటే, ఈ విభాగంలోని ఇతర మోడళ్ల కన్నా టాటా పంచ్ కాస్తం వెనుకబడి ఉందనే చెప్పాలి. టాటా పంచ్ విషయంలో మైలేజ్ కంటే ఎక్కుగా ఇతర అంశాలు కస్టమర్లు ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ఇందులో ప్రధానంగా దాని స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు మరియు అన్నింటి కన్నా ఎక్కువగా దాని 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ మొదలైనవి ఉన్నాయి.

    Tata Punch ఎంత ఇస్తుంది..? మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ మైలేజ్ డీటేల్స్

    ఈ చిన్న ఎస్‌యూవీలో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, IRA కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 27 కనెక్టెడ్ ఫీచర్లు ఇందులో ఇవ్వబడ్డాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రెండు ఎయిర్‌బ్యాగులు, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ పంక్చర్ రిపేర్ కిట్ మొదలైనవి ఉన్నాయి.

    Tata Punch ఎంత ఇస్తుంది..? మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ మైలేజ్ డీటేల్స్

    టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీని కంపెనీ కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ (ALFA) ఆర్కిటెక్చర్‌ను ఆధారంగా చేసుకొని నిర్మించారు. పరిమాణం పరంగా కూడా ఈ చిన్న ఎస్‌యూవీ అద్బుతంగా ఉంటుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ పొడవు 3,827 మిమీ, 1,742 మిమీ వెడల్పు మరియు ఎత్తు 1,615 మిమీగా ఉంటుంది. దీని వీల్‌బేస్ 2,445 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 187 మిమీ గా ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ 370 మిమీ వాటర్ వేడింగ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Tata punch manual and automatic mileage figures revealed details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X