Tata Punch కలర్ ఆప్సన్స్ వెల్లడించిన Tata Motors; వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్ధమవుతున్న కార్ల జాబితాలో Tata Motors యొక్క Tata Punch కూడా ఒకటి. Tata Motors ఇప్పటికే Tata Punch కి సంబంధించిన చాలా సమాచారాన్ని అందించింది. అయితే ఈ నేపథ్యంలో భాగంగానే ఇప్పుడు కొత్త Tata Punch యొక్క కలర్ ఆప్సన్స్ కూడా వెల్లడించింది.

Tata Punch కలర్ ఆప్సన్స్ వెల్లడించిన Tata Motors; వివరాలు

Tata Motors ఇప్పటికే ఈ Tata Punch ని చాలా సార్లు టెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన సమాచారం మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాము. ప్రస్తుతం కంపెనీ దీనికి సంబంధించి వెల్లడించిన కలర్ ఆప్సన్స్ విషయానికి వస్తే, ఇందులో మూడు కలర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కంపెనీ ఈ Tata Punch ను మోనో టోన్ మరోయు డ్యూయెల్ టోన్ బాడీ కలర్ ఆప్సన్స్ లో అందించే అవకాశం ఉంది.

Tata Punch కలర్ ఆప్సన్స్ వెల్లడించిన Tata Motors; వివరాలు

ఇప్పటికి వెలువడిన చిత్రాల ప్రకారం, Tata Punch బ్లూ కలర్, ఆరంజ్ కలర్ మరియు బ్రౌన్ కలర్స్ లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. ఈ కలర్స్ మాత్రమే కాకూండా కంపెనీ దీనిని గ్రే కలర్ మరియు వైట్ కలర్ ఆప్సన్స్ లో కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది. కానీ దీనికి సంబందించిన అధికారిక సమాచారం ఇంకా వెల్లడికాలేదు.

Tata Punch కలర్ ఆప్సన్స్ వెల్లడించిన Tata Motors; వివరాలు

Tata Punch ఎస్‌యూవీని కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ఇందులో మొదటిది 1.2 లీటర్, 3 సిలిండర్ రివోట్రాన్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 86 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఏఎమ్‌టి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది.

Tata Punch కలర్ ఆప్సన్స్ వెల్లడించిన Tata Motors; వివరాలు

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, Tata Punch యొక్క టాప్-ఎండ్ వేరియంట్లలో, కంపెనీ తమ పాపులర్ Altroz iTurbo వేరియంట్లలో ఉపయోగిస్తున్న 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది.

Tata Punch కలర్ ఆప్సన్స్ వెల్లడించిన Tata Motors; వివరాలు

Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో సిగ్నేచర్ గ్రిల్, మధ్యలో బ్రాండ్ యొక్క లోగో ఉంచబడింది. ఇది ఎల్ఈడీ డిఆర్ఎల్ తో వేరుచేయబడి ఉంటుంది. హెడ్‌లైట్ రెండు వైపులా ఉంచబడింది మరియు ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. నంబర్ ప్లేట్ మరియు స్కిడ్ ప్లేట్ దాని క్రింద ఉంచబడ్డాయి. ఇవన్నీ కూడా Tata Punch ని మరింత ఆకర్షనీయంగా చేస్తాయి.

Tata Punch కలర్ ఆప్సన్స్ వెల్లడించిన Tata Motors; వివరాలు

ఇందులో ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ చూడవచ్చు, రూఫ్ తెల్లగా ఉంచబడింది మరియు రూఫ్ రైల్ బ్లాక్ కలర్‌లో ఉంచబడింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మొత్తం మీద Tata Punch డిజైన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Tata Punch కలర్ ఆప్సన్స్ వెల్లడించిన Tata Motors; వివరాలు

Tata Punch యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది డ్యూయల్ టోన్ థీమ్‌లో ఉంచబడింది, ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఉపయోగించబడ్డాయి. ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్ కలయిక దాని డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటివి కూడా ఉన్నాయి. అంతే కాకుండా AC వెంట్‌లపై బ్లూ హైలైట్‌లు మరియు లోపలి డోర్ హ్యాండిల్స్‌లో వైట్ ఇన్సర్ట్‌లు ఉపయోగించబడ్డాయి.

Tata Punch కలర్ ఆప్సన్స్ వెల్లడించిన Tata Motors; వివరాలు

Tata Punch ఆల్ఫా-ఎఆర్‌సి ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది, ఈ కారు ఇంపాక్ట్ 2.0 డిజైన్ కలిగి ఉంటుంది. Tata Punch (టాటా పంచ్) అనేది కంపెనీ యొక్క మైక్రో ఎస్‌యూవీ అంతే కాకూండా, ఇది కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్, కావున ఈ కొత్త మోడల్ అనేక ఫీచర్లు మరియు పరికరాలతో రానుంది.

Tata Punch కలర్ ఆప్సన్స్ వెల్లడించిన Tata Motors; వివరాలు

Tata Punch మల్టీ-ఫంక్షన్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌ను పొందుతుంది మరియు ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్ దాని కుడి వైపున ఉంచబడింది. ఇందులో ఏబీఎస్ విత్ ఈబిడి, స్పీడ్ అలర్ట్, రెండు ఎయిర్ బ్యాగ్స్ వంటి మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు, త్వరలో వెల్లడవుతుంది.

Tata Punch కలర్ ఆప్సన్స్ వెల్లడించిన Tata Motors; వివరాలు

Tata Punch త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల కానుంది, ఇటీవల దీనికి సంబంధించిన అనధికార బుకింగ్స్ కూడా ప్రారంభించబడ్డాయి. Tata Punch ఈ విభాగంలో Maruti Suzuki Ignis, WagonR, Ford Freestyle మరియు Mahindra KUV100 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Source: Ajesh Kilikar/Facebook

More from DriveSpark

Article Published On: Wednesday, September 22, 2021, 17:33 [IST]
English summary
Tata punch micro suv colors option revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+