పరిమాణంలో Tata Punch అదుర్స్ కదా.. ఇక్కడ చూడండి

భారతదేశపు ప్రముఖ వాహన తయారీ సంస్థ Tata Motors (టాటా మోటార్స్) దేశీయ మార్కెట్లో కొత్త Tata Punch మైక్రో SUV ని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న ఈ కొత్త SUV గురించి చాలా సమాచారం కంపెనీ వెల్లడించింది. అంతే కాకుండా దీనికి సంబందించిన టీజర్ వీడియోలు కూడా ఇప్పటికే చాలా వెలువడ్డాయి.

అయితే ఇప్పుడు Tata Motors యొక్క Tata Punch పరిమాణం గురించిన సమాచారం వెల్లడయ్యింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

పరిమాణంలో Tata Punch అదుర్స్ కదా.. ఇక్కడ చూడండి

నివేదికల ప్రకారం కొత్త Tata Punch చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే పరిమాణం పరంగా దాని ప్రత్యర్థులయిన Mahindra KUV100 NXT మరియు Maruti Ignis కంటే కూడా కొంత వెడల్పుగా ఉంటుంది. మీరు దీనిని గమనించవచ్చు. అయితే ఈ కొత్త SUV హ్యాచ్‌బ్యాక్ విభాగంలో విక్రయించబడుతున్న Maruti Swift మరియు Hyundai Grand i10 Nios వంటి వాటికి సమానంగా ఉండే అవకాశం ఉంటుంది.

పరిమాణంలో Tata Punch అదుర్స్ కదా.. ఇక్కడ చూడండి

Tata Punch యొక్క కొలతలను గమనించినట్లయితే, దీని పొడవు 3,840 మిమీ, వెడల్పు 1,800 మిమీ మరియు ఎత్తు 1,635 మిమీ ఉంటుంది. ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం 187 మిమీ వరకు ఉంటుంది. Tata Punch యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ KUV100, Maruti Ignis, Maruti Swift మరియు Hyundai Grand i10 Nios కంటే ఎక్కువగా ఉంటుంది.

పరిమాణంలో Tata Punch అదుర్స్ కదా.. ఇక్కడ చూడండి
Dimensions Punch KUV100 Swift Ignis Grand i10 Nios
Length 3840mm 3700mm 3845mm 3700mm 3805mm
Width 1800mm 1735mm 1735mm 1690mm 1680mm
Height 1635mm 1655mm 1530mm 1595mm 1520mm
Ground Clearance 187mm 170mm 163mm 180mm 165mm
Wheelbase 2450mm 2385mm 2450mm 2435mm 2450mm

Tata పంచ్ యొక్క పొడవు Maruti Swift కంటే తక్కువగా ఉంటుంది. Maruti Swift పొడవు 3,845 మి.మీ వరకు ఉంటుంది. అయితే ఎత్తు KUV100 కంటే కొంత తక్కువగా ఉంటుంది. KUV100 ఎత్తు 1,655 మిమీ వరకు ఉంటుంది.

పరిమాణంలో Tata Punch అదుర్స్ కదా.. ఇక్కడ చూడండి

ఇటీవల వెల్లడైన చిత్రాల ప్రకారం, Tata Punch బ్రౌన్ కలర్ మోడల్ డ్యూయల్ టోన్ అవతార్‌లో కనిపిస్తుంది. అంతే కాకుండా రూఫ్ బ్లాక్ కలర్‌లో ఉండటం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది చూడటానికి ఒక చిన్న హ్యారియర్ లాగా కనిపిస్తుంది. దీని సైడ్ ప్రొఫైల్ ఫోర్ స్పోక్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

పరిమాణంలో Tata Punch అదుర్స్ కదా.. ఇక్కడ చూడండి

కొత్త Tata Punch SUV ముందు భాగంలో ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో కూడిన బ్లాక్ గ్రిల్ ఉంటుంది. హెడ్‌లైట్ దీనికి దిగువన ప్రొజెక్టర్ యూనిట్ ఉంటుంది. దిగువ భాగంలో బ్లాక్ క్లాడింగ్ ఇవ్వబడింది మరియు హ్యాండిల్‌పై టర్న్ ఇండికేటర్ మరియు ముందు డోర్స్ పై ORVM ఇవ్వబడింది.

పరిమాణంలో Tata Punch అదుర్స్ కదా.. ఇక్కడ చూడండి

Tata Punch యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో సిల్వర్ యాక్సెంట్స్ ఇవ్వబడ్డాయి. దానికి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇవ్వబడింది. టాటా ఆల్ట్రోజ్ మాదిరిగానే, టాటా పంచ్‌లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది, డాష్‌బోర్డ్ మధ్యలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే, IRA కనెక్ట్ చేయబడిన టెక్నాలజీని ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో అందించే అవకాశం ఉంటుంది.

అంతే కాకుండా ఇందులో 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మరియు హార్మోన్ మ్యూజిక్ సిస్టమ్ వంటివి అందించబడ్డాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

పరిమాణంలో Tata Punch అదుర్స్ కదా.. ఇక్కడ చూడండి

Tata Punch ఆల్ఫా-ఎఆర్‌సి ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది, ఈ కారు ఇంపాక్ట్ 2.0 డిజైన్ కలిగి ఉంటుంది. Tata Punch (టాటా పంచ్) అనేది కంపెనీ యొక్క మైక్రో ఎస్‌యూవీ అంతే కాకూండా, ఇది కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్, కావున ఈ కొత్త మోడల్ అనేక ఫీచర్లు మరియు పరికరాలతో రానుంది.

పరిమాణంలో Tata Punch అదుర్స్ కదా.. ఇక్కడ చూడండి

Tata Punch ఎస్‌యూవీని కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ఇందులో మొదటిది 1.2 లీటర్, 3 సిలిండర్ రివోట్రాన్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 86 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఏఎమ్‌టి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది.

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, Tata Punch యొక్క టాప్-ఎండ్ వేరియంట్లలో, కంపెనీ తమ పాపులర్ Altroz iTurbo వేరియంట్లలో ఉపయోగిస్తున్న 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది.

పరిమాణంలో Tata Punch అదుర్స్ కదా.. ఇక్కడ చూడండి

ఇటీవల వెల్లడైన సమాచారం ప్రకారం కొత్త Tata Punch నాలుగు ట్రిమ్లలో విడుదల కానుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిష్డ్ (Accomplished) మరియు క్రియేటీవ్ ట్రిమ్స్. ఇవి మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి.

పరిమాణంలో Tata Punch అదుర్స్ కదా.. ఇక్కడ చూడండి

ఇక కొత్త Tata Punch యొక్క కలర్ ఆప్సన్స్ విషయానికి వస్తే, మూడు సింగిల్ టోన్ కలర్ ఆప్సన్స్ మరియు 6 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. ఈ సింగిల్ టోన్ కలర్ ఆప్సన్స్ ప్యూర్, అడ్వెంచర్ మరియు ఆకాంప్లిష్డ్ ట్రిమ్లలో లభిస్తుంది. అదేవిధంగా డ్యూయెల్ టోన్ కలర్స్ కేవలం టాప్ స్పెక్ ట్రిమ్ అయిన క్రియేటివ్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Tata పంచ్ యొక్క అధికారిక బుకింగ్స్ మరియు ధర వంటివి త్వరలో వెల్లడవుతాయి. అయితే డెలివరీలు రానున్న పండుగ సీజన్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా మంది కస్టమర్లు కంపెనీ విడుదల చేయనున్న కొత్త Tata Punch మైక్రో SUV కోసం ఎదురు చూస్తున్నారు.

Most Read Articles

English summary
Tata punch micro suv dimension details revealed ahead of lunch
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X