Tata Punch ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వెల్లడించిన Tata Motors

దేశీయ వాహన తయారీ సంస్థ Tata Motors (టాటా మోటార్స్) త్వరలో దేశీయ మార్కెట్లో Tata Punch అనే కొత్త మైక్రో SUV ని విడుదల చేయనుంది. అయితే కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త SUV గురించి చాలా సమాచారం వెల్లడయింది. ఇటీవల ఈ Tata Punch పరిమాణానికి సంబంధించిన సమాచారం వెలువడింది. ఇప్పుడు తాజాగా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించిన సమాచారం విడుదలైంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Tata Punch ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వెల్లడించిన Tata Motors

ఇప్పుడు వెలువడిన తాజా నివేదికల ప్రకారం, కంపెనీ కొత్త Tata Punch మైక్రో SUV లో 1.2-లీటర్, మూడు-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ ఉపయోగించనుంది. ఈ ఇంజిన్ ఇప్పటికే కంపెనీ యొక్క ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ Tata Tiago లో ఉపయోగించబడింది.

Tata Punch ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వెల్లడించిన Tata Motors

కంపెనీ ఇందులో ఉపయోగించిన ఇంజిన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్‌ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

Tata Punch ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వెల్లడించిన Tata Motors

Tata Motors ఇప్పుడు ఈ కొత్త Tata Punch ఆటోమేటిక్ వేరియంట్‌లో 'ట్రాక్షన్ ప్రో' మోడ్ ఇవ్వబడుతుంది. ఇది కారు ఎప్పుడైనా బురదలో చిక్కుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. అటువంటి పరిస్థితి నుండి బయటపడటానికి డ్రైవర్ ఈ ఫీచర్‌ని యాక్టివేట్ చేయమని ప్రేరేపిస్తుంది. ఈ ఫీచర్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Tata Punch ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వెల్లడించిన Tata Motors

Tata Punch యొక్క కొలతలను గమనించినట్లయితే, దీని పొడవు 3,840 మిమీ, వెడల్పు 1,800 మిమీ మరియు ఎత్తు 1,635 మిమీ ఉంటుంది. ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం 187 మిమీ వరకు ఉంటుంది. Tata Punch యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ KUV100, Maruti Ignis, Maruti Swift మరియు Hyundai Grand i10 Nios కంటే ఎక్కువగా ఉంటుంది.

Tata Punch ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వెల్లడించిన Tata Motors

ఏవిధంగా ఇప్పటికే వెల్లడైన సమాచారం ప్రకారం Tata Punch ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిష్డ్ మరియు క్రియేటీవ్ అనే 3 ట్రిమ్స్ లలో అందుబాటులో ఉంటుంది. ఏవిధంగా కలర్ ఆప్సన్స్ విషయానికి వస్తే, ఇది మూడు సింగిల్ టోన్ కలర్ ఆప్సన్స్ మరియు 6 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. ఈ సింగిల్ టోన్ కలర్ ఆప్సన్స్ ప్యూర్, అడ్వెంచర్ మరియు ఆకాంప్లిష్డ్ ట్రిమ్లలో లభిస్తుంది. అదేవిధంగా డ్యూయెల్ టోన్ కలర్స్ కేవలం టాప్ స్పెక్ ట్రిమ్ అయిన క్రియేటివ్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Tata Punch ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వెల్లడించిన Tata Motors

Tata Punch SUV ఇప్పటికి విడుదలైన ఫోటోల ప్రకారం, ఇది బ్రౌన్ కలర్ మోడల్ డ్యూయల్ టోన్ అవతార్‌లో కనిపిస్తుంది. అంతే కాకుండా రూఫ్ బ్లాక్ కలర్‌లో ఉండటం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది చూడటానికి ఒక చిన్న హ్యారియర్ లాగా కనిపిస్తుంది. దీని సైడ్ ప్రొఫైల్ ఫోర్ స్పోక్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Tata Punch ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వెల్లడించిన Tata Motors

Tata Punch ఆల్ఫా-ఎఆర్‌సి ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది, ఈ కారు ఇంపాక్ట్ 2.0 డిజైన్ కలిగి ఉంటుంది. Tata Punch (టాటా పంచ్) అనేది కంపెనీ యొక్క మైక్రో ఎస్‌యూవీ అంతే కాకూండా, ఇది కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్, కావున ఈ కొత్త మోడల్ అనేక ఫీచర్లు మరియు పరికరాలతో రానుంది.

Tata Punch ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వెల్లడించిన Tata Motors

కొత్త Tata Punch SUV ముందు భాగంలో ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో కూడిన బ్లాక్ గ్రిల్ ఉంటుంది. హెడ్‌లైట్ దీనికి దిగువన ప్రొజెక్టర్ యూనిట్ ఉంటుంది. దిగువ భాగంలో బ్లాక్ క్లాడింగ్ ఇవ్వబడింది మరియు హ్యాండిల్‌పై టర్న్ ఇండికేటర్ మరియు ముందు డోర్స్ పై ORVM ఇవ్వబడింది.

Tata Punch ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వెల్లడించిన Tata Motors

Tata Punch యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో సిల్వర్ యాక్సెంట్స్ ఇవ్వబడ్డాయి. దానికి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇవ్వబడింది. టాటా ఆల్ట్రోజ్ మాదిరిగానే, టాటా పంచ్‌లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది, డాష్‌బోర్డ్ మధ్యలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే, IRA కనెక్ట్ చేయబడిన టెక్నాలజీని ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో అందించే అవకాశం ఉంటుంది.

Tata Punch ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వెల్లడించిన Tata Motors

అంతే కాకుండా ఇందులో 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మరియు హార్మోన్ మ్యూజిక్ సిస్టమ్ వంటివి అందించబడ్డాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Tata Punch ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వెల్లడించిన Tata Motors

Tata Punch ఎస్‌యూవీని కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ఇందులో మొదటిది 1.2 లీటర్, 3 సిలిండర్ రివోట్రాన్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 86 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఏఎమ్‌టి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది.

Tata Punch ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వెల్లడించిన Tata Motors

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, Tata Punch యొక్క టాప్-ఎండ్ వేరియంట్లలో, కంపెనీ తమ పాపులర్ Altroz iTurbo వేరియంట్లలో ఉపయోగిస్తున్న 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

English summary
Tata punch micro suv engine specification revealed ahead of debut details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X