Tata Punch లాంచ్ ఎప్పుడు ? బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయ్ ?
ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) తాజాగా ఆవిష్కరించిన సరికొత్త మైక్రో ఎస్‌యూవీ 'టాటా పంచ్' (Tata Punch) ను కంపెనీ ఈ పండుగ సీజన్ లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ చిన్న ఎస్‌యూవీని అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ ప్రారంభంలో తీసుకురావచ్చని తెలుస్తోంది.

ప్రారంభానికి కొద్ది రోజుల ముందే Tata Punch బుకింగ్ లను కూడా కంపెనీ ప్రారంభించే అవకాశం ఉంది. ఇటీవల కంపెనీ ఈ విషయాన్ని తమ సోషల్ మీడియాలో ధృవీకరించింది. Punch మైక్రో ఎస్‌యూవీ Tata యొక్క ఎంట్రీ లెవల్ మోడల్ అని నమ్ముతారు, అంతేకాకుండా ఇది అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో రాబోతోంది.

సరసమైన ధరకే సరికొత్త ఫీచర్లతో కొత్త కారును లేదా తమ మొదటి కారును కొనాలని చూసేవారికి Tata Punch ఓ చక్కటి ఆప్షన్ గా ఉంటుంది. ఇటీవలే Tata Punch ఎక్స్టీరియర్ డిజైన్ ను వెల్లడి చేసే కొన్ని చిత్రాలను కంపెనీ విడుదల చేసింది. ఈ కొత్త కారును ALFA ARC ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మిస్తున్నారు.

ఇందులో Tata Motors యొక్క 2.0 డిజైన్ లాంగ్వేజ్ ఉపయోగించబడుతుంది. ముందు వైపు నుండి Punch ఎస్‌యూవీ చాలా అగ్రెసివ్ డిజైన్ ను కలిగి ఉంటుంది. గతేడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించిన HBX కాన్సెప్ట్ ఆధారంగా Punch మైక్రో ఎస్‌యూవీ ప్రొడక్షన్ వెర్షన్ ను రూపొందించారు.

Tata Punch మైక్రో ఎస్‌యూవీలో ముందు వైపు ఆకర్షణీయంగా కనిపించే హ్యారియర్ ప్రేరేపిత బంపర్ మరియు గ్రిల్ డిజైన్ ను గమనించవచ్చు. ఇందులో చిన్న సైజులో ఉండే ఫ్రంట్ గ్రిల్ మరియు బంపర్ లపై అమర్చిన ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ లు మరియు ఫాగ్ ల్యాంప్ లు ఉన్నాయి.

ఈ కారులోని హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్ క్లస్టర్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, సైడ్ మిర్రర్స్, మజిక్యులర్ బానెట్ లైన్స్, డోర్ హ్యాండిల్స్, ఫ్యూయెల్ క్యాప్ డిజైన్ మరియు పియానో బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడిన ఏ, బి, సి పిల్లర్స్ మొదలైన డిజైన్ అంశాలు గతంలో కంపెనీ ప్రదర్శించిన Tata HBX కాన్సెప్ట్ తో సమానంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

ఈ కారులో సన్నని ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, డ్యూయల్ టోన్ సైడ్ మిర్రర్లు, ఆకర్షణీయమైన ఫోర్ స్పోక్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ రూఫ్ మరియు రూఫ్ రైల్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది సైడ్ నుండి కూడా గొప్ప రూపాన్ని కలిగి ఉంటుంది. Tata Punch వెనుక రెండు వైపులా Y- ఆకారంలో ఉండే టెయిల్ లైట్ క్లస్టర్ మరియు దాని మధ్యలో టాటా లోగో, అలాగే ఎగువన హై-మౌంట్ స్టాప్ ల్యాంప్ కూడా ఉన్నాయి.

డ్యూయల్ టోన్ అవతార్ లో ఈ చిన్న ఎస్‌యూవీ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ప్రొడక్షన్ వెర్షన్ లో కూడా కంపెనీ ఈ కలర్ ఆప్షన్లను అలానే కొనసాగించవచ్చని తెలుస్తోంది. Tata Motors ఈ చిన్న కారుని అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో, అందించే అవకాశం ఉంది. తాజాగా విడుదలైన టీజర్ కూడా ఈ మైక్రో ఎస్‌యూవీ వివిధ రకాల ట్రాక్షన్ మోడ్‌లను అందించే, ఈ విభాగపు మొదటి వాహనం అని సూచిస్తుంది.

కాగా, ఈ చిన్న కారుకి సంబంధించిన ఇంటీరియర్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించనప్పటికీ, ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, IRA కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మొదలైన ఫీచర్లను కలిగి ఉంటుందని సమాచారం.

కంపెనీ విడుదల చేసిన కొత్త టీజర్‌లో, Tata Punch లో అనే సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుందని తెలిపింది. సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ ను పొందిన Tata Altroz కారును కూడా ఇదే ALFA ARC ప్లాట్‌ఫామ్ పై నిర్మించిన నేపథ్యంలో, కొత్త పంచ్ ఎస్‌యూవీ సేఫ్టీ గురించి ఎలాంటి సందేహాలు అవసరం లేదని తెలుస్తోంది.

Tata Punch ఎస్‌యూవీలో కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్‌లు ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో మొదటిది 1.2-లీటర్, 3 సిలిండర్ రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ 86 బిహెచ్‌పి పవర్ ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, రెండవది 1.2 లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్ ను మరియు 140 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది.

ఈ ఇంజన్లు 5 స్పీడ్ మాన్యువల్ లేదా AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. Tata Motors నుండి రానున్న ఈ సరికొత్త Punch మైక్రో ఎస్‌యూవీ ఈ విభాగంలో ప్రధానంగా Mahindra KUV100, Maruti Suzuki Ignis మరియు Maruti Suzuki S-Presso వంటి మోడళ్లతో పోటీపడుతుందని అంచనా.


Click it and Unblock the Notifications








