భారత్‌లో ఆవిష్కరించబడిన కొత్త 'Tata Punch'; పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో ఎంతోమంది వాహన పప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న, Tata Motors యొక్క కొత్త మైక్రో SUV Tata Punch ఎట్టకేలకు మార్కెట్లో ఆవిష్కరించబడింది. ఈ కొత్త Tata Punch అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలతో చాలా ఆకర్శణీయంగా ఉంది. కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ కూడా అధికారికంగా ప్రారంభించింది. కావున కొనువులుదారులు కంపెనీ డీలర్‌షిప్ లేదా వెబ్‌సైట్‌ను సందర్శించి రూ. 21,000 లతో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి.

భారత్‌లో ఆవిష్కరించబడిన కొత్త 'Tata Punch'; పూర్తి వివరాలు

Tata Motors ఇప్పటికే ఈ మైక్రో SUV గురించి అందించిన సమాచారం ప్రకారం, ఇది ఆల్ఫా ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. Tata Punch నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్‌ వేరియంట్స్. ఈ నాలు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి.

భారత్‌లో ఆవిష్కరించబడిన కొత్త 'Tata Punch'; పూర్తి వివరాలు

Tata Punch కలర్ ఆప్సన్స్:

దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త Tata Punch మొత్తం 7 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.

అవి:

  • ఓర్క్స్ వైట్
  • అటామిక్ ఆరెంజ్
  • డేటోనా గ్రే
  • మెటోర్ బ్రాంజ్
  • కాలిప్సో రెడ్
  • ట్రాపికల్ మిస్ట్
  • టోర్నాడో బ్లూ
  • భారత్‌లో ఆవిష్కరించబడిన కొత్త 'Tata Punch'; పూర్తి వివరాలు

    Tata Punch డిజైన్:

    కొత్త Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. ఇది చాలా ఆకర్శణీయంగా ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది.

    భారత్‌లో ఆవిష్కరించబడిన కొత్త 'Tata Punch'; పూర్తి వివరాలు

    Tata Punch యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఉన్న రూఫ్‌ కూడా చాలా ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్ ఇవ్వబడింది. అయితే ORVM లు కూడా తెల్లగా ఉంటాయి.

    భారత్‌లో ఆవిష్కరించబడిన కొత్త 'Tata Punch'; పూర్తి వివరాలు

    Tata Punch ఇంటీరియర్ మరియు ఫీచర్స్:

    Tata Punch యొక్క ఇంటీరియర్ డ్యూయల్-టోన్ థీమ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉపయోగించబడింది. ఇదే డ్యూయెల్ టోన్ కలర్ దాని డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఇది కాకుండా, దానిలో కనిపించే AC వెంట్‌లపై బ్లూ హైలైట్‌లు మరియు లోపలి డోర్ హ్యాండిల్స్‌లో వైట్ ఇన్సర్ట్‌లు ఉపయోగించబడ్డాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

    భారత్‌లో ఆవిష్కరించబడిన కొత్త 'Tata Punch'; పూర్తి వివరాలు

    Tata Punch మైక్రో SUV 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి వాటితో పాటు, 27 కనెక్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇందులో ఆటోమేటిక్ ఎసి, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

    భారత్‌లో ఆవిష్కరించబడిన కొత్త 'Tata Punch'; పూర్తి వివరాలు

    Tata Punch ఇంజిన్ స్పెసిఫికేషన్స్:

    Tata Punch అద్భుతమైన పర్ఫామెన్స్ అందింస్తుంది, దీని కోసం 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించనుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

    భారత్‌లో ఆవిష్కరించబడిన కొత్త 'Tata Punch'; పూర్తి వివరాలు

    Tata మోటార్స్ కొత్త Tata Punch SUV యొక్క ఆటోమేటిక్ వేరియంట్‌లో 'ట్రాక్షన్ ప్రో' మోడ్ కూడా అందించింది. ఈ ఫీచర్ వల్ల కారు బురదలో చిక్కుకున్నప్పుడు బయటపడటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త Tata పంచ్ కేవలం 6.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. మొత్తానికి ఇది అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం వల్ల వాహన వినియోగాదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

    భారత్‌లో ఆవిష్కరించబడిన కొత్త 'Tata Punch'; పూర్తి వివరాలు

    Tata Punch యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి.

    భారత్‌లో ఆవిష్కరించబడిన కొత్త 'Tata Punch'; పూర్తి వివరాలు

    Tata Punch యొక్క కోలతలను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. దీని ప్రకారం Tata Punch పొడవు 3,840 మిమీ, 1,800 మిమీ వెడల్పు మరియు 1635 మిమీ ఎత్తు మరియు 2,450 మిమీ వీల్‌బేస్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 366 లీటర్ల బూట్ స్పేస్ కూడా అందుబాటులో ఉంటుంది.

    భారత్‌లో ఆవిష్కరించబడిన కొత్త 'Tata Punch'; పూర్తి వివరాలు

    భారతీయ మార్కెట్లో మైక్రో SUV లకు మంచి ప్రజాదరణ ఉంది. కావున కంపెనీ ఈ నేపథ్యంలో విడుదల చేయనున్న ఈ కొత్త Tata Punch భారతీయ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతుందని భావిస్తున్నాము. Tata Punch త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల కానుంది, Tata Punch ఈ విభాగంలో Maruti Suzuki Ignis, Wagon R, Ford Freestyle మరియు Mahindra KUV100 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Tata punch micro suv revealed ahead of india launch details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X